ఆగష్టు 1-14 వరకు విశాఖ నగర సమస్యల పరిష్కారానికై - సిపిఐ(యం) ప్రజాపోరు

72వార్డుల్లో పాదయాత్రలు, సభలు, గ్రూపుమీటింగ్‌లు
    ఆగష్టు 12, 14 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు
    లక్షలాది కరపత్రాలు, బుక్‌లెట్స్‌తో ప్రచారం.

    విశాఖనగరం స్మార్ట్‌సిటీగా ప్రకటించారు. సామాన్య మద్యతరగతి, పేద ప్రజల సమస్యలు పట్టించుకొనే నాధుడే లేడు. ఫలితంగా నగర ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక ప్రపంచబ్యాంకు సంస్కరణలు కూడా శరవేగంగా నగరంలో అమలు చేస్తున్నారు. పౌరసేవలను ప్రైవేటీకరిస్తున్నారు. కొండలు, భూములు, సముద్రతీరం, ఇతర వనరులను విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌సంస్థలకు ధారాధత్తం చేస్తున్నారు. జివిఎంసికి ఎన్నికలు పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సిపిఐ(యం) నగరంలో ఆగష్టు 1  నుండి 14 వరకు నగర సమ్యలపైన మరియు నగర సమగ్రాభివృద్ధికొరకు ప్రజాపోరు చేపట్టింది. ఈ కార్యక్రమాలలో ప్రజలు పాల్గొనాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గ్రేటర్‌ విశాఖనగర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
1. జివిఎంసికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.
2. ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటించాలి.
3. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో మౌలికసదుపాయాలు మెరుగుపర్చాలి. నగరంలో ఉన్న 26 ఎస్‌సి, ఎస్‌టి, బిసి హాస్టల్స్‌కు సొంతభవనాలు నిర్మించాలి. ఉపాధ్యాయలును నియమించాలి.
4. కెజిహెచ్‌ను ఆధునీకరించాలి. గుండె ఆపరేషన్‌ విభాగాన్ని ప్రైవేటీకరించరాదు. డాక్టర్స్‌, సిబ్బందిని నియమించాలి. మందులు సరఫరా చేయాలి.
5. విమ్స్‌ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి. 100కోట్లు కేటాయించాలి. ప్రైవేటీకరణ చేయరాదు.
6. జివిఎంసి డిస్పెన్సరీ సేలు మెరుగుపర్చాలి. డాక్టర్స్‌, సిబ్బందిని పెంచాలి. బడ్జెట్‌లో 3% నిధులు కేటాయించాలి.
7. పేదలకు ఇళ్లు, ఇళ్ళస్థలాలివ్వాలి. నగరంలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉన్న పేద ఇళ్ళకు పట్టాలివ్వాలి.
8. మురికివాడ వాసులకు నివాసహక్కు కల్పించాలి. మౌలిక సదుపాయాలు మెరుగు పర్చాలి. తొగించరాదు. బడ్జెట్‌లో 40%నిధులు కేటాయించాలి.
9. మధురవాడ, కొమ్మాది, పరదేశిపాలెం, అగనంపూడి, పరవాడ, మధీనాభాగ్‌ ప్రాంతాల్లోను జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం, రాజీవ్‌గృహకల్ప ఇళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలి.
10. ప్రైవేట్‌రంగంలో దళితులు, గిరిజనులు, బహీనవర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి.
11. 5 కొండలు బడాసంస్థలకు కట్టబెట్టే చర్యలు విడానాడాలి. ‘జూ’పార్కును తరలించరాదు. శివాజీపార్క్‌ను ప్రైవేట్‌పరం చేయరాదు.
12. పిపిపి ముసుగులో జివిఎంసి ఆస్థులను, వాణిజ్య కాంప్లెక్స్‌ను, కళ్యాణ మండపాలను ప్రైవేట్‌వారికి ధారాధత్తం చేయరాదు.
13. పౌరసేవలను ప్రైవేటీకరించరాదు. ఆస్థిపన్ను పెంచే ఆలోచన విరమించాలి.
14. ప్రతి ఇంటికి రోజుకి 750 లీటర్లు మంచినీరు ఉచితంగా సరఫరా చేయాలి. నీటి ఛార్జీలు పెంచరాదు. వీధి కొళాయిలు తొగించరాదు.
15. పారిశుద్ధ్యాన్ని ప్రైవేటీకరించరాదు. మురుగునీటిపై పన్ను విధించరాదు.
16. బి.ఆర్‌.టి.ఎస్‌ రోడ్లు వెంటనే ప్రారంభించాలి. గాజువాక నుండి హనుమంతువాక మధ్య 7 ఫ్లైఓవర్స్‌ నిర్మించాలి.
17. ఉడా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం విడనాడాలి. పేదలకు, సామాన్యులకు ఇళ్ళస్థలాలు ఇవ్వాలి.
18. సింహాచలం పంచగ్రామాల భూసమస్య, గాజువాక ఇనాం భూ సమస్య వెంటనే పరిష్కరించాలి.
19. బీచ్‌కోతను నివారించాలి. సిఆర్‌జెడ్‌ను కఠినంగా అమలు చేయాలి.
20. కాలుష్యాన్ని నివారించాలి. పర్యావరణాన్ని కాపాడాలి.
21. అపార్ట్‌మెంట్‌ వాసులకు ‘‘అంబుడ్స్‌మెన్‌’’ వ్యవస్ధను ఏర్పాటు చేయాలి.
22. తొగించిన రేషన్‌కార్డులు, పెన్షన్స్‌ను పునరుద్ధరించాలి.
23. మరుగుదొడ్లులేని ప్రతి ఇంటికి మరుగుదొడ్లు మంజూరుచేయాలి. నిధులు పెంచాలి.
24. మెట్రోరైల్‌ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు మంజూరు చేయాలి.
25. స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి.