ప్రజల అభివృద్ధే నిజమైన అభివృద్ధి - మాజీ ఎం.ల్.సి లక్ష్మణ్ రావ్

ప్రజల జీవన ప్రమణాలు మొరుగుపదటం, వారి కొనుగోలుశక్తి పెరగటం ద్వార మాత్రమే నిజమైన అభివృధి సాధ్యమవుతుంది అని లక్ష్మణ్ రావు అన్నారు. ఆగస్టు 1నుండి 14 వరుకు జరిగె రాజకీయ ప్రచారం సందర్భంగా స్థానిక సి.పి.యం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేసంలో మాట్లాడుతూ, 73,74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థలకు సంబంధించి ముఖ్యమేనవన్నారు. వాటి ప్రకారం రాష్ట్ర పైనాన్స్ ఫెడరేషన్ లు ఏర్పాటు చేయాలని, మున్సిపాల్టీలకు 18 హక్కులు కల్పించాలి. కాని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చెయటం లేదు, జె ఎన్ ఎన్ యు ఆర్ ఎం పథకానికి మరో రూపమే స్మార్ట్ సిటీలని, వాటి వల్ల ప్రజలపై పన్నుల భారం పెరుగుతాయి తప్ప సామాన్యులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. నగరంలో రూ. 430 కోట్లతో జరుగుతున్న సమగ్ర తాగునీటి పథకం పనులు పారదర్శకంగా జరగట్లేదు. ఘన వ్యర్థ పదార్ధల నిర్వహణ కోసం రీసీక్లిర్
విధానం చేపట్టాలి. నగరంలో ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తే ట్రఫిక్ సమస్య తగ్గుతుంది. నగరంలో విలీనమైన గ్రామల్లో మౌలిక సదుపాయలు కల్పీంచాలని డిమండ్ చేశారు.