మైనార్టీల సమస్యలపై సదస్సు..

నెల్లూరు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీల సమస్యలపై సదస్సు జరిగింది. మైనార్టీలు అమీరులు కాదు గరీబులని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ముస్ల్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయన్నారు. వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం హయాంలో మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. ఘర్‌వాపసి పేరుతో మత మార్పిడి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన మైనార్టీలకు బడ్జెట్‌ కేటాయించాలన్నారు. సచార్‌కమిటీ, రంగనాధ్‌మిశ్రా సిఫార్సులు బుట్ట దాఖలు చేశారని విమర్శించారు. ఉర్దూ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనందున మైనార్టీల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారన్నారు.