విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా సిపిఎం నాయకులను, రైతు నాయకులను అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తోటపల్లి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రాజెక్టు కింద కాల్వలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించాలని ప్రాజెక్టు నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు కూడా నిర్ణయించాయని తెలిపారు. వారికి అనుమతి ఇవ్వకపోగా ఇళ్ల నుంచి అర్ధరాత్రి సిపిఎం నాయకులను, నిర్వాసితుల నాయకులు బి రమణ, బి దాసు, సదానందంలను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ అరెస్టులు అత్యంత...
District News
విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభించాయని, తక్షణం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వ్యాధులను అరికట్టే చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సిపిఎం ప్రజారోగ్య కమిటీ రాష్ట్ర కన్వీనర్ సిహెచ్.నర్సింగరావు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజారోగ్య రాష్ట్ర కమిటీ సభ్యులు టి.కామేశ్వరరావు, బిఎల్ నారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 13వేల మలేరియా కేసులు నమోదు కాగా, ఒక్క విశాఖలోనే 7210 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు 27,813 నమోదయ్యాయన్నారు.రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు 27,813 నమోదయ్యాయన్నారు. డెంగ్యూ కేసులు ఒక్క చిత్తూరు జిల్లాలోనే 700కు పైగా నమోదయ్యాయని...
ప్రభుత్వ భూములు, పేదలు సాగు చేసుకుంటున్న భూములు సహా మొత్తం 15 లక్షల ఎకరాలతో రాష్ట్రంలో ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వెల్లడించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి ఒక సెంటు భూమి కూడా పేదలకు పంచలేదన్నారు. ఈ విధానాలు సామాన్య ప్రజల సంక్షేమానికి చేటు తెస్తాయని, తమ పార్టీ వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు అధ్యక్షతన సోమ, మంగళవారాల్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవాడలో నిర్వహించారు.విద్య, వైద్యాన్ని రైతుల భూములనూ కార్పొరేట్ రంగానికి ధారాదత్తం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కార్పొరేట్ పరిపాలన ప్రవేశపెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు. ఉన్నత విద్య బాధ్యత తమది కాదనీ, దాన్ని కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యతగా భóుజస్కం ధాలపై వేసుకోవాలని ఉపాధ్యాయ దినోత్సవం నాడు స్వయానా ముఖ్యమంత్రే చెప్పారని మధు గుర్తు చేశారు. తదనుగుణంగానే ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. పెద్ద సంఖ్యలో పాఠశా లలు, సంక్షేమ...
ఎల్‌ఐసి, ఏజెంట్ల రక్షణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఎంపీ తపన్‌సేన్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో గురువారం ఎల్‌ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన 4వ ఆలిండియా కాన్ఫరెన్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌ఐసినీ, ఏజెంట్ల వ్యవస్థనూ నిర్వీర్యం చేయడం జాతి వ్యతిరేక చర్య అని, ఈ అంశంలో కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు.స్టాక్ మార్కెట్‌లలో పింఛన్లు, ప్రావిడెంట్ ఫండ్ సొమ్మును పెట్టడాన్ని అందరూ వ్యతిరేకిం చాలన్నారు. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ఎల్‌ఐసి ప్రజలతో పొదుపు చేయించడంలో, వారి డబ్బుకు రక్షణ కల్పించడంలో కీలకపాత్ర...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్ మీదుగా సాగిన ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...
దేశవ్యాపితంగా అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గూడాల్లో పని చేసే వేలాది మంది కార్మికులు సంపూర్ణంగా సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నగర్ లోని మిర్చివర్కస్ యూనియన్ (సి ఐ టి యు ) కాయాలయం నుండి చుట్టుగుంట సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడూతూ మిర్చి రంగంలో షుమారు 20 వేల మందికిపైగా పనిచేస్తున్నా కష్టానికి తగ్గకూలీ, ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలో పని చేసే...
దేశవ్యాపితంగా అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గూడాల్లో పని చేసే వేలాది మంది కార్మికులు సంపూర్ణంగా సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నగర్ లోని మిర్చివర్కస్ యూనియన్ (సి ఐ టి యు ) కాయాలయం నుండి చుట్టుగుంట సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడూతూ మిర్చి రంగంలో షుమారు 20 వేల మందికిపైగా పనిచేస్తున్నా కష్టానికి తగ్గకూలీ, ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలో పని చేసే...