రాష్ట్ర కమిటీ సమావేశాలు..

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు అధ్యక్షతన సోమ, మంగళవారాల్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవాడలో నిర్వహించారు.విద్య, వైద్యాన్ని రైతుల భూములనూ కార్పొరేట్‌ రంగానికి ధారాదత్తం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కార్పొరేట్‌ పరిపాలన ప్రవేశపెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు. ఉన్నత విద్య బాధ్యత తమది కాదనీ, దాన్ని కార్పొరేట్‌ రంగం సామాజిక బాధ్యతగా భóుజస్కం ధాలపై వేసుకోవాలని ఉపాధ్యాయ దినోత్సవం నాడు స్వయానా ముఖ్యమంత్రే చెప్పారని మధు గుర్తు చేశారు. తదనుగుణంగానే ప్రైవేట్‌ యూనివర్సిటీల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిందన్నారు. పెద్ద సంఖ్యలో పాఠశా లలు, సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కాలం చెల్లిన ఆర్డినెన్స్‌ను అడ్డం పెట్టుకుని బందర్‌ పోర్టు నిర్మాణానికి 30వేల ఎకరాల భూము లను తీసుకోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందని తెలిపారు. సమీకరణలో భూ ములను ఇవ్వకపోతే ఆర్డినెన్స్‌ ద్వారా సేకరిస్తామని రైతులను ప్రభుత్వం బెదిరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బందర్‌ పోర్టు నిర్మాణానికి కమ్యూనిస్టులు వ్యతిరేకమని ప్రభుత్వం చెబుతోందని, ఇది వాస్తవం కాదని స్పష్టం చేశారు. పోర్టుల నిర్మాణంతో టిడిపి ప్రభుత్వం భూముల వ్యాపారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.