కార్పొరేట్ల సేవలొ కేంద్ర రాష్త్ర ప్రభుత్వలు:- వి.కృష్ణయ్య

దేశవ్యాపితంగా అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజీలు, మిర్చి గూడాల్లో పని చేసే వేలాది మంది కార్మికులు సంపూర్ణంగా సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నగర్ లోని మిర్చివర్కస్ యూనియన్ (సి ఐ టి యు ) కాయాలయం నుండి చుట్టుగుంట సెంటర్ వరకు కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడూతూ మిర్చి రంగంలో షుమారు 20 వేల మందికిపైగా పనిచేస్తున్నా కష్టానికి తగ్గకూలీ, ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలో పని చేసే హమాలీలకు, ఇతర కార్మికులకు చట్టాలు కొన్నైనా అమలవుతున్నా మిర్చి రంగంలో పని చేసే హమాలీలకు ఒక్క చట్టం కూడా అమలు చేయటం లేదని గుంటూరు మిర్చియార్డుకు ఏడాదికి రూ.50 కోట్లకు పైగా ఆదాయం ఉన్నా, ఒక్క రూపాయి కూడా కార్మికుల సక్షేమానికి ఖర్చు పెట్టటం లేదని పేర్కొన్నారు. కోల్డ్ స్టోరేజిల్లో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికులతో యాజమాన్యాలు చట్ట విరుద్ధంగా పని చేయుస్తున్నా కార్మిక శాఖ పట్టీపట్టనట్లు వ్యవరిస్తున్నారు. వేగంగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, ఉల్లిపాయ్యలు సామాన్యుడు కొనే పరిస్థితి లేదన్నారు. ఈ నేపధ్యంలో ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవట్లేదని విమర్శించారు. కేంద్రంలో మోడి ప్రభుత్వం కార్పోరేట్లకు సేవ చేస్తూ కార్మికులను బలి చేస్తున్నదని, కార్మికులు ఐక్యంగా ఈ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.