District News

రాజధానిలో విధించిన 144 సెక్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, వ్యవసాయ కార్మికులు, ఇతర భూమిలేని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ చేపట్టాలని గుంటూరులో మంగళవారం జరిగిన సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. 'రాజధాని ప్రాంతంలో నిర్భంధం' అనే అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సభలో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు ప్రసంగించారు.ప్రభుత్వం రాజధాని ప్రజలకిచ్చిన ఒక్క వాగ్థానం కూడా అమలు చేయకపోగా నిర్భంధాలు ప్రయోగిస్తోంది. ఈ విధానాలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఎదుర్కొవాలి. నిర్భంధాలకు ప్రయోగిస్తే ప్రజలు ఏ గుణపాఠం చెబుతారో రాష్ట్ర...

శ్రీకాకుళం జిల్లా సోంపేట చిత్తడి నేలల్లో బహుళ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 329ను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.తులసీదాస్‌ డిమాండ్‌ చేశారు. చిత్తడి నేలల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించడం చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చిత్తడి నేలల సంరక్షణ చట్టంలోని 4 (1) (ఱఱ) ప్రకారం బోట్‌ జెట్టీ తప్ప, ఇతర ఏ కట్టడమూ నిర్మించరాదని చెప్పారు. ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, స్థానిక ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో గుడినీ గుడిలో లింగాన్ని మింగే స్వాములు బయలుదేరారు. వంశపారం పర్యంగా ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న దేవాలయ మాన్యాలను దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన మాఫియా రంగంలోకి దిగింది. సుమారు 150 నుంచి 200 ఎకరాలను కైంకర్యం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు జరుగుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండొందల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసినట్లు సమాచారం. ఈ భూమాయకు తెలుగుదేశం పార్టీ యువ నేత తన స్వంత మనుషులను రాజధాని గ్రామాల్లో దించి ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు ఆరోపణలొస్తున్నాయి. గుంటూ రు జిల్లాలోని రాజధాని ఏరియాలో సర్కారు ప్రతిపాదించిన భూసమీకరణ కిందకురాని రైతుల భూములను సేకరిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే తొలిదశలో...

కాకినాడ సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను జడ్‌పి ఛైర్మన్‌ నామన రాంబాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపడంతోపాటు సమాజ మార్పునకు పుస్తక పఠనం దోహదం పడుతుందన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ 'నేను మలాలా' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

అసైండ్, సీలింగ్ సాగుదారులకు వెంటనే కౌలు చెక్కులు ఇవ్వాలని , పట్టాభూమితో సమాన ప్యాకేజి ఇవ్వాలని కోరుతూ అమరవతి (రాజధాని) ప్రాంతంలో సిపిఎం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు..శాంతియుతంగా దీక్షలు చేస్తున్న దళితులు, సిపిఎం నాయకుల్ని పోలీసులు  అక్రమంగా అరెస్టులు చేసి స్టేషనుకు తరలించారు.వీరిపై 144 సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేసారు. 

బందరు పోర్టు నిర్మాణానికి ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాఫీగా సాగుతున్న పోర్టు నిర్మాణ పనులకు రాత్రికిరాత్రే భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేసి గ్రామాల్లో అలజడి సృష్టించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 వేల ఎకరాల్లో పోర్టు నిర్మించవచ్చన్న టిడిపి నాయకులు, ఇప్పుడు 30 వేల ఎకరాలకు నోటిఫికేషన్‌ ఎందుకు జారీచేశారో చెప్పాలని ప్రశ్నించారు. భూములివ్వకపోతే పోర్టు నిర్మాణం జరగదని బెదిరింపులకు దిగడం బాధాకరమన్నారు.పోర్టు పేరుతో 30 వేల ఎకరాలు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు.ల్యాండ్‌పూలింగ్‌...

రాజధానికి భూములిచ్చిన రైతుల జీవనస్థితి మారిపోతోంది. భూములిస్తే అకాశ హర్య్మాలు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తదనుగుణంగా కనీస శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో వారు గేదెలు కాసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాగులేక పోవడంతో పొలాలన్నీ బీళ్లుగా మారాయి. తోటల్లో పిచ్చిచెట్లు మొలిచి నడవలేని పరిస్థితి ఏర్పడింది. మాగాణుల్లో మోకాళ్ల ఎత్తున గడ్డి మొలిచింది. వాటిని చూసి రైతులు చలించిపోతున్నారు. కొద్దిపాటి మొత్తాన్ని వెచ్చించి రైతులు ఒకటీ లేదా రెండు గేదెలు కొనుగోలు చేసుకున్నారు. సాగు చేసిన పొలాల్లోనే వాటిని మేపుకొంటూ కాలం గడుపుతున్నారు. జరీబు గ్రామాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. సహజంగానే సారవంతమైన నేలలు...

అభివృద్ధిలో అట్టడుగున ఉన్న వ్యవసాయ కార్మికులతో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు మమేకం కావాలని రైతుసంఘం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గురువారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.300 వేతనం అందించాలని వర్క్‌షాప్‌ తీర్మానించిందని వెంకటేశ్వర్లు తెలిపారు. వలసలు నివారిస్తామని, ఎప్పుడు పని అడిగితే అప్పుడు పని చూపిస్తామని చట్టంలో పేర్కొన్నా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.

 బందరు పోర్టు భూముల ప్రభావిత గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విస్తృతంగా పర్యటించారు.భూ బ్యాంక్‌ పేరుతో రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. బందరు తీరంలో 30 వేల ఎకరాలు సమీకరిస్తోందని, ఇందులో 14 వేల ఎకరాల ప్రైవేటు భూములున్నట్లు చెబుతూ మిగిలిన 16 వేల ఎకరాల్లో సాగుచేసుకుంటున్న రైతులకు మొండిచెయ్యి చూపించేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. సాగుదారులకు అండగా ఉంటామని, పోరాటం చేసి ప్రభుత్వ తీరును ఎండగడతామని బాధితులకు భరోసా ఇచ్చారు.

Pages