ఇళ్ల స్థలాలు, పట్టాలు, సాగు భూముల కోసం పేదలు కదం తొక్కారు. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రైతు సంఘం సంయుక్తంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం చేపట్టిన ధర్నాకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది పేదలు తరలొచ్చారు.నీరు-చెట్టులో భాగంగా పేదలు ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో చెరువులు తవ్వి తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందని పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాసిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడారు. ఇళ్లస్థలాలు ఇస్తామని ఎన్నికలప్పుడు హామీనిచ్చిన చంద్రబాబు దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల భూములు లాక్కుని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చ రించారు. ఈ సమస్యపై...
District News
ఏపీ సర్కార్ సీఆర్డీఏ చట్టాన్ని తాజాగా మళ్లీ సవరించింది. దీంతో ఇప్పటి వరకున్న 7068.20 చదరపు కిలోమీటర్ల సీఆర్డీఏ పరిధి...ఇప్పుడు 8,352.69 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంటే అదనంగా 1,284.49 చదరపు కిలోమీటర్లు పెరిగింది.కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణం పూర్తిగా సీఆర్డీఏ లో కలిసింది. దీంతోపాటు వివిధ మండలాల్లోని 136 గ్రామాలను ఇందులో కలిపారు. గుంటూరు జిల్లాలోనూ 30 గ్రామాలు సీఆర్డీఏ లో అదనంగా కలిశాయి.
చేతివృత్తిదార్లకు ఉపాధి చూపడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయ వాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో మంగళవారం జరిగిన చేతివృత్తిదారుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేట్ రంగంలో బిసిలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాం డ్ చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో బిసిలకిచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరిం చారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించినప్పటికీ పూర్తిస్థాయిలో ఆచర ణకు నోచడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అన్నివర్గాల ప్రజలనూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని...
రాష్ట్రంలోని హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికిస్తున్న మెస్ ఛార్జీ రూ.750 నుంచి రూ.1500లకు పెంచాలని, 50 మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్నారనే సాకుతో మూసివేసిన 220 హాస్టళ్లను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన మంగళవారం జిల్లా కలెక్టరేట్లను ముట్టడించారు. అనంతపురం, కర్నూలు, కడప కలెక్టరేట్ల వద్ద జరిగిన ఆందోళనల్లో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జీ చేశారు. కర్నూల్లో పదిమందిని అరెస్టు చేశారు. అనంతపురంలో వేలాది మంది విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి, కలెక్టరేట్ చేరుకొని ముట్టడించారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు గేట్లు ఎక్కి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈక్రమంలో...
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలో గిరిజనులు మంగళవారం భూ పోరాటం చేశారు. సిపిఎం ఆధ్వర్యాన 60 ఎకరాల సీలింగ్ భూముల్లో జెండాలు పాతారు. ఆ భూమిలోని తుప్పలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.
మండలంలోని చింతలపూడి పంచాయతీ పరిధిలోని 23, 32, 37 సర్వే నెంబర్లలో 60 ఎకరాల సీలింగ్ భూములను గతంలో కొంత మంది స్థానిక గిరిజనులకు ప్రభుత్వం పట్టాలిచ్చారు. పట్టణ ప్రాంతానికి చెందిన బడాబాబులు గిరిజనులను, పేదలను ప్రలోభాలకు గురిచేసి, డబ్బు ఆశజూపి ఆ భూములను లాక్కొని సొంతం చేసుకున్నారు. దీనిపై 2007లో కలెక్టర్‌కు సిపిఎం ఫిర్యాదు చేయగా, స్పందించిన ఆయన గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగించాలని తహసీల్దారును ఆదేశించారు. ఆ మేరకు భూములను గిరిజనులకు అప్పగించినప్పటికీ...
‘‘లాజిస్టిక్ హబ్’’ కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రయత్నాలు సాగుదార్లను, గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మునగపాక, పరవాడ, అనకాపల్లి రూరల్ మండలాల్లోని (వెంకటాపురం, రామానాయుడుపేట, తానాం, తాడి, వల్లూరు, ఎరుకువానిపాలెం, రాజుపాలెం, గొర్లివానిపాలెం) 8 గ్రామాల్లో సుమారు 486 ఎకరాల భూమును సేకరిస్తున్నారు.
‘‘లాజిస్టిక్ హబ్’’ కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటివరకు ప్రకటించిన పరిహారం చట్టబద్దమైంది కాదు. దీనిని పెంచాలి. నిర్వాసితులు, ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న కూలీలు, ఇతర వృత్తిదార్లకు, యువకులకు ఉపాధి, ప్యాకేజీ ఇవ్వాలి. వీటన్నింటిపై ఒక స్పష్టమైన, వ్రాతపూర్వక అగ్రిమెంట్ వచ్చే వరకు...
రాజధాని ప్రాంతలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సిపిఎం సిఆర్‌డిఎ కన్వీనర్ సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులోని సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో పేదలు శనివారం ధర్నా చేశారు. కార్యక్రమానికి సిపిఎం రాజధాని కమిటీ కార్యదర్శి ఎం.రవి అధ్యక్షత వహించారు. బాబురావు మాట్లాడుతూ పేదలకు పింఛన్లే ఇవ్వలేనివారు రాజధానిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. నదుల అనుసంధానం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి రూ.10కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం పేదలకు పింఛన్లు ఇవ్వడంలేదని విమర్శించారు. తన సొంత ఇల్లు చూసుకున్న సిఎం పేదల ఇళ్ల గురించి మర్చిపోవడం దారుణమన్నారు. దళితుల నుండి తీసుకున్న భూములకు ఇంకా కౌలు చెక్కులు ఇవ్వలేదని, ఈ...
<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;"> 'విశాఖ జిల్లా సంక్షేమ హాస్టళ్లలో పేరుకుపోయిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని భావించడం నేరమా? చదువుకునే వాతావరణం కలుగజేసేందుకు సమస్యలను పరిష్కారం చేయమని అడిగితే అణచివేయడమే సమాధానమా? ఉద్యమాల సందర్భంగా లాఠీఛార్జి వంటివి జరిగితే తప్పుచేశామని ఒప్పుకునే అలవాటు పోలీస్ ఉన్నతాధికారుల్లో కనిపించేది.. కానీ ఈ నెల 15న విద్యార్థులు, విద్యార్థినులపైకి పోలీసు అధికారులు దుడ్డుకర్రలతో పైశాచికంగా కొట్టినా ఈ ఘటనను టీవీలు, పత్రికల్లో చూసినా...
- చెల్లించని వారి బకాయిలు ప్రజలపై మోపుతారా?
- ఛార్జీలు పెంచితే నిత్యావసరాల ధరలూ పెరుగుతాయి
- పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికుల వీధులపాలు కాక తప్పదు
- విద్యుత్తు కంపెనీలతో తప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలి
- నేటి ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణలో వ్యతిరేకిస్తాం : సిపిఎం
ట్రూ అప్ ఛార్జీల పేర రూ.7,209 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేసింది. సంపన్నులు, పెద్ద యజమానులు చెల్లించని బకాయిలను ట్రూ అప్ ఛార్జీల కింద ప్రజల నుంచి వసూలు చేయాలని భావించడం సరికా...