District News

భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణకు అధికారులు సరికొత్త తంత్రాంగాన్ని ప్రయోగిస్తున్నారు. రైతులపై ఒత్తిడి పెంచడానికి 'నకిలీ' నటకానికి తెరలేపారు. వ్యవసాయం చేయని, హక్కుదారులుగా ఉన్న కొంత మంది మత్స్యకారుల డి-పట్టా భూములు తీసుకొని భూసేకరణ జరిగిపోతుందన్న భ్రమలు కల్పిస్తున్నారు. భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు 9రెవెన్యూ గ్రామాల్లో 5311ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జారీచేసి 30రోజులు ముగిసిపోతున్నా...ఆందోళనల ఫలితంగా అధికారులు బాధిత గ్రామాల్లో అడుగు పెట్టలేక పోతున్నారు. దీంతో అధికారులు వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్టు ప్లాన్‌లో లేని గ్రామాలను ఎంచు కున్నారు. చేపలకంచేరు, దిబ్బలపాలెం గ్రామానికి చెందిన కొంతమంది మత్సకారులకు...

రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ ఇంకా కొనసాగుతోంది. 95 శాతం మంది భూములివ్వగా ఐదు శాతం మందే వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నదీ తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో 20 రోజుల్లో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలోనూ సమీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. మొత్తం 37,724 వేల ఎకరాల పట్టా భూమి సమీకరించాలని నోటిఫికేషన్‌ ఇవ్వగా ఇందులో 31,359 ఎకరాలకే అంగీకార పత్రాలిచ్చారు. అందులోనూ 29,854 ఎకరాలకే హక్కుదారులను నిర్థారించారు. ఇందులో 27,082 ఎకరాలకే ఒప్పంద పత్రాలందాయి. కానీ మంత్రులు మాత్రం ఇప్పటికి మొత్తం భూమికి ఒప్పంద పత్రాలు అందాయని చెబుతున్నారు. ఇప్పటికీ పట్టాభూమిలో 6,500 ఎకరాలకు అంగీకార పత్రాలే అందలేదు....

పేదలకు ఉచితంగా సేవ చేయాలని వైద్యులకు సలహా ఇచ్చిన కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు వైద్యరంగం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఎల్‌బిజి భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పేదలకు సేవచేయాలని సలహా ఇచ్చిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రభుత్వం అందుకు విరుద్ధ్దంగా ఎందుకు పని చేస్తుందని ఆయన ప్రశ్నించారు. పేదలకు వైద్యం అందించడం ప్రభుత్వం బాధ్యతని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం విజయనగరం జిల్లాకేంద్రంలో ఉన్న కేంద్రాసుపత్రిని ప్రైవేటు సంస్థకు అప్పజెప్పడం అశోక్‌గజపతిరాజు చెబుతున్న సిద్ధాంతానికి విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. అశోక్‌కు చెందిన...

విశాఖలోని గంగవరం పోర్టులో మృతి చెందిన కార్మికుడు రాజారావు కుటుంబానికి న్యాయం చేయాలని అడిగినందుకు పోలీసులు సోమవారం ఆర్ధరాత్రి దాటాక పోర్టు గేటు వద్ద ఉన్న 130 మంది కార్మికులు, సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. రాజారావు విధి నిర్వహణలో ఉండగా సోమవారం మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షలు నష్ట పరిహారం చెల్లింపుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన కార్మికులు మృతదేహంతో పోర్టు గేటు వద్ద బైఠాయించారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం ముందుకు రాకపోవడంతో సోమవారం రాత్రి అక్కడే ఆందోళన...

తెలంగాణలో చలో అసెంబ్లీ సందర్భంగా ఏపీ సరిహదుల్లో ఉన్న సీపీఎం నేతలపై పోలీసులు నిఘా పెట్టారు. పీఎస్ కు హాజరు కావాలని జగ్గయ్య పేట ఎస్ఐ సీపీఎం నేతలను ఆదేశించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, ప్రజల తరపున పోరాడే సీపీఎం నేతలను ఇబ్బంది పెట్టడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు పేర్కొన్నారు.

జిల్లాలోని అర్భన్‌ హెల్త్‌ సెంటర్ల ఉద్యోగుల ఆరు నెల్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ కోరారు. సోమవారం ఎపి అర్భన్‌ హెల్త్‌ సెంటర్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.పద్మజారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ జీతాల్లేక ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పిలల్ల స్కూల్‌ ఫీజులు కట్టలేక, కుటుంబాలు గడవక ఉద్యోగులు అప్పుులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ రాష్ట్ర అధికారులకు ఇప్పటికే బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపించామని, వాటిని త్వరగా తెప్పించి వేతనాలు చెల్లిస్తామని చెప్పారు...

అతిచిన్న వయస్సులోనే తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆకళింపు చేసుకోవటమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలు అభివృద్ధివైపు పయనించాలంటే విద్యకు మించిన మార్గం లేదని మలాల ఇచ్చిన పిలుపును మనమంతా అందిపుచ్చుకోవాలని ఐద్వా రాష్ట్రకార్యదర్శి రమాదేవి పేర్కొన్నారు. సోమవారం వివిఐటి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రపంచ దేశాలు యుద్దాలకు ఖర్చుపెట్టే సొమ్మును విద్యాభివృద్ధికి మళ్లించాలని చెప్పిన మలాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజాశక్తి బుకహేౌస్‌ ఎడిటర్‌ ఉషారాణి మాట్లాడుతూ మతం పేరిట తాలిబన్లు చదువు వద్దని, ఇంటినుండి బయటకి రావద్దని బురకా ధరించాలని ఆక్షంలు విధిస్తున్న పిదప మనదేశంలోనూ మతోన్మాదులు మహిళలు పట్ల...

గ్రామకంఠాల సమస్యలను వారంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి, మంత్రులు భావించినా నెల దాటిపోయింది. గత నెల 20వ తేదీన భూ సేకరణ ప్రకటన విడుదల చేశారు. వెంటనే వరసుగా గ్రామాల్లో సిఆర్‌డిఏకు అవసరమైన భూముల తుది జాబితాలను 9.5 ఫారం రూపంలో అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్క సారిగా గ్రామాల్లో కలకలం చెలరేగింది. రైతులు సిఆర్‌డిఏ కార్యాలయాలను ముట్టడించారు. కొన్ని చోట్ల తాళాలు వేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు శిక్షణలో ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ను ఆఘమేఘాలపై పిలిపించారు. గత నెల 24 నుంచి ఈ సమస్యపై ఆయన దృష్టి సారించారు. దాదాపుగా అన్ని గ్రామాలను పరిశీలించారు. రైతులతో చర్చించారు. కొన్ని...

 తెలుగు భాషా వికాసానికి గుర్రం జాషువా విశేష కృషి చేశారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ కొనియాడారు. తన అద్వితీయ కవిత్వం ద్వారా ప్రజలందరి ఐక్యతకు తెలుగు కవితా సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకు న్నారన్నారు. కెవిపిఎస్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 120వ జయంతి విజయవాడలోని సిఐటియు నగ ర కార్యాలయంలో సోమవారం జరిగింది. తొలుత జాషువా చిత్రపటానికి గఫూర్‌ పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కెవిపిఎస్‌ నగర కార్యదర్శి జి.నటరాజు అధ్యక్ష తన జరిగిన సభలో గఫూర్‌ మాట్లాడుతూ, అభ్యుదయ భావాలతో సాగిన ఆయన రచనలు నేటితరానికి ఆదర్శప్రా యమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమా మహేశ్వరావు మాట్లాడుతూ, పద్యరచన, కవితా రచనల ద్వారా జాషువా...

గంగవరం పోర్టు యాజమాన్య నిరంకుశత్వానికి సోమవారం ఓ కార్మికుడు మృతి చెందాడు. గంగవరం గ్రామానికి చెందిన ఎరిపిల్లి రాజారావు(40) పోర్టులో అగ్రికల్చర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. పోర్టుకు కిలోమీటరు దూరంలో రాజారావుకు సంబంధం లేని గోతులు తవ్వే పనిని యాజమాన్యం అప్పగించింది. పని ప్రదేశంలో మంచినీరు కూడా లేదు. పనిచేస్తుండగా రాజారావు కుప్పకూలిపోయాడు. అప్పటికే మృతిచెందిన రాజారావును చికిత్స పేరుతో దొడ్డిదారిన మల్కాపురంలోని ఇఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కెజిహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు అడ్డుకున్నారు. నష్ట పరిహారం చెల్లించేవరకు మృతదేహాన్ని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో...

Pages