District News

 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'ను పోలీసులు అడ్డుకున్నారు.పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు తీవ్రంగా తప్పుబట్టారు. తాము ఎం తప్పు చేశామని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తాము డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా తాము పాదయాత్ర చేపట్టినట్లు ఇక్కడ ఉన్న కౌలు రౌతుల పరిస్తితి ఏంటీ ? రూ.2500 పెన్షన్ ఎలా సరిపోతుంది అని ప్రశ్నించారు. పాదయాత్ర చేపట్టి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, శాంతియుతంగా పాదయాత్ర జరుగుతోందన్నారు. కానీ పోలీసులు అడ్డుతగులుతున్నారని, సమస్యలు...

సిపిఎం చేపట్టిన 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'కు  పోలీసులు అడ్డు తగిలారు. తుళ్లూరు ప్రాంతంలో చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదంటూ సీపీఎం నేతలను అరెస్టు చేశారు.ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు..పేదలకు ఎలాంటి పాట్లు పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా కళారూపాలు ప్రదర్శించారు. పాదయాత్రలో పేదలు..ఇతరులు..వామపక్ష నేతలు భారీగా హాజరయ్యారు. కొద్దిసేపు ముందుకు సాగిన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న యాత్రకు ఎందుకు అడ్డుతగులుతున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించారు. పోలీసులను దాటుకుని నేతలు ముందుకెళ్లారు. భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేసి వ్యాన్ లలో పడేశారు....

రాజధానిలో పింఛన్ల జాబితాలో అవకతవకలున్నాయనే ఆగ్రహంతో పేదలు తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో మంగళవారం ధర్నాలు నిర్వహించారు. తాడేపల్లి మండలం పెనుమాక పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం బైఠాయించారు. పచ్చచొక్కలోళ్ళకే పింఛన్లు దక్కుతున్నాయని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సిపిఎం క్రిడా కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, జె.నవీన్‌ప్రకాష్‌ అక్కడికి చేరుకున్నారు. అవకతవకలను సరిచేయాలని సర్పంచ్‌ కళ్ళం పానకాలరెడ్డిని కోరారు. అనంతరం ఎస్‌ఐ వినోద్‌కుమార్‌, కార్యదర్శి పద్మావతి ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. మరోపక్క తుళ్లూరు మండలం అనంతవరంలో 200 మంది పేదలు క్రిడా కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామంలో గత నెల్లో...

అనంతపురం జిల్లాలో సోలార్ హబ్ కోసం NTPC రైతుల వద్ద నుండి పదివేల ఎకరాలను  సేకరిస్తోంది. నష్ట పరిహారం అర్హులైన రైతులకు కాకుండా  బినామీలకు కట్టబెట్టేల అధికార పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారు.దీనిపై రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.వీరికి అండగా నిలబడిన సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్,రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధుని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసారు.. 

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య పేర్కొన్నారు.కర్నూలులోని సిపిఎం జిల్లా కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ద్దేశించి పాటూరు మాట్లాడుతూ, రైతాంగం, శ్రమ జీవుల కష్టాలు, నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరని తెలిపారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని భావిస్తే ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు. విడిపోయే సందర్భంలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కావాలని తాము కోరామని, ఈ విషయం గురించి ప్రధాని ఏమీ మాట్లాడడంలేదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు, కలిసొచ్చే అన్ని పార్టీలనూ కలుపుకొని కేంద్రంపై...

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్య దర్శి అండ్య మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ప్రయి వేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ శాంతినగర్లో సోమవారం కెవిపిఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు దళిత, గిరిజన, మైనార్టీ ప్రజల సమస్యలు పూర్తిగా విస్మరించా యని విమర్శించారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ నగర కార్యదర్శి జి.నటరాజు పాల్గొన్నారు.

 ఏజెన్సీలో గిరిజన విద్యను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎంపీ, ఎపి గిరి జన సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ మిడియం బాబూరావు విమర్శించారు. గిరిజన విద్యను పరిరక్షించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు చేపట్టిన జీపుయాత్రను బాబూరావు మారేడుమిల్లిలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. దీంతో వారు రక్తహీనతతో చనిపోతున్నారని చెప్పారు. సౌకర్యాలు కల్పించ డంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శిం చారు. గురుకుల పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయన్నారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇప్పటి వరకూ ఎన్నికల నినాదం గానే ఉన్న బందరు పోర్టు ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రత్యామ్నా యంగా మారింది. అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా పోర్టు నినాదం మారు తోంది. ప్రజల కోసం, జిల్లా, రాష్ట్ర ప్రజల భవి ష్యత్‌ అవసరాల కోసం కాకుండా, రాజకీయ నాయకుల భవితవ్యం కోసమే పోర్టు నిర్మాణం అన్నట్లు తయారైంది. అందుకే ఇన్ని వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న బందరు ప్రాంత ప్రజలను మోసం చేయవచ్చ నేది అసాధ్యమనే విషయం అర్థమైంది. కోన ప్రాంతానికి వెళ్లిన మంత్రులు, పార్లమెంటు సభ్యుల్ని సైతం స్థానిక ప్రజలు తిప్పి కొట్టడమే బందరు ప్రాంత చైతన్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే, అవసరమైనంత మేర...

 ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కర్నూలులో సీపీఎం రీలే నిరహార దీక్షలు చేపట్టింది. రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని సీపీఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు  ఎంఏ గఫూర్ విమర్శించారు.  ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే ఈనెల 15న అన్ని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపడుతామని ఆయన హెచ్చరించారు. రాయలసీమలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని, లక్షలాది మంది వలసలు వెళ్లారన్నారు. రాయలసీమ ప్రాంతం యొక్క సమస్యలను పరిష్కరించడానికి లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని గఫూర్ డిమాండ్ చేశారు. 

Pages