ప్రజా చైతన్యయాత్రలో ఉద్రిక్తత

 'రాజధాని ప్రజా చైతన్య యాత్ర'ను పోలీసులు అడ్డుకున్నారు.పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై రాజధాని ప్రాంత సీపీఎం కమిటీ కన్వీనర్ సీ.హెచ్.బాబురావు తీవ్రంగా తప్పుబట్టారు. తాము ఎం తప్పు చేశామని పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తాము డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా తాము పాదయాత్ర చేపట్టినట్లు ఇక్కడ ఉన్న కౌలు రౌతుల పరిస్తితి ఏంటీ ? రూ.2500 పెన్షన్ ఎలా సరిపోతుంది అని ప్రశ్నించారు. పాదయాత్ర చేపట్టి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, శాంతియుతంగా పాదయాత్ర జరుగుతోందన్నారు. కానీ పోలీసులు అడ్డుతగులుతున్నారని, సమస్యలు పట్టించుకోకుండా ప్రజల భాగస్వామ్యం అంటే ఇదేనా ? మాట్లాడే హక్కు లేదా ? ప్రశాంతంగా రోడ్డుపై పాదయాత్ర చేపట్టే అవకాశం లేదా ? మేం ఏం నేరం చేశాం అని ప్రశ్నించారు. గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తోంది, రాజధాని ప్రాంతంలోనే పేదలకు పని చూపాలని సి.హెచ్.బాబురావు డిమాండ్ చేశారు.