ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలకు బీహార్ సైతం నివ్వెరపో తోందని వైసిపి అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తమ పార్టీ నాయకులపై 10 నెలల్లో 13 సంఘటనలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం మల్కాపురంలో ఇటీవల దహనమైన చెరకు తోటను సోమవారం ఆయన తమ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబు ప్రోత్సాహంతోనే మంత్రులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. భూములివ్వని రైతుల పంటలు తగుల బెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.
District News
రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని సిపిఎం నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు కార్యక్రమానికి హాజరవుతారన్నారు.
కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను జమ్ము-కశ్మీర్ రాష్ట్ర సిపిఎం ఎమ్మెల్యే, ఉగ్రవాద వ్యతిరేక ఉద్యమ నాయకుడు యూసఫ్ తరిగామి సోమవారం పరామర్శించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన 16 మాసాల్లో అనంతపురం జిల్లాలో 39 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరమన్నారు.
పోడు భూములకు పట్టాలు, తునికాకు బోనస్ ఇవ్వాలని కోరుతూ గిరిజనులు పొలికేక పెట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది గిరిజనులు తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం ముంపు మండలంలోని ఎర్రంపేట ఎంపిడిఒ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌డేను ముట్టడించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు, భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య గ్రీవెన్స్ డేలో ఉన్న ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి చక్రధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీహక్కుల చట్టం- 2005ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను సర్వే చేసి, పట్టాలు ఇవ్వాలన్నారు. షెడ్యూలు ఏరియాలో భూ బ్యాంక్ ద్వారా గిరిజన...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణా నికి అవ సరమైన పర్యావరణ ఆమోదాన్ని సక్రమ మైన పద్ధతిలో పొందలేదని పర్యావరణ నిపుణులు, ప్రజా సంఘాలువి మర్శిస్తున్నాయి. స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ(ఎస్‌ఇఐఎఎ)కి రాజధాని పర్యావరణ ప్రభావ అధ్యయనాన్ని నిబంధనలు రూపొందించకుండా క్రిడా పర్యావరణ ఆమోదాన్ని ఎలా పొందిందని నిపు ణులు విమర్శిస్తున్నారు. కన్సల్టెంట్‌ను నియమించ కుండా, క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించకు ండా పర్యావరణ క్లియరెెన్స్ ఎలా లభిస్తుందనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడిపై రెగ్యులేటరీ ఏజెన్సీ కాగితంపై రబ్బర్ స్టాంప్ వేసి ఇచ్చిందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. పర్యావరణ ప్రభా వ నివేదికను కన్సల్టెంట్ ద్వారా...
మంచి రోజులు తీసుకొస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన బిజెపి, అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారులకు మాత్రమే మంచి రోజులు తీసుకొచ్చేలా వ్యవహరిస్తోందని జమ్మూ కాశ్మీర్ శాసనసభలో సిపిఎం పక్ష నేత యూసుఫ్ తరగామి స్పష్టం చేశారు. అవాజ్ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆదివారం అనంతపురంలో బహిరంగ సభను నిర్వహించారు. సభలో తరగామి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 'అచ్చేదిన్ ఆయేంగే' అంటూ ప్రచారాన్ని పెద్దఎత్తున బిజెపి చేపట్టిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను విస్మరించి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం చట్టాలను అపహాస్యం చేస్తూ అడ్డగోలుగా సాగు భూములను సేకరిస్తే ప్రతిఘటన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 30న విజయవాడలో రాష్ట్రస్థాయి రైతు సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో ప్రయివేటు కంపెనీలకు అప్పగించిన భూములను పరిశీలించిన అనంతరం సిపిఎం కర్నూలు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ బ్యాంకు పేరుతో భూములను సేకరించడం తగదన్నారు. కలెక్టర్లపై విచారణ చేపడితే రెవెన్యూ కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక...
అర్హులైనవారందరికీ ప్రభుత్వం ప్రకటించిన భూమిలేని నిరుపేదలకు ఇస్తానన్న రూ.2500లు పింఛన్ ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ శుక్రవారం నిడమర్రులోని సిఆర్‌డిఎ కార్యాలయాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు పెద్దఎత్తున ముట్టడించారు. వందలాదిమంది కార్యాలయం ఆవరణలోకి జొరబడి పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అర్హులను కాదని అనర్హులకు పింఛన్లు కట్టబెడుతున్నారని బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. జన్మభూమి కమిటీ పేరుతో పచ్చచొక్కాల కార్యకర్తల ప్రమేయం పెరగడం వలనే అనర్హులకు అందలాలు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలోని పిడింగొయ్యిలోని వివాదాస్పద భూమిలో ఆలయ ప్రవేశానికి అవకాశం కల్పించా లంటూ విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులు, స్థానిక పెత్తందార్లతో కలిసి గురువారం రూరల్ తహశీల్దార్ జి.భీమారావుపై దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాజమండ్రిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు.
రాజధాని శంకుస్థాపన సంబరాల మధ్య ప్రజా సమస్యలు పక్క కెళ్లిపోతున్నాయి. మంత్రులు, అధి కార యంత్రాంగమంతా కేవలం రాజధాని శంకు స్థాపన మీదే ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రాధాన్య అరశాలపైనా ఎవరూ స్పరదిరచడం లేదు. వివిధ జిల్లాల్లో రోజూ సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదు.దాదాపు అన్ని శాఖల్లోనూ ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. చివరకు ముఖ్యమంత్రి పేషీలో సైతం దాదాపు 18 వేలకుపైగా ఫైళ్లు కదలకుండా ఉన్నట్లు అధికారులే అరగీకరిస్తున్నారు.రాష్ట్రంలోని అనేక ప్రారతాల్లో డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, వైరల్ జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతున్నా, ప్రభుత్వపరంగా వైద్య సేవలు ఎప్పటిలా అధ్వానంగానే ఉన్నాయి. ఆసుపత్రుల్లోనే కుక్కలు, ఎలుకలు,...