కాకినాడ: 'ఖజానా ఖాళీ అయింది... ఇప్పటికే రూ.8 వేల కోట్లు అప్పులు చేశాం. మరో రూ.8 వేల కోట్ల వరకూ అప్పులు చేసేందుకు అవకాశం ఉంది. ఈపరిస్థితుల్లో అభివృద్ధి చెందిన ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే కాస్త ఊపిరి పీల్చుకునేందుకు సమయం అవసరం. ఇది రెవెన్యూ ఉద్యోగులు అర్థం చేసుకోవాలి' అని ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
District News
రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమీపంలో మూడు గ్రామాలను ఖాళీ చేయించే ందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గుట్టుచప్పుడు కాకుండా ఆ గ్రామాల వివరాలు తీసుకుంటోంది. వీటితో పాటు ప్లానింగ్‌కు ఇబ్బందిగా ఉందనే పేరిట దొండపాడు గ్రామాన్నీ దాదాపు ఖాళీ చేయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం నుండి స్థానిక అధికారులకు మౌఖిక ఆదేశాలందాయి. దీంతో రెవెన్యూ అధికారులు ఆ మూడు గ్రామాల వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది.
కమ్యూనిస్టుల ఆశయం అంటే ప్రజల కోసం పనిచేయడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గపూర్ అన్నారు. మంగళగిరిలో సోమవారం నిర్వహించిన కంటే రంగారావు 29వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకొచ్చిన వారు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం త్యాగాలు చేసేది కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత కందిపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వాలు వ్యాపార వర్గాలపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు.
నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరాంధ్ర పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో సిపిఎం ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర అభివృద్ధి సదస్సు రణస్థలంలోని దేవిశ్రీ కల్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోనే అత్యధిక వర్షపాతం, 16 జీవనదులు, మరెన్నో జీవగెడ్డలు ఉన్నాయని, అయినా, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం కరువుపీడిత ప్రాంతంగా ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో జ్యూట్, ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలు మూతపడి 30 వేల మందికి ఉపాధి పోయిందన్నారు. ఉత్తరాంధ్రలో విపరీతమైన కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను మాత్రమే...
రాజధాని నగరంలో విమానాశ్రయం నిర్మిరచాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమిరచుకురది. అయితే విమానాశ్రయానికి అవసరమైన భూమిని మాత్రం సిద్ధం చేసి పెట్టుకోవాలని భావిస్తోరది.
రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకుగానీ, దానికి సాంకేతిక సలహా ఇచ్చేందుకుగానీ చేసుకున్న ఒప్పందాలన్నీ విదేశీ కంపెనీలకే చెందినవి కావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం మొత్తం మాస్టర్ డెవలపర్‌పేరుతో సింగపూర్‌కు కట్టబెట్టగా, రాష్ట్రంలో కోస్తాతీరంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులను జపాన్‌కు అప్పగిస్తోంది. పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు బాధ్యతతో పాటు అత్యంత కీలకమైన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటునూ జపాన్‌కు అప్పగించింది. దీంతోపాటు వ్యవసాయంలో ఆధునీకరణకు జపాన్ సాయం తీసుకోనుంది. ఇది ఆందోళన కలిగించే అంశమని మాజీమంత్రి, వ్యవసాయరంగ...
గిరిజన రైతులు పండిస్తున్న పత్తి పంటకు క్వింటాకు రూ.6 వేల మద్దతు ధర కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి నాయకుడు మర్లపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో మిడియం బాబూరావు మాట్లాడుతూ పత్తి క్వింటాకు రూ.7,762 కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిపుణులు సిఫార్సు చేసినా కేంద్రం రూ.4,100 మాత్రమే ప్రకటించిందన్నారు. ప్రయివేటు వ్యాపారులు కుమ్మక్కై క్వింటాకు రూ.2,500 నుంచి రూ.3,500 మధ్య కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిట్టుబాటు ధర లేక చెరకు రైతులు కూడా ఆత్మహత్య లకు పాల్పడుతున్నారని అఖిల భారత చెరకు రైతుల సమ న్వయ కమిటీ కన్వీనర్ విజ్జూ కృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయంతో పోల్చితే మద్దతు ధర చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. చెరకు ఉత్పత్తి వ్యయం టన్ను రూ. 2,500 ఉన్నట్లు కేంద్రమే అంచనా వేసిందన్నారు.
కాని ఆ మొత్తాన్ని చెల్లించేందుకైనా ఫ్యాక్టరీలు సుముఖత చూపించటంలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం ప్రథమ మహాసభ విజయవాడలోని ఎంబి అధ్యయన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటైంది. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా విజ్జూ కృష్ణన్ ప్రసంగిచారు. అధిగ దిగుబడి నిచ్చే చెరకు విత్తనాన్ని కనుగొనేందుకు పరిశోధనలు నిర్వహిం చటంలేదని, రైతులు ఆరుగాలం...
రైతులు, పేదలు సాగు చేసుకుంటున్న భూములను గుంజుకొని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రభుత్వ భూ బ్యాంకు విధానాన్ని ఉప సంహరించుకోవాలని భూ హక్కుల పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది.ఈసదస్సులో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ధిక్కరించిందని విమర్శించారు. కర్నూలు జిల్లా శకునాల గ్రామంలో రైతులకు నష్ట పరిహారం చెల్లించకుండానే వారి భూములను లాక్కుందని విమర్శించారు. బందర్ పోర్టు భూ సేకరణకు ఎదురు తిరిగిన 29 మంది రైతులపై పోలీసులు నాన్‌బెయిల్ సెక్ష న్లతో కేసులు పెట్టారన్నారు. అవసరానికి మించిన భూములను జోలికెళ్లొద్దని, పారిశ్రామిక అభివృద్ధికి ఎంత భూమి కావాలో అంతా తీసుకోవాలని సూచించారు.