బందరు పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల పేరుతో ఇచ్చిన భూ నోటిఫికేషన్‌పై ఆందోళన చేస్తున్న భూ పోరాట కమిటీ కన్వీనర్ కొడాలి శర్మసహా పలువురిని శనివారం అరెస్టు చేయడంపై ఆదివారం విజయవాడ, మచిలీపట్నాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని, ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఆదివారం సిపిఎం, సిపిఐ, వైసిపి ఆధ్వర్యంలో కోనేరుసెంటర్ నుండి నవకళ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అనుబంధ పరిశ్రమల పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన...
District News
ఇప్పటికే బ్రిటనతో సహా పలు బ్యాంకులు ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీఎం చంద్రబాబును కలిసి హామీలు ఇస్తున్నందున రుణాల మంజూరుకు పెద్దగా అవరోధాలు ఎదురయ్యే అవకాశం లేదని సమావేశం అభిప్రాయపడింది. రాజధాని నగర నిర్మాణం కోసం ప్రాథమికంగా రూ.15,000 కోట్ల విదేశీ రుణం అవసరమవుతుందని కమిటీ అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు, జేబీఎ్‌ససీ, జైకా, బీఎ్‌సఐసీ వంటి విదేశీ బ్యాంకుల నుంచి రుణాన్ని తీసుకోవాలని, ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన, కమిషనర్ శ్రీకాంతకు పీవీ రమేశ్ సూచించారు
విశాఖ మన్యంలోని చింతపల్లి, జర్రెల ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం అత్యంత దారుణమని ఎమ్మెల్సీ, మండలి పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ ఎంవిఎస్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను రద్దు చేయాలని పాడేరులోని ఐటీడీఏ వద్ద గిరిజన సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1/70 చట్టం ప్రకారం గిరిజన సంపదను ఇతరులు దోచుకోవడానికి వీల్లేదన్నారు.
మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కోసం గురువారం ఏర్పాటైన సదస్సులో రైతుల ప్రశ్నలకు మంత్రులుగాని, అధికారులుగాని సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో తమ భవిషత్తు ఏమిటో తెలియక రైతుల్లో అయోమయం ఏర్పడింది. సమీకరణలో భూములిచ్చిన వారికి కేటాయిస్తామన్న స్థలాలు ఇవ్వలేదు. కనీసం ఎక్కడ ఇస్తారో కూడా చెప్పటంలేదు. ఇంకా చర్చించాలంటున్నారు. ఇంతవరకు సిఆర్‌డిఎ మండల స్థాయి రికార్డుల ఆధారంగా సర్వే చేయలేదు. పూలింగులో ఇచ్చిన భూములు, రికార్డుల ప్రకారం ఉన్న భూముల వివరాల్లో ఏమైనా హెచ్చుతగ్గులుంటే ఈ సర్వేలో బయటపడతాయి. దీన్ని ఈ నెలలో చేపట్టాలని నిర్ణయించారు. గ్రామ కంఠాల సమస్యనూ పరిష్కరించలేదు. పూలింగు సమయంలో నిరంతరం గ్రామాల్లో తిరిగిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పుడు...
భూములు, వృత్తుల పరిరక్షణ కోసం రైతులు, పేదలు, చేతివృత్తిదారులు ఏకోన్ముఖంగా కదలాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. భూముల పరిరక్షణకు ఒకవైపు ప్రజాపోరాటాలు కొనసాగిస్తూనే మరోవైపు చట్టపరమైన పోరాటం కొనసాగించాల్సిన అవసరముందన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వం దళారీపాత్ర పోషిస్తోందని విమర్శించారు. ఈ ప్రాంత రైతుల భూముల రిజస్ట్రేషన్లు జరిగేలా, భూముల మార్కెట్ విలువ పెంచేలా చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 97ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పోరాటం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్ నర్సింగరావు హెచ్చరించారు. ఆయన స్థానిక విలేకర్లతో శుక్రవారం మాట్లాడుతూ, సమతా తీర్పునకు వ్యతిరేకంగా ఎపిఎండిసికి గిరిజన భూములను అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్ట ప్రకారం ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిం చాలన్నారు. వెంటనే జిఒను రద్దు చేయకపోతే నిరవధిక పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. బళ్ళారిలో గాలి జనార్దనరెడ్డి గనులను లూటీ చేసినట్టుగా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ను పెట్టుబడి దారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన విమర్శించారు. బాక్సైట్...
భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు ఐక్య పోరాటం చేయడంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యదర్శి కె.లోకనాధం పేర్కొన్నారు. ఇండిస్టీయల్ పార్కు (పిసిపిఐఆర్) పేరుట ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ఇండిస్టీయల్ పార్కు వ్యతిరేఖ పోరాట కమిటి అధ్యక్షులు లొడగల చంద్రరావు ఆధ్వర్యంలో మూలపర్ర గ్రామంలో రైతులతో శుక్రవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన లోకనాథం మాట్లాడుతూ, భూసేకరణకు వ్యతిరేఖంగా ఈ ప్రాంత రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత రైతు లంతా ఐక్యంగా భూసేకరణకు వ్యతిరేఖంగా కోర్టును ఆశ్రయించడం తోనే ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి 5 సంవత్సరాలైనా వెనక్కి తగ్గిందన్నారు. ప్రభుత్వం రైతులను...
ప్రత్యేక హోదా గురించి కేంద్రంతో మాట్లాడేంత స్థాయి తనకు లేదని, అక్కడున్న ఎంపిలు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఆ పని చేయాల్సి ఉంటుందని జనసేన అధినేత వపన్ కళ్యాణ్ అన్నారు. 2019 నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎఫ్‌డీఐలు చిచ్చు పెడతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు విమర్శించారు. విజయవాడలో సీపీఎం నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం కార్యాలయం నుంచి బీసెంట్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ఎఫ్‌డీఐ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
విఆర్‌ఎల దీక్షలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎపిపిఎస్‌సి ద్వారా నియమితులైన 5,600 మంది విఆర్‌ఎలకు తగిన పారితోషికం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. రెవెన్యూ శాఖలో శాశ్వత ఉద్యోగులకు చెల్లిస్తున్న జీతభత్యాలను విఆర్‌ఎలకూ చెల్లించాలని కోరారు.