శ్వేతపత్రం, చర్చల పేరుతో బాక్సైట్ తవ్వకాలకు కుట్ర
- ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి- విజయవాడ ప్రతినిధి
శ్వేత పత్రం విడుదల, చర్చల పేరిట బాక్సైట్ తవ్వకాలకు కొనసాగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఈనెల 30వ తేదీలోగా బాక్సైట్ తవ్వకాల అనుమతులను ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు బాక్సైట్ తవ్వకాలు అక్రమమని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు, ఇప్పుడు అవే విధానాలను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు మధు బుధవారం ఒక లేఖాస్త్రాన్ని...
District News
విశాఖ జిల్లా జర్రెల బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తి అవాస్తవాలతో వున్నది. జర్రెల బాక్సైట్ గనుల్లో అపార నిల్వలు వున్నాయని, ఈ నిల్వలను వెలికితీసి రాష్ట్రానికి ఆదాయం పెంచవచ్చని ప్రభుత్వ ప్రధాన వాదన. తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల జారీచేసిన బాక్సైట్ తవ్వకాల జి.వో.నెం.97కు ముందే కాంగ్రెస్ మరియు వైఎస్‌ఆర్ పార్టీలు బాక్సైట్ తవ్వకాల పర్యావరణ అనుమతుల జి.వో జారీచేశాయని, రస్ ఆల్‌ఖైమాతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని మరో వాదన. బాక్సైట్ అత్యధికంగా వున్న ఒరిస్సాలో తవ్వకాలు జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ తవ్వకాలు ఎందుకు జరపకూడదనేది మూడవ వాదన. 19 పేజీల శ్వేతపత్రంలో అత్యధికం మరకలే...
రాజధాని పనులకు ఇంతవరకు ఒక్క టెండరూ ఖరారు చేయలేదు. కేవలం కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియ మినహా ఇతర టెండర్లను ఖారారు చేయలేదు. అన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. రాజధానికి అనుసంధాన ప్రధాన రహదారికే ఇంతవరకు స్పష్టత లేదని అధికారులే వాపోతున్నారు. కన్సల్టెంట్లు కూడా రాజధాని కేంద్ర ప్రాంతం నుండి కొండవీటివాగు స్లూయిస్ వరకూ ప్లానింగ్ ఇచ్చారు. అక్కడి నుండి జాతీయ రహదారికి అనుసంధాన రహదారిని ఫైనల్ చేయలేదు. అధికారులు మాత్రం మణిపాల్ ఆస్పత్రి వెనుక భాగంలోనూ, వడ్డేశ్వరం సమీపంలోనూ భూ పటుత్వ పరీక్షల కోసం పిల్లర్లు వేసి వదిలేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రోడ్డు ఎక్కడ వేయాలనేది స్పష్టం చేయలేదు. రోడ్లకు సర్వే చేసిన కంపెనీ ఇటీవల మూడు ప్రతిపాదనలు చేసింది. మణిపాల్...
దేశంలో పేట్రేగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని పది వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని తీర్మానించింది. గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించిన బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం తెలపాలని నాయకులు నిర్ణయించారు. జర్రెల ప్రాంతానికి 10 వామపక్ష పార్టీల నాయకులు వెళ్ళి బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలను బలవంతంగా తొలగించడానికి నిరసనగా గ్రామాల్లో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకత్వం పర్యటించాలని నిర్ణయించారు.
శ్వేత పత్రం విడుదల, చర్చల పేరిట బాక్సైట్ తవ్వకాలకు కొనసాగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఈనెల 30వ తేదీలోగా బాక్సైట్ తవ్వకాల అనుమతులను ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. విదేశానికి చెందిన రస్ ఆల్ ఖైమా కంపెనీ కోసమే ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను అనుమతించిందని విమర్శించారు. దేశీయ కంపెనీతో కలిసి రస్ ఆల్ ఖైమా కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని, ఆ కంపెనీ నష్టాలను అధిగమించేందుకు గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సిఎం చంద్రబాబుకు ప్రజా సంక్షేమం కంటే పెన్నా, రస్ ఆల్ ఖైమా కంపెనీల మనుగడే ముఖ్యంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో చర్చించామని, ఒకటి రెండు రోజుల్లో సీఎం చంద్రబాబుతో కూడా చర్చించి పార్టీలో చేరిక తేదీని ఖరారు చేస్తామన్నారు. తొలుత ఆనం సోదరులు గురువారం నెల్లూరులోని తమ నివాసంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, అభిప్రాయ సేకరణ జరిపారు.
విశాఖ: బాక్సైట్ తవ్వకాలను ఐక్యంగా అడ్డుకోవాలని ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ పేర్కొన్నారు. గిరిజన భవన్ బాక్సైట్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ, గిరిజన చట్టాల ప్రకారం గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం కూడా గిరిజనేతర సంస్థ మాత్రమేనని, అటువంటి గిరిజనేతర ప్రభుత్వం విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతినిస్తూ జీవో ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. పీసా చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలో గ్రామ సభ లు చేసిన తీర్మానాలే సుప్రీం అని అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ కంటే గ్రామ సభలకే అధికారం అధికమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.
సోలార్ పార్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగేందుకు వెళ్లిన సిపిఎం, ప్రజాసంఘాల నాయకులను, నిర్వాసిత రైతులను ప్రభుత్వం నిర్బంధించింది. అరెస్టు చేసి 22 మందిని జైలుకు పంపింది. అనంతపురం జిల్లా ఎన్‌పికుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఎకరాల భూమిని సేకరించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించ కుండానే భూములను కంపెనీకి కట్టబెట్టింది. నిర్వాసిత రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు సిపిఎం మద్దతిచ్చింది. సోలార్ భూముల్లోకి చొచ్చుకెళ్లి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎర్రజెండాలను పాతారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే పనులు సాగనీయబోమని హెచ్చరించారు.
బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 30న చింతపల్లిలో 'గిరిజన గర్జన సభ' నిర్వహించనున్నట్లు సిపిఎం ప్రకటించింది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ ఈ సభలో పాల్గొననున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు తెలిపారు. డిమాండ్ల సాధనకు క్షేత్రస్థాయిలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు.
ప్రభుత్వం నాటకాలాడుతోందని, బాక్సైట్ జివోను తాత్కాలికంగా రద్దు చేసినట్లు మాట్లాడినా వాటి ప్రమాదం, బాక్సైట్ ఒప్పందాల ప్రమాదం పొంచి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం గిరిజనాన్ని హెచ్చరించారు. అందుకే ఆ బాక్సైట్ ఒప్పందంపైనే ప్రధానంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం స్థానిక గిరిజనోద్యోగుల భవనంలో ఆ పార్టీ ఏజెన్సీ 11 మండలాల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలు చేపడితే జికెవీధి, చింతపల్లి, అరకు, అనంతగిరి మండలాల్లో 247 గ్రామాలు, 9312 ఆవాసాలకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. సప్పర్ల, జెర్రెల, జికెవీధి, గాలికొండ కొండల్లో తవ్వకాలు చేపడితే పరిసర ప్రాంతాల్లోని వందలాది గ్రామాలు...