District News

 ఆంగన్‌వాడీ కార్యకర్తలను దూషించిన ప్రభుత్వ చీఫ్‌విప్‌ చింతమనేని ప్రభాకర్‌ను పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. గురువారం కడప పాతబస్టాండ్‌లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కోశాధికారి శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి ఐ.ఎన్‌.సుబ్బమ్మ మాట్లాడుతూ ఏలూరులో చింతమనేనికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన అంగన్‌వాడీల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. గతంలో తహశీల్దార్‌ వనజాక్షి పట్లా ఇలాగే ప్రవర్తించారని గుర్తుచేశారు.

మతోన్మాదానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని సరస్వతీ పార్కు నుంచి దాబాగార్డెన్స్ మీదుగా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. అయితే సెక్షన్-30, 31 అమలులో ఉన్నాయని, ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అయితే పక్కనే సరస్వతీ పార్కు వద్ద టీడీపీ జన చైతన్యయాత్ర పేరిట ర్యాలీలు తీస్తున్నారు కదా అని వామపక్షాల నేతలు ప్రశ్నించగా పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వామపక్షాల నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకే ఇటీవల అస హన ధోరణులు, దాడులు పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపిఐ(ఎం) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. భిన్నతంపై మతోన్మాద దాడులు, అసహన ధోరణు లకు నిరసనగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోనూ సిపిఎం ప్రచార యాత్ర లు నిర్వహిస్తోంది. అందులోభాగంగా బుధవారం శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు నిర్వహించారు. అసహన ధోరణులకు వ్యతిరేకంగా, మత సామరస్యం కోరుతూ సిపిఎం శ్రీకాకుళం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రాయివీధిలో మతసామరస్యంపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీనివాసు మాట్లాడుతూ, ప్రజలను మత...

వామపక్షాల దేశ వ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్‌ 1 నుండి 6వ తేదీ వరకు మతోన్మాదంపై వ్యతిరేక దినాలుగా పాటించాలని వామపక్ష పార్టీల నాయకులు వెల్లడించారు. డిసెంబర్‌ 3న స్థానిక అంబేద్కర్‌సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం కొత్తపేట మల్లయ్యలింగం భవనంలో తూమాటి శివయ్య అధ్యక్షతన పలు వామపక్ష పార్టీల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం హిందూత్వ సిద్ధాంతంపై మరింత మొగ్గు చూపుతుందని, దీనికి ప్రతిఘటన క్రమం ప్రారంభం కావటం సానుకూల పరిణామమన్నారు. రచయితలు, మేధావులు, కళాకారులు, ఇందులో గొప్ప పాత్ర పోషించటం అభినందనీయమన్నారు. బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్‌...

ఎపి నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి లంక భూములను సేకరించడానికి సీఆర్డీఏ సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. 2300 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్టు రైతులు 9.1 పత్రాలు ఇవ్వాలని అధికారులు తెలిపారు.

గిరిజన గర్జనలో భాగంగా  నర్సీపట్నంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందకారత్  బాక్సైట్ తవ్వకాలపై  ప్రెస్మీట్ నిర్వహించారు.బాక్సైట్‌ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాల పుట్ట అని  విమర్శించారు. బాక్సైట్‌ తవ్వకాలతో వేలాది మంది గిరిజనులు నిరాశ్రయులై, జీవనోపాధి కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యం ప్రజలు చేస్తున్న ఉద్యమానికి పార్టీ తరపున ఆమె మద్దతు ప్రకటించారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంపెనీ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మన్యం ప్రజల బతుకుల్లో విషం చిమ్మే బాక్సైట్‌ జిఒ విషయంలో వెనక్కి తగ్గాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం. గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందువల్లే అయిష్టంగానైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. మంత్రి మండలి సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు స్థానికంగా వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనను సుదీర్ఘంగా వివరించిన తరువాత, నిఘా వర్గాల నివేదికలను పూర్తి స్థాయిలో పరిశీలించాక మరో మార్గం లేకే ఈ దిశలో నిర్ణయం తీసుకున్నారన్నది దాచినా దాగని సత్యం! అయితే, ప్రజా సంక్షేమం కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేసే బాబు సర్కారు బాక్సైట్‌ ఖనిజాన్ని వెలికితీసే విషయంలో తన వైఖరిని పూర్తిగా మార్చుకోలేదు. అధికారంలోకి...

ప్ర‌భుత్వానికి జ‌ల‌వ‌న‌రుల వినియోగంలో చిత్త‌శుద్దిలేద‌ని సీపీఎం పోలిట్ బ్యూరో స‌భ్యుడు బీవీ రాఘ‌వులు విమ‌ర్శించారు. రాజ‌మండ్రిలో జ‌రిగిన స‌ద‌స్సులో పాల్గొన్న ఆయ‌న గ‌తంలో జ‌ల‌య‌జ్ఞం పేరుతో వైఎస్ హాయంలో జ‌రిగిన త‌ప్పిదాన్ని ఎత్తిచూపారు. ఇప్పుడు కేంధ్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా అదే బాట‌లో సాగుతున్నాయ‌ని ఆరోపించారు.ప్ర‌జ‌ల మీద చిత్త‌శుద్ధి ఉండి, పోల‌వ‌రం పూర్తిచేయాల‌నుకుంటే తొలుత రీ డిజైన్ చేయాల‌న్నారు. ఉన్న కొద్దిపాటి నిధుల‌ను వినియోగించి 120 అడుగుల మేర ప్రాజెక్ట్ పూర్తిచేయాల‌న్నారు. అప్పుడు నీటి వినియోగంలో ల‌క్ష్యాలు నెర‌వేరుతాయ‌న్నారు. నిర్వాసితుల స‌మ‌స్య కూడా రాద‌న్నారు. అందుకు భిన్నంగా నిధులు లేని స‌మ‌యంలో 152 అడుగుల పేరుతో కాల‌యాప‌న...

'రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యుల రైజ్‌ చేయాలి. లేదంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పక్షాలనూ కలుపుకొని చలో అసెంబ్లీ నిర్వహిస్తాం' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.రాష్ట్రంలో మూడు లక్షల మంది కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుంటే కేవలం మూడు వేలమందే ఉన్నారంటూ మంత్రి వర్గ ఉపసంఘం ప్రకటించడం దారుణ మన్నారు. వారినే రెగ్యులర్‌ చేస్తామనడం ఉద్యోగులను దగా చేయడమేనన్నారు. అంగన్‌వాడీల ఉద్యమాన్ని అణచివేయా లని చూస్తే మహిళలు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. ప్రకటించిన ప్రకారం వారి వేతనాలు పెంచుతూ జిఓ విడుదల చేయాలని డిమాండ్‌...

గ్గయ్యపేటరూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు అమలు పరుస్తున్నారని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సోమోజు నాగమణి విమర్శించారు. ఇళ్లస్థలాలు ఇవ్వాలంటూ మండలంలోని షేర్‌మహమ్మద్‌పేట అడ్డరోడ్డులో  ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను  సిపిఎం డివిజన్‌ నాయకులు ఘంటా నాంచారయ్య ప్రారంభించారు. ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ జాన్‌పాషా ముగించారు. సిపిఎం డివిజన్‌ నాయకులు కాకనబోయిన లింగారావు, నాయకులు దంతాల వెంకటేశ్వర్లు, కోట రవికుమార్‌, రామకృష్ణ, షేక్‌ గౌస్‌మియా, ప్రణయ తేజ, జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Pages