విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మృతి చెందటానికి ప్రభుత్వ మద్యం విధాన మే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఖజానా నింపుకో వటమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింద న్నారు. మృతుల కుటుం బాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరి హారం చెల్లించాలని ఆయన ప్రకటనలో డిమాండ్ చేశారు. బాధితు లకు ఉన్నత వైద్య సౌకర్యం అందించాలని కోరారు.
District News
హుదూద్ పరిహారం ఇంతవరకూ అందలేదంటూ విశాఖ జిల్లా చీడికాడలోని ఎస్‌సి కాలనీ మహిళలు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను నిలదీశారు. మాడుగుల నియోజకవర్గం, చీడికాడ మండలంలో సోమవారం జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు తమ ఇబ్బదులను లోకేష్‌కు వివరించారు. ఎస్‌సి కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయలేదని, గ్రామ సమీపంలో బంజరు భూముల పట్టాలను తమకు ఇవ్వలేదని, రేషన్‌కార్డులు, పింఛన్లు, మరుగుదొడ్లు వంటి సమస్యలపై పట్టించుకునే నాథుడే లేడని నిరసన వ్యక్తం చేశారు.
విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణబార్‌లో కల్తీ మద్యం తాగి అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు..కల్తీ మద్యం మృతులు, బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన 40 మంది సిపిఎం నాయకులను పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించేందుకు సిఎం చంద్రబాబు వెళ్లినపుడు సిపిఎం రాజధాని ప్రాంత కమిటీ కార్యదర్శి సిహెచ్.బాబూరావు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రి వద్ద కూడా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కల్తీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కొల్లు రవీంద్ర పదవికి రాజీనామా చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. బార్ యజమానులును అరెస్టు చేయడంతో...
రాజ్యాధికారం కోసం సంఫ్‌ుపరివార్ శక్తులు ఒక పథకం ప్రకారం మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యే యూసఫ్ తరిగామి అన్నారు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు ఘటనతో పథకం ప్రారంభమై, గుజరాత్‌లో అల్లర్లు సృష్టి, దాద్రి ఘటన ఇవన్నీ ఒక వరుస క్రమంలో జరిపినవేనని చెప్పారు. ఆదివారం స్థానిక పాతబస్టాండ్ సెంటర్లోని ఉర్దూ బాలుర పాఠశాల ప్రాంగణంలో ఆవాజ్ సంఘం నిర్వహించిన లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకు అవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అక్భర్ అధ్యక్షత వహించారు. తరిగామి మాట్లాడుతూ దేశంలో భయానక వాతావరణ నెలకొన్నదని చెప్పారు. గతంలో టెర్రిస్టులు దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నామని, కానీ ఇప్పుడు...
హిందూ, ముస్లిములు సఖ్యతగా మెలగాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.. మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన బీజేపీ మతం పేరుతో పబ్బం గడుపుకుంటోందని మధు విమర్శించారు. మతసామరస్యంపై ఆవాజ్ ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ జరిగింది.
ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ సేవలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. అందుకు అనుకూలంగానే అక్టోబర్ 14న జిఓ నెంబర్ 633ను విడుదల చేసిందని ప్రజా ఆరోగ్య వేదిక ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు.
నవసమాజ నిర్మాణం కోసం జరిగే సామాజిక ఉద్యమాలే అంబేద్కర్‌కు నిజమై న నివాళి అని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దడాల సుబ్బారావు అన్నారు. రాజమం డ్రిలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం పోరాడారని, కానీ నేటి పాలకులు సమాజం లో అంతరాలను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా దళి తులంతా సామాజిక పోరాటాల్లో పాల్గొనాలని కోరారు. మాజీ ఎంపీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబూరావు మాట్లాడుతూ దళితులు చదువుకోవ డం ద్వారా కొంత ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతున్నారని తెలిపారు. పాలకులు ఆ విద్యను కూడా వారికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్, సంఫ్‌ుపరివార్ మతం పేరుతో ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని జమ్మూ కాశ్మీర్ సిపిఎం ఎమ్మెల్యే మొహమ్మద్ యూసుఫ్ తరిగామి విమర్శించారు.మత సామరస్యాన్ని కాపాడాలని కోరుతూ ఆవాజ్ ఆధ్వర్యంలో విజయవాడ వించిపేటలో ఆదివారం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామి మాట్లాడుతూ, ఎన్నో కలలు కన్న స్వాతంత్ర భారతదేశం నేడు లేదని ,మత ఛాందసవాదం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుతోవ పట్టించేందుకే ప్రభుత్వం అసహనం పెరిగిందనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పారు. వాస్తవానికి ప్రజలు ఎంతో సహనంగా ఉన్నారని తెలిపారు. బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌స్ అధికారం కోసమే తాపత్రయం...
చెన్నై వరద బాధితుల సహాయార్థం విజయవాడలో సీపీఎం విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య, సిహెచ్ .బాబురావు, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్ పలువురు సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.. తాగేందుకు మంచినీళ్లు కూడా లేని చెన్నై వాసులకు ప్రతీ ఒక్కరు మానవతా హృదయంతో సహాయం చేయాలని కోరారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వరద బాధితుల కోసం మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు.