District News

ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో ఇళ్లను తొలగిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే చావడానికైనా సిద్ధమని తుళ్ళూరు గ్రామస్తులు సిఆర్‌డిఎ అధికారులను హెచ్చరించారు. మాస్టర్‌ప్లాన్‌పై గురువారం నిర్వహించిన సదస్సులో సిఆర్‌డిఎ ల్యాండ్స్‌ డైరెక్టర్‌ చెన్నకేశవులు, డిజైనింగ్‌ డైరెక్టర్‌ రాముడును గ్రామస్తులు నిలదీశారు. గ్రామకంఠా లపై స్పష్టతివ్వాలని, రైతులకు ప్లాట్లు ఎక్కడ కేటాయించేది మాస్టర్‌ప్లాన్‌లో చూపాలని డిమాండ్‌ చేశారు. ప్లాన్‌ను తెలుగులోకి అనువదించి మంత్రు లు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే సదస్సులు నిర్వహించాలని, లేకుంటే తాము అంగీకరించ బోమని తేల్చిచెప్పారు..

 

రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై సిపిఎం అధ్వర్యంలో విజయవాడలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కర్నూలులో కూడా సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు కార్యక్రమాలు నిర్వహించారు. రోహిత్‌ కుటుంబానికి 5కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివక్ష చూపడంవల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆయన మండిపడ్డారు. రోహిత్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

                 బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్న గిరిజనులను మావోయిస్టులతో సంబంధాలున్నాయని ముద్రవేసి అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని, బలమైన ప్రజాపోరాటాల ద్వారా ప్రభుత్వ చర్యలను తిప్పికొడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. జర్రెల మాజీ సర్పంచ్‌ వెంకటరమణను మావోయిస్టులు హత్య చేసిన తరువాత ఏజెన్సీలో పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించి మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధంలేని గిరిజన యువతను వేధింపులకు గురిచేసి, అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. మంగళవారం ఉదయం విశాఖలోని ఎన్‌పిఆర్‌ భవన్లో పోలీసు బాధిత కుటుంబాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో మౌలికసదుపాయాల...

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం- భారత పారిశ్రామిక సమఖ్య (సిఐఐ)లు సంయుక్తంగా కలిసి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిపారు. ఈ సదస్సులో మొత్తం 328 ఒప్పందాలు జరిగాయని వీటివల్ల 4.67క్ష కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందని, 9.58 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

                ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రం దేశంలో కెల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలోకి వెళుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం హారెత్తిస్తున్నారు. వాస్తవంగా ఈ పెట్టుబడుల సదస్సు వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనంకన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని భావిస్తున్నాం.

                 * పెట్టుబడుల...

గ్రామాల్లోకి సర్వేయర్లను రానీయకుండా అడ్డుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రైతులకు పిలుపిచ్చారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం మాలకొండాపురం వద్ద బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తూ నిమ్జ్‌ రైతులు, కూలీల సదస్సు సోమవారం జరిగింది. సయ్యద్‌ హానీఫ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మధు ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. '2013 జిఒ ప్రకారం భూమిని తీసుకోవాలంటే నష్ట పరిహారం చెల్లించి సర్వే చేయాలి. గ్రామ సభలు పెట్టాలి. 80 శాతం మంది మెజారిటి ఆమోదం పొందాలి. ఆ తరువాత పనులు చేపట్టాలి. అందుకు భిన్నంగా ఎనిమిది మందితో మాత్రమే ఆమోదించి భూమి లాగేసుకున్నారు. ఇది...

రాజధాని నగర ప్రాంతంలో 2 వేల నివాసాలు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందుకు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. తొలగించాల్సిన ఇళ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. వచ్చే మార్చిలో ప్రధాన అనుసంధాన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, ఆలోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రోడ్ల నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితర పనులకు మెకన్సీ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా పనులు చేపట్టనున్నారు. ఈలోపే రోడ్డు వెళ్లే సర్వే నెంబర్లలో ఉన్న ఇళ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టే ఉద్దేశంతో ప్రభుత్వముంది. 

                 ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించాలి. రైల్వేపరంగా విశాఖపట్నంకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి. నిన్న రైల్వే అధికారుతో జరిగిన రాష్ట్ర ఎం.పి.ల సమావేశంలో ఎం.పి.లే అసంతృప్తి చెందారంటే రైల్వేపరంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో అర్ధమౌతుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పుకుతుంది తప్ప, దానికి కావల్సిన మౌళిక రవాణా సదుపాయం అయిన రైల్వే జోన్‌ సాధించడంలో పూర్తిగా వైఫ్యలం చెందింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తున్నా కేంద్ర నుండి రావల్సిన నిధులను ఎందుకు...

విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో మద్యపాన నిషేదంపై జరిగిన సదస్సులో  పాల్గొన్న సీపీఎం మహిళా నాయకురాలు బృందాకారత్ మాట్లాడుతూ జన్మభూమిని మద్యం భూమిగా చంద్రబాబు నాయుడు మార్చేశారని విమర్శించారు. ఆదాయం కోసం మద్యాన్ని వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.

సీమ అభివృద్ధిలో భాగంగా ఉద్యమాలకు సీపీఎం శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రాయలసీలమ అభివృద్ధి నినాదంతో వచ్చే నెలలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఫ్రిబవరి రెండో వారంలో రాయలసీమ జిల్లాల నుండి బస్సు, పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, రాయలసీమలోని సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక రాయలసీమ అన్నది వ్యర్థమైన డిమాండ్ అని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాయలసీమకు అదనంగా నిధులు కేటాయించాలన్నారు. మంచినీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టిటిడి నిధులను రాయలసీమ జిల్లాల నీటి సదుపాయానికి వినియోగించాలని, జన్మభూమి పేరిట జరుగుతున్నది ప్రచార...

రాజధాని ప్రాంత రైతుల్లో అగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వమిచ్చిన హమీలేమీ అమలుకు నోచకపోగా జరీబులో భూములిచ్చిన వారికి మెట్ట ప్రాంతంలో భూములు కేటాంచాలని నిర్ణయించడం, వేలకోట్లతో నిర్మిస్తామని చెబుతున్న రాజధాని తొలి తాత్కాలిక నిర్మాణానికే అప్పు తీసుకోవాలని నిర్ణయించడం వంటి విషయాలతో రైతుల్లో అనుమానాలతోపాటు ఆగ్రహమూ పెరుగుతోంది. జరీబు రైతులకు వారి గ్రామాల్లో భూములివ్వబోమని చెప్పడంతో మందడం రైతులు సిఆర్‌డిఏ కార్యాలయంలోనే మాస్టర్‌ప్లాను నకలు కాపీని చించిపారేశారు. అక్కడ భూములిస్తే మాస్టర్‌ప్లాన్‌కు ఇబ్బందని, పక్కకు వెళ్లిపోవాల్సిందేనని సిఆర్‌డిఏ అధికారులు తేల్చిచెప్పారు. తమ గ్రామాల్లో భూములివ్వనప్పుడు మేము పొలాలు ఇవ్వబోమని, వెంటనే సాగుచేసుకుంటామని...

Pages