సీమ అభివృద్ధికి సీపీఎం పాదయాత్ర..

సీమ అభివృద్ధిలో భాగంగా ఉద్యమాలకు సీపీఎం శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రాయలసీలమ అభివృద్ధి నినాదంతో వచ్చే నెలలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఫ్రిబవరి రెండో వారంలో రాయలసీమ జిల్లాల నుండి బస్సు, పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, రాయలసీమలోని సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక రాయలసీమ అన్నది వ్యర్థమైన డిమాండ్ అని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాయలసీమకు అదనంగా నిధులు కేటాయించాలన్నారు. మంచినీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టిటిడి నిధులను రాయలసీమ జిల్లాల నీటి సదుపాయానికి వినియోగించాలని, జన్మభూమి పేరిట జరుగుతున్నది ప్రచార ఆర్భాటమే తప్ప సమస్యల పరిష్కారానికి కాదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి వచ్చినా ఈ ప్రాంతానికి న్యాయం జరగలేదనే అభిప్రాయం ఉందని, దీనికి ప్రత్యేక రాయలసీమ అడగడం సరికాదన్నారు. రాయలసీమ ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడాలంటే ప్రత్యేక నిధులు కావాలని, పరిశ్రమలు ఏర్పాటు కావాలని సూచించారు. తాము చేపట్టబోయే కార్యక్రమాలకు అందరూ సహకరించాలని మధు పేర్కొన్నారు.