విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలి. ఈ నెల 13 నుండి కొత్తగా హౌరా - యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (02863) కు విశాఖలో హాల్ట్‌ ఏర్పాటు చేయాలి. - సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం

                 ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించాలి. రైల్వేపరంగా విశాఖపట్నంకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి. నిన్న రైల్వే అధికారుతో జరిగిన రాష్ట్ర ఎం.పి.ల సమావేశంలో ఎం.పి.లే అసంతృప్తి చెందారంటే రైల్వేపరంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుందో అర్ధమౌతుంది. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పుకుతుంది తప్ప, దానికి కావల్సిన మౌళిక రవాణా సదుపాయం అయిన రైల్వే జోన్‌ సాధించడంలో పూర్తిగా వైఫ్యలం చెందింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తున్నా కేంద్ర నుండి రావల్సిన నిధులను ఎందుకు రాబట్టలేకపోతుంది. విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తే తుఫాన్‌ వచ్చి ఆ ప్రాంతం ముంపుకు గురౌతుందని, అది నిరుపయోగం అని ఎం.పి రాయిపాటి సాంబశివరావు పేర్కొనడం ఎంత విడ్డూరంగా వుందో అర్ధమౌతుంది. ఎం.పి.గా వుండి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాల్సింది పోయి వక్రబుద్దితో వ్యవహరించడం సరైనదికాదు. దీనిని సిపియం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

రాష్ట్ర విభజన సందర్భంగా విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణా కమీషన్‌ పేర్కొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తామని వాగ్ధానం చేశారు. నేటికి కూడా హామీని నెరవేర్చకుండా విశాఖ ప్రజలను మోసంచేస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌కు భదత్రా చర్యలు అంతంతమాత్రంగానే వున్నాయి. 8 ప్లాట్‌పారమ్స్‌లో 120 నిఘాకమెరాలు కావాలని ఆర్‌పిఎఫ్‌ ప్రతిపాధన పంపిస్తే, నేటికీ అవి 22 మాత్రమే వున్నాయి. భద్రతా చర్యలు పట్ల ఎంత శ్రద్ధగా వ్యవహరిస్తున్నారో ఇదే నిదర్శనం.

              విశాఖపట్నంకు రావల్సినకు పలురైల్లను  దువ్వాడ మీదగా మళ్లీంచే కార్యక్రమం చేస్తున్నారు. కొన్ని రైల్లకు విశాఖలో హాల్ట్‌ లేకుండా నేరుగా వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ప్రజలు అనేక యిబ్బందులు పడుతున్నారు. ఈ నెల 13 నుండి కొత్తగా హౌరా-యశ్వంత్‌పూర్‌ వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెడుతున్నట్లు వాల్తేరు డివిజన్‌ నుండి ప్రకటన వచ్చింది. ఈ హౌరా-యశ్వంత్‌పూర్‌ (02863) నెంబరు గల రైలు హౌరా నుండి ఖర్గ్‌పూర్‌, ఖుర్ధారోడ్‌, బరంపూర్‌, విజయనగరం, విజయవాడ, రేణుగుంట మీదగా రాకపోకలు సాగిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖను స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని, అన్ని రకాలైన మౌళిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. హౌరా-యశ్వంత్‌పూర్‌ రైలుకు విశాఖలో హాల్ట్‌లేకుండా చేయడమంటే విశాఖపట్నంను నిర్లక్ష్యంచేయడమే అవుతుంది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని హౌరా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖలో హాల్ట్‌ ఏర్పాటు చేయాలని,  ప్రత్యేక రైల్వేజోన్‌ ప్రకటించాలని సిపియం పార్టీ డిమాండ్‌ చేస్తోంది. లేనియడల ప్రజాగ్రాహానికి గురికావల్సి వస్తుందని తెలియజేస్తున్నాం.