District News

  అఖిపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఎ కార్యాయాన్ని ముట్టడిరచిన  రైతు

    కృష్ణాజిల్లాలోని గ్రామాల‌ను గ్రీన్‌జోన్‌ నుంచి మినహాయించేందుకు అఖిపక్ష నేతలు ఈ నె 29వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. ఆలోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేయకపోతే విజయవాడలో సిఎం క్యాంప్‌ కార్యాయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జల‌వనరుశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతు పక్షాన నిబల‌డతారో, సింగపూర్‌ కంపెనీల‌కు వత్తాసుగా ఉంటారో స్పష్టం చేయాల‌ని డిమాండు చేశారు. కృష్ణాజిల్లా మైవరం, జి కొండూరు మండలాను గ్రీన్‌జోన్‌ నుంచి తొల‌గించాంటూ రైతు రాజధాని ప్రాంత ప్రాధికారసంస్థ (సిఆర్‌డిఎ) కార్యాయాన్ని సోమవారం ముట్టడిరచారు. గ్రీన్‌జోన్‌లో చేర్చటంపై అభ్యంతరాలు...

పేదలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. పట్టణంలోని ఆదర్శ పాఠశాల సమీపంలో ఇటీవల పేదలు స్వాధీనం చేసుకున్న ఉన్న 570 సర్వే నెంబర్‌ స్థలాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాజకీయ నాయకులు, ధనికులకు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెడుతోందన్నారు. కొండలకు కూడా పట్టాలు ఇచ్చి వారికి పంపిణీ చేస్తోందన్నారు. పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి మాత్రం వారు ముందుకు రాలేదన్నారు. రెండు విడతల జన్మభూమిలో జిల్లా వ్యాప్తంగా 57,376 మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చారన్నారు. ఇందులో కేవలం 16 వేల మందికి మాత్రమే పట్టాలు ఇస్తామంటూ ప్రభుత్వం చెబుతోందన్నారు. 22 మండలాల్లో 37 వేల ఎకరాల...

     ఉత్తరాంధ్ర అభివృద్ధికి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సర్క్యూట్‌ హౌస్‌లో వినతిపత్రాన్ని అందజేశారు. 
వినతి పత్రంలోని వివరాలను వేదిక ప్రధాన కార్యదర్శి ఎ అజశర్మ మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, సెక్షన్‌ 94(2)లోని మౌలిక వసతుల కల్పన, సెక్షన్‌ 93(13 షెడ్యూల్‌)లోని ఐఐఎం, గిరిజన యూనివర్శిటీ, ప్రత్యేక రైల్వే జోన్‌ వంటి వాటిపై తక్షణమే స్పందించాలన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం సాగునీటి సౌకర్యం లేకపోవడమేనన్నారు. పేదరికంతో ప్రజలు వలసలు పోతున్నారన్నారు....

విజ‌య‌వాడ రాజీవ్‌గాంధీ కాల‌నీలో అగ్ని ప్రమాదం జరిగి మూడు రోజులు అయియినా  అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై సి.పి.ఎం. రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు శ్రీ సిహెచ్‌.బాబూరావు మండిప‌డ్డారు.  వారికి శాశ్వ‌త గౄహాలు మంజూరు చేయాల‌ని కోరారు.  
 గూడుపోయింది, నోటికాడ కూడు పోయింద‌ని బాధితుల వెల్ల‌డి.  ఘోర అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి అటు చలిలో, ఇటు ఎండల్లో తీవ్ర ఇబ్బందు పడుతూ దుర్బరంగా తయారయిన రాజీవ్‌గాంధీకానీ వాసును సిపిఎం నాయకు బృందంగా వెళ్లి పరామర్శించారు. కానీ మొత్తం ప్రతి ఇంటింటికీ తిరిగి, బాధిత ప్రజను పరామర్శిస్తూ, ప్లిు, వృద్దు, మహిళ యోగక్షేమాను అడుగుతూ, భోజనాు, ఇతర ఏర్పాట్ల పరిస్థితిపై బాబూరావు, కాశీనాథ్‌ అడిగి తొసుకుంటూ కానీ మొత్తం...

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మత్స్యకారులు, రైతులు ఆందోళనకు దిగారు. తుందుర్రులో చేపట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ గురువారం భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఫుడ్‌ పార్కు నిర్మిస్తున్న తుందుర్రు, కె.బేతపూడి, జొన్నలగర్వు గ్రామస్తులతోపాటు.. మొగల్తూరు మండల కేంద్రం, ముత్యాలపల్లి, కొత్తోట, వారతిప్ప, కాళీపట్నం తదితర ప్రాంతాల రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మొగల్తూరు ప్రధాన రహదారి నుంచి నరసాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు.

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలా? వద్దా? అనే విషయమై దమ్ముం టే చంద్రబాబునాయుడు 'ప్రజాభిప్రాయ ఓటింగు' పెట్టాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సవాల్‌ విసిరారు. 'మెజార్టీ ప్రజలు ఎయిర్‌పోర్టు కావాలంటే కట్టుకోండి. లేదంటే తోకము డిచి ఎయిర్‌పోర్టు ప్రతిపాదన విరమించు కోండి' అని సూచించారు. రాష్ట్ర రాజధానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సరిపోయినప్పుడు, విశాఖలో ఎయిర్‌పోర్టు ఉండగా ఇక్కడ మరొకటి ఎందుకని ప్రశ్నించారు. ఇది భోగాపురంలోని పెద్దల భూములకు ధరలు పెరగడానికి తప్ప, ప్రయాణికుల కోసమో, ప్రజల కోసమో కాదని విమర్శించారు. అభివృద్దే అనుకుంటే.. ఈ ప్రాంతంలోని మంత్రి అయ్యన్నపాత్రుడు భూములు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు....

   ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని కార్మికశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం మండలంలోని నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎపిఎన్‌జిఒ సంఘ 19వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఆ సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌జిఒల రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. సుదీర్ఘకాలంగా అపరిష్కతంగా ఉన్న కాంట్రాక్టు, కంటింజెంట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిందన్నారు. ఉపసంఘం సిఫార్సుల మేరకు ఆయా ఉద్యోగులను...

వంశధార నిర్వాసితుల పాదయాత్ర
కష్టాలను చెప్పుకోవడానికి బయలుదేరిన నిర్వాసితులు
మరో పోరాటానికి సిద్ధమైన బాధితులు
పాదయాత్రకు విశేష స్పందన

     వంశధార నిర్వాసితులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టిన వారు ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో, పాదయాత్రకు సంకల్పించారు. ప్రజల్లోకి వెళ్లి తమపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని నిర్ణయించారు. పునరావాసం, పరిహారం విషయంలో జరుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి సమాయత్తమయ్యారు. ప్రభుత్వ తీరుతో తాము పడుతున్న కష్టాలు, కన్నీళ్లను వివరించేందుకు బయలుదేరారు. పునరావాసం పూర్తి చేసిన తర్వాతే...

ప్రయివేటు రంగంలో దామాషా పద్ధతి (జనాభా నిష్పత్తి)లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయివేటు రంగంలో రిజర్వేషన్స్‌ పోరాట సాధన కమిటీ సలహాదారు కె.ఎస్‌.చలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్‌ ఆడిటోరియంలో ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో 'ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి' అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. కెవిపిఎస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి డి.గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో కె.ఎస్‌.చలం మాట్లాడారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను అనుసరించి ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సామాజిక వైరుధ్యాలను...

Pages