District News

ఢిల్లీ జె.ఎన్.యు.లో స్టూడెంట్ అధ్య‌క్షుడు క‌న్హ‌య్ కుమార్‌ను విడుద‌ల చేయాల‌ని, విద్యార్ధుల‌పై పెట్టిన అక్ర‌మ కేసులు ర‌ద్దు చేయాల‌ని వామ‌ప‌క్ష పార్టీల ఆధ్వ‌ర్యంలో ర్యాలీ, స‌భ నిర్వ‌హించారు. క‌ళాక్షేత్రం వ‌ద్ద నుండి జ‌రిగిన ర్యాలీలో  వామ‌ప‌క్ష పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు,  అభ్యుద‌య వాదులు, ప్ర‌జలు పెద్ద సంఖ్య‌లో పాల్గొని నిర‌స‌న తెలియ‌చేశారు.   విద్యార్దుల‌పై పెట్టిన అ్ర‌క‌మ కేసులు ర‌ద్దు చేయాల‌ని, క‌న్హ‌య్ కుమార్‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని,  యూనివ‌ర్సీటీల‌లో కేంద్ర‌ప్రభుత్వ జోక్యం ఉండ‌రాద‌ని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.   అనంత‌రం లెనిన్  సెంట‌ర్‌లో జ‌రిగిన స‌భ‌లో వామ‌ప‌క్ష పార్టీల నాయ‌కులు మాట్లాడారు. బిజెపి  ప్ర‌భుత్వం  కావాల‌నే...

విమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎం.ఎల్‌.సి శ్రీ ఎం.వి.ఎస్‌.శర్మ డిమాండ్‌ చేశారు. విమ్స్‌ను ప్రారంభించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) చేస్తున్న 48 గంటల నిరాహారదీక్షా శిభిరాన్ని నేడు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో విమ్స్‌ను అభివృద్ధి చేయాలని, సామాన్య ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తేవాలని కోరారు. గోదావరి పుష్కరాలకు 1600 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వం విమ్స్‌కు 100 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విమ్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు 600రోజులు పూర్తవుతున్నా...

పట్టణీకరణ పెరిగిపోతున్న నేపద్యంలో పేద ,మధ్య తరగతి ప్రజకు ఇళ్ళు, ఇళ్ళపట్టాలు, పట్టాల‌ రిజిస్టేషన్లకై వామపక్షపార్టీల‌ ఆధ్వర్యంలో మార్చి 16న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టాల‌ని వామపక్షాలు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల సమస్య పరిష్కారం కోసం  ఆందోళన చేపట్టనున్నట్లు వెల్ల‌డించారు.  ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించేందుకు  ముందుగా ఫిబ్రవరి 26న ధర్నాలు, 28వ తేది నుండి మార్చి 9 వరకు పాదయాత్రలు,  మార్చి 12న సైకిల్‌ ర్యాలీలు నిర్వహించాల‌ని పిలిపునిచ్చారు.  ఈ మేరకు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వామపక్ష నేతలు తీర్మానాలు  చేశారు.  మంగళవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు.  ఇందులో సిపిఎం...

బాబొస్తే జాబొస్తుందంటూ కల్లబొల్లిమాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అడ్డం తిరిగారు.. బాబుకేమో వాస్తవంగా జాబొచ్చింది.. ఇక్కడ ఎంఎల్‌ఏగా ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడుకీ ఎంఎల్‌సిగా చోటు దక్కింది.. జాబ్‌ ఇస్తారని నమ్మి ఓటేసిన జనానికేమో కష్టాలొచ్చాయి' అంటూ వామపక్ష నాయకులు ఉద్ఘాటించారు. రాయలసీమ బస్సు యాత్రకు మూడో రోజు చిత్తూరు జిల్లాలో అడుగడుగునా ఆదరణ లభించింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి గాలేరు-నగరి వస్తే తప్ప ఇక్కడ ప్రజల మనుగడ సాధ్యం కాదన్నారు. కండలేరు తాగునీటి పథకాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకొస్తే జిల్లావాసిగా ఉండి చంద్రబాబు రద్దు చేయడం ఈ ప్రాంతం పట్ల ఎంత వివక్ష చూపిస్తున్నారో అర్ధమవుతుందన్నారు...

 దివీస్‌ లేబొరేటరీ.. పరిసర ప్రాంతాలను విషతుల్యం చేస్తోంది. ఒకప్పుడు పిల్లా, పాపలతో సంతోషంగా గడిపే కుటుంబాలిప్పుడు బతుకు తెరువులేక అల్లాడుతున్నాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం భీమిలి మండలం చిప్పాడ పంచాయతీలో దివీస్‌ లేబొరేటరీ ఉంది. ఇది దశాబ్దంన్నరగా ఔషధాలకు అవసరమైన పౌడరు ను ఉత్పత్తి చేస్తోంది. ఈ కంపెనీ వెలువరించే వాయు, జల రసాయనాల కాలుష్యంతో భీమిలి మండలంలోని 17 గ్రామాలకు చెందిన జనం టిబి, కీళ్ల నొప్పులు, గుండె, కంటి, కిడ్ని, శ్వాసకోశ వంటి వ్యాధుల బారినపడుతున్నారు.

 ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒక్క ఇటుకను పేర్చినా ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో బహిరంగ సభ నిర్వహించారు.ఇంట్లో పెట్టుకునే ఎసికి వినియోగించే అమ్మోనియం వాయువు కంటే లక్షల రెట్లు అధికంగా ఆక్వా ఫుడ్‌ ఫ్యాక్టరీల్లో ఐస్‌ తయారు కావడానికి వినియోగిస్తారని, ఆ సమయంలో గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందితే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో జన్మించి పరిసర ప్రాంతాల్లో ప్రజలు బతికే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వట్టి మాటలు కట్టిపెట్టి ఫ్యాక్టరీలకు ఇచ్చిన లైసెన్సులను రద్దు చేస్తూ జిఒలు జారీ...

రాయలసీమ ప్రాజెక్టుల గురించి స్పష్టంగా చెప్పకపోవడాన్ని వామపక్షాల నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.మదనపల్లి బస్టాండులో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చువుతుందని ముఖ్యమంత్రి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారని, అయితే గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో స్పష్టం చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టుల మొదటి దశ, రెండో దశ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేస్తామంటూ డొంక తిరుగుడుగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.అభివృద్ధి ముసుగులో ముఖ్యమంత్రి.. అమరావతి అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తూ, వెనుకబడిన...

       వంశధార నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం, పరిహారం కల్పించిన తరువాతే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా, వారిని రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదని హితవు పలికాయి. నిర్వాసితుల డిమాండ్లు న్యాయమైనవనీ, వారు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపాయి. ఆదివారం స్థానిక క్రాంతిభవన్‌లో చౌదరి తేజేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ, లోక్‌సత్తా, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమొక్రసీ, వైసిపి పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి క్రిష్ణమూర్తి మాట్లాడుతూ 2005లో వంశధార ప్రాజెక్టును...

ఇప్ప‌టికైనా తెలుగుదేశం ఎం.ఎల్.ఏల‌కు జ్ఞానోద‌యం మ‌యింది.....
నిజంగా చిత్త‌శుద్ది వుంటే మాస్టర్‌ప్లాన్ స‌మూలంగా మార్చాల‌ని నేరుగా ముఖ్య‌మంత్రికి చెప్పాలి .
                                                                      - సిహెచ్‌.బాబూరావు డిమాండ్ 
   సి.ఆర్‌.డి.ఏ మాస్ట‌ర్‌ప్లాన్‌పై ప్ర‌జాప్ర‌తినిధులతో అధికారులు జ‌రిగిన  స‌మావేశంలో తెలుగుదేశం పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు కూడా మాస్ట‌ర్‌ప్లాన్‌పై అభ్యంత‌రాలు చెప్పారు. మార్పులు చేయాల్సిన అవ‌సరం వుంద‌ని  స‌మావేవంలో అధికారుల‌కు తెలప‌డం జ‌రిగింది. ప‌ది నెల‌ల త‌రువాత అధికా పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులకు జ్ఞానోద‌యం అయినందుకు సంతోషం. ఇప్ప‌టి వ‌ర‌కు సి.ఆర్‌.డి.ఏ. ప్లాన్‌లో మార్పులు...

2016-17 విఎంసి భారాల బడ్జెట్‌ 
టాక్స్‌లు, పన్నుల రూపంలో రూ. 100 కోట్లు ప్ర‌జ‌ల‌పై భారాలు.
అభివృద్ది పనుల్లో... సంక్షేమ కార్యక్రమాల్లో కోత .. పేద వాడల పట్ల బడ్జెట్‌లో  వివక్షత  అధికార టిడిపి వైఖరికి 
బడ్జెట్‌లో  సవరణలు చేయాలి. -  సి.పి.ఎం. న‌గ‌ర కార్య‌ద‌ర్శి దోనేపూడి కాశీనాధ్‌ వ్లెల‌డి

Pages