District News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సీపీఎం తప్పుబట్టింది. ప్రజలపై భారాలు మోపడం సరికాదని పేర్కొంది. రాష్ట్రంలో సుమారు రూ. 270 కోట్ల మేర ప్రజలపై భారం మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నేడు ప్రజాభిప్రేయ సేకరణ జరగనుంది. ఈ ఛార్జీల పెంపును సీపీఎం, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమని, పెద్ద పెద్ద కంపెనీలపై పన్నులు వేసి డబ్బులు వసూలు చేస్తే ఛార్జీలు పెంచాల్సినవసరం లేదన్నారు. నాలుగు శాతం అనేది చాలా ఎక్కువని, ఛార్జీలు పెరగడం వల్ల ప్రతి వస్తువు ధర కూడా పెరుగుతుందని తెలిపారు....

కేంద్ర ప్రభుత్వం 2012లో జారీ చేసిన విద్యాహక్కు చట్టం అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ అన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా విద్యా హక్కుచట్టానికి ఎటువంటి నిధులూ కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. స్టూడెంట్‌, టీచర్‌ నిష్పత్తి ప్రకారం స్కూల్‌లను మూసివేస్తున్నారని, ఇప్పటికే 400 స్కూళ్లను మూసివేశారని విమర్శించారు. అభివృద్ధి చెందాల్సిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను తెరవాల్సినవసరం ఉందన్నారు. సర్వశిక్షా అభియాన్‌ కింద బడ్జెట్‌లో కేటాయింపులు కుదించిందనీ, ఈ మేరకు ఈ పథకం కింద బడ్జెట్‌లో నిధులను పెంచాలని డిమాండ్‌ చేశారు....

నగరంలో పేద‌లు నివ‌శించే కాలువ‌క‌ట్ట‌ల‌పై ఇళ్లకు సర్వే పేరుతో ప్రభుత్వం   తొగించేందుకు , పేదల‌ను రోడ్డున పడేసేందుకు కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సిహెచ్‌ బాబూరావు అన్నారు. మంగళవారం సిపిఎం, సిపిఐ నగర కమిటి ఆద్వర్యంలో బుడమేరు మద్యకట్ట ప్రాంతంలో ఇళ్ల సమస్య పరిష్కారం కోరుతూ పాదయాత్రను నిర్వహించారు. బుడమేరు వంతెన వద్ద నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రలో పాల్గన్న సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో బుడమేరు మధ్యకట్ట ఇళ్ళ జోలికి వస్తే సహించేది లేదన్నారు. జనాభా లెక్కులు, ఇతర సర్వే నగరమంతా  చేయకుండా కేవం  కాలువ‌క‌ట్ట‌ల‌పైనే  ఎందుకు చేస్తున్నారో స్పష్ట పరచాల‌న్నారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల తొగింపుకు ప్రభుత్వం పూనుకుంద‌న్నారు...

ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మరోమారు మొండిచెయ్యి చూపించిందని సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు విమర్శించారు. వామపక్షాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన 'రాయలసీమ బస్సుయాత్ర' మంగళవారం గుంతకల్లుకు చేరింది. ఆఖరి రోజు కళ్యాణదుర్గంలో ప్రారంభమైన యాత్ర బెళగుప్ప, కణేకల్‌, ఉరవకొండ, వజ్రకరూరు మీదుగా రాత్రికి గుంతకల్లుకు చేరింది. బుధవారం ఉదయం కర్నూలు జిల్లా మద్దికెరలోకి ప్రవేశిస్తుంది.పలుచోట్ల జరిగిన సభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శ్రీనివాస రావు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన రాయల సీమకు మరో మారు మొండిచెయ్యి చూపిందని విమర్శి ంచారు. మూడో...

 - ఎమ్‌డి ఛాంబర్‌లో రైతులు, కార్మికుల బైటాయింపు
 - తలుపులు బద్దలగొట్టి అరెస్టు చేసిన పోలీసులు
 - బాలకృష్ణ, ఫణిరాజ్‌, హరినాథ్‌బాబులపై కేసులు బనాయింపు
తుమ్మపాల సుగర్‌ ఫ్యాక్టరీలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలపై ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ సుగర్‌ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యాన రైతులు, కార్మికులు ఫ్యాక్టరీ ఎమ్‌డి ఛాంబర్‌ లోపలకు చొచ్చుకెళ్లి ఎమ్‌డి సత్యప్రసాద్‌ ఎదుట బైటాయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సమితి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సమితి కన్వీనర్‌ ఎ.బాలకృష్ణ, కో-కన్వీనర్‌ ఫణిరాజ్‌, ఆప్‌...

చిప్పాడ దివీస్‌ లేబొరేటరీస్‌ మూడో యూనిట్‌ విస్తరణ పనులను ఆపకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం హెచ్చరించారు. యూనిట్‌ 3 నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో చిప్పాడ పంచాయతీ పరిధిలోని సిటీనగర్‌ జంక్షన్‌లో రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం లోకనాధం దీక్షాశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివీస్‌ యాజమాన్యం చర్చలు ద్వారా డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సంధానకర్తలు,...

భీమిలి మండలం చిప్పాడలో దివీస్‌ లేబొరేటరీస్‌ యూనిట్‌ 3 విస్తరణ ద్వారా పచ్చని పల్లెలు విషతుల్యమవుతాయని, అటువంటి అభివృద్ధిని ఎవ్వరూ కోరుకోరని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి అన్నారు. యూనిట్‌ విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో సిటీ నగర్‌ జంక్షన్‌లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని ప్రభావతి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను కాలుష్యంతో నింపడమేనా చంద్రబాబు అభివృద్ధి అని ప్రశ్నించారు. వాతావరణానికి హాని లేని, ఉపాధికి కొదువ లేని...

                 శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని వంశధార నిర్వాసితులు ఆదివారం సమరశీల ప్రతిఘటన చేశారు. తమ భూములకు పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా పోలీసు బలగాలతో పనులు చేయిస్తుండ టంపై తీవ్ర ఆగ్రహం చెరదారు. శనివారం తమ ఆందోళనా శిబిరాన్ని పోలీసులు కూల్చి వేయడంపై ఆగ్రహంతో ఉన్న నిర్వాసితులు సెక్షన్‌ 30ని ధిక్కరించి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పనుల కోసం అధికారులు వేసిన రేకుల షెడ్డును కూల్చివేశారు. అక్కడున్న పరికరాలను వంశధారలో పడేసి తమ నిరసనను ప్రభుత్వానికి చూపారు. అంతేకాదు స్థానిక తహశీలుదారును ఘెరావ్‌ చేశారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పాలకొండ ఆర్డీవో ప్రకటించారు. 
హిర...

  ముఖ్యమంత్రి పేద పట్ల చిత్తశుద్దిలేదని, వుంటే  ఎన్నికల‌ వాగ్ధానం మేరకు పేదల‌కు ఇళ్ళు, పట్టాలు ఇవ్వాల‌ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు లు శ్రీ సిహెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. పేదకు ఇళ్ళు, స్థలాలు, రిజిస్ట్రేషన్లు కోరుతూ సిపిఎం, సిపిఐ, వామపక్షా ల నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని తహశీల్థార్‌ కార్యాయం వద్ద ధర్నాలో ఆయన ప్రసంగించారు.  296 జీవో ప్రకారం కొండ, రెవిన్యూ స్థలాల్లో జీవిస్తున్న వారికి క్రమబద్ధీకరించి పట్టాలు ఇస్తామని, రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పినా  ఏదో ఒక కారణంతో పట్టాలు ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని, జీవో ఎందుకు ప్రజకు ఉపయోగం లేదనందున అదులో మార్పు చేయాని కోరారు.   ఇళ్ళులేని పేదందరికీ ఇళ్ళు ఇస్తామని,పట్టాలు...

వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కావాల్సింది ఉత్సవాలు కాదు... అభివృద్ధిపై కార్యచరణ కావాలి' అని సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్‌ చేశారు. రాయలసీమ అభివృద్ధిని కాంక్షిస్తూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన బస్సుయాత్ర ఆదివారం నాటితో రెండో రోజుకు చేరుకుంది. పుట్టపర్తిలో ప్రారంభమైన యాత్ర కొత్తచెరువు, ధర్మవరం, బత్తలపల్లి, ఎస్కేయూ మీదుగా సాయంత్రానికి అనంతపురం నగరానికి చేరుకుంది. యాత్ర వెళ్లిన ప్రతిచోటా విద్యార్థులు, యువకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ప్రసంగాలు చేసిన అన్ని ప్రధాన కూడళ్లలోనూ జనం ఆసక్తిగా నాయకుల ప్రసంగాలను విన్నారు. ప్రభుత్వాల తీరును ఎండగట్టినప్పుడు చప్పట్లో తమ మద్దతును తెలియజేశారు. రెండో రోజు జరిగిన యాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి...

Pages