District News

సీమ ప్రజల తరపున కేంద్రానికి తమ వాణి వినిపించేందుకు సిపిఐతో కలిసి సిపిఎం బస్సుయాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. నేడు తిరుపతిలో యాత్ర ప్రారంభమై మార్చి 5 వరకు సీమలోని నాలుగు జిల్లాల్లో కొనసాగుతుంది. నాలుగు జిల్లాల్లోనూ సిపిఎం, సిపిఐ నేతలు పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఇదే స్ఫూర్తితో మార్చి 11న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్ట్‌ల పూర్తి, కడపలో ఉక్కు కర్మాగారం తదితర హామీలు ఏమయ్యాయో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఆయా హామీలు ఎందుకు ముందుకు సాగడం లేదో వివరించనున్నారు.

విశాఖకు కెకె లైన్‌తో కూడిన రైల్వేజోన్‌ ప్రకటించాలని సిపిఎం నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం విశాఖ రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యాన ధర్నా జరిగింది. ఈ ధర్నానుద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, రైల్వేజోన్‌పై జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చడానికి కమిటీల పేర నాన్చుతూ బిజెపి కుట్ర పన్నిందని విమర్శించారు. రైల్వేజోన్‌పై జాప్యం ఒడిశా అభ్యంతరాల వల్ల కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. సిపిఎం నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పారిశ్రామిక హబ్‌, ఆర్థిక రాజధాని కావాలంటే రైల్వే జోన్‌ అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈస్ట్‌...

మాన్సాస్‌ ట్రస్టు భూములు 99 ఎకరాలు దివీస్‌ లేబొరేటరీకి విక్రయించడంపై న్యాయవిచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎన్‌పిఆర్‌ భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, బీమిలి డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దివీస్‌కు తాకట్టుపెట్టిందని విమర్శించారు. ఇక్కడ ప్రజాభిప్రాయసేకణ నిర్వహించకుండా విస్తరణ నిర్మాణపనులు చేపడుతున్న దివీస్‌కు విజయనగరం జిల్లా జి.చోడవరంలో పేదలు సాగుచేసుకుంటున్న అస్సైన్డ్‌ భూములు 43.18 ఎకరాలు అప్పగిస్తూ ఈ నెల ఒకటిన ప్రభుత్వం జిఒ 43 విడుదల చేసిందని తెలిపారు. స్థానికులకు...

 రైవాడ నీరు రైతులకు పునరంకితం అయ్యే వరకూ రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం సాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. రైవాడ నీరు రైతులకు ఇవ్వాలని కోరుతూ రైవాడ ఆయకట్టుదారుల నీటి సాధన కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 14న ప్రారంభమైన పాదయాత్ర గురువారం విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం, ఆనందపురంలో ముగిసింది. ఈ సందర్భంగా సాధన కమిటీ అధ్యక్షులు వేచలపు చినరామునాయుడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో లోకనాథం మాట్లాడారు. రైవాడ నీటిని సాధించేందుకు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనే సమయం ఆసన్నమైందని, ఇందుకు ఆయకట్టుదారులు సిద్ధం కావాలన్నారు. రైవాడ జలాశయానికి జివిఎంసి బకాయి పడ్డ రూ.112 కోట్లు చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ బకాయిలను జివిఎంసి...

 విశాఖ జిల్లా, భీమిలి మండలంలో వున్న  దివీస్‌ కంపెనీ మూడో యూనిట్‌ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్‌ ఆటోస్టాండ్‌ నుంచి ప్రారంభమై దివీస్‌ కంపెనీ వరకు సాగిన ప్రదర్శనలో ఆశపాలెం, కొసవానిపాలెం, కంచేరుపాలెం, చిప్పాడ, మూలకొద్దు, నమ్మివానిపాలెం, పెదనాగమల్లిపాలెం, అన్నవరం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజలను చీల్చి తమ పనులు చక్కదిద్దుకోవాలన్న యాజమాన్య కుయుక్తులను పసిగట్టిన ఉద్యమ కమిటీ అడ్డుకుంది. ప్రదర్శన చినసాయిబాబా గుడి దగ్గరకు చేరుకొనేసరికి ప్రదర్శనకారులతో యాజమాన్య అనుకూలురు వాదనకు దిగారు. చిప్పాడ...

 విశాఖ జిల్లా, భీమిలి మండలంలో వున్న  దివీస్‌ కంపెనీ మూడో యూనిట్‌ నిర్మాణ పనులు నిలిపివేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దివీస్‌ వ్యతిరేక ఉద్యమ కమిటీ భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించింది. భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ సిటీనగర్‌ ఆటోస్టాండ్‌ నుంచి ప్రారంభమై దివీస్‌ కంపెనీ వరకు సాగిన ప్రదర్శనలో ఆశపాలెం, కొసవానిపాలెం, కంచేరుపాలెం, చిప్పాడ, మూలకొద్దు, నమ్మివానిపాలెం, పెదనాగమల్లిపాలెం, అన్నవరం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజలను చీల్చి తమ పనులు చక్కదిద్దుకోవాలన్న యాజమాన్య కుయుక్తులను పసిగట్టిన ఉద్యమ కమిటీ అడ్డుకుంది. ప్రదర్శన చినసాయిబాబా గుడి దగ్గరకు చేరుకొనేసరికి ప్రదర్శనకారులతో యాజమాన్య అనుకూలురు వాదనకు దిగారు. చిప్పాడ...

రాజధానిలో భూ కుంభకోణాను ప్రభుత్వం చట్టబద్ధం చేస్తోంది.  పేద‌ల‌ను న‌ట్టేట ముంచి పెద్ద‌ల‌కు దోచిపెట్టేందుకు ప్ర‌భుత్వం పూనుకుంది. లంక‌భూముల వ్య‌వ‌హారంలో బ‌హిర్గ‌త‌మయింది.  అసైన్డ్‌, లంక, ఫారెస్ట్‌ భూములు అమ్మడానికి వీల్లేదని చెప్పి దళితులు, పేదల‌ను భయపెట్టి పెద్దలు భూము కొనుగోలు చేశారు.  న‌ష్ట‌పరిహారం కూడా ఇవ్వబోమని చెప్పడంతో పేదలు భయపడి భూముల‌ను తక్కువ ధరకు అమ్ముకున్నారు.  కొనుగోళ్లు పూర్త‌యిన త‌రువాత  జిఓ నెంబరు 41 విడుదల చేసి వాటిని చట్టబద్ధం చేసి పెద్ద‌ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్య‌క్షంగా తోడ్ప‌డింది. ద‌ళితుకు న్యాయం చేయానే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఈ జీవో గత ఏడాది ఏప్రిల్‌, మార్చిలోనే  ఇవ్వాలి. కాని  ప్ర‌భుత్వం ఆ విధంగా చేయ‌లేదు. పేద‌ల వ‌...

అభ్యుదయ, వామపక్ష శక్తులను విఛ్చిన్నం చేయటం ఆర్‌ఎస్‌ఎస్‌ తరం కాదని, పేద, ధనిక తారతమ్యాలు ఉన్నంత కాలం ఆయా శక్తులుంటాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి దాడిని నిరశిస్తూ ఆదివారం నగర పార్టీ కార్యాలయం నుండి శంకర్‌ విలాస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఢిల్లీలోని జెఎన్‌యు ఎంతో మంది మేధావుల్ని, దేశానికి నాయకుల్ని అందించిందన్నారు. అలాంటి వర్సీటీలో చోటు చేసుకున్న ఒక ఘటనను ఆధారం చేసుకొని అక్కడున్న అభ్యుదయ, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నింటినీ విచ్ఛన్నం చేయటానికి బిజెపి ప్రయత్నిస్తుందన్నారు.ఈ నేపధ్యంలోనే సిపిఎం జాతీయ కార్యాలయంపైనా దాడి జరిగిందని,...

        సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా శ్రీకాకుళం నగరంలో సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డేఅండ్‌నైట్‌ కూడలి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య మాట్లాడుతూ సిపిఎం కేంద్రం కార్యాలయంపై దాడులను సహించేది లేదన్నారు. భవిష్యత్తులో మతోన్మాద శక్తులకు ప్రజలే ఘోరి కడతారని హెచ్చరించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటాన్ని ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. మతోన్మాద మత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాలు దాడి చేయడం హేయనీయమన్నారు. జెఎన్‌టియులో విద్యార్థులకు సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి...

Pages