District News

సిపియం కేంద్ర కార్యాలయంపై ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దుండగల దాడిని సిపియం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఘటనను ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదులు, మేధావులు ఖండించాలని  కోరుతున్నాం.

                నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంకోసం, దేశసమగ్రాభివృద్ధికోసం, మతసామరస్యం కోసం పోరాటం చేస్తున్న సిపియం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడిచేయడమంటే దేశంలో మతోన్మాద శక్తులు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో అర్ధమౌతుంది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మతసామరస్యం రోజురోజుకి దిగజారుపోతుంది. దేశవ్యాప్తంగా రచయితలు, అభ్యుదయవాదులపై ఆర్‌ఎస్‌ఎస్‌ దాడు చేసి హత్యలకు ప్పాడుతున్నా ప్రధాన మంత్రి స్పందించడంలేదు అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో కీలుబొమ్మలా కేంద్ర...

సింగ‌పూర్‌కు దాసోహమంటే స‌హించం.....వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌పై అవ‌గాహ‌న లేని మంత్రులు. 
మాస్ట‌ర్‌ప్లాన్‌లో స‌మూన మార్పులు చేయ‌క‌పోతే ఐక్య ఉద్య‌మాలు.
ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిని రాజ‌ధాని వ్య‌తిరేకులా చూడ‌టం  త‌గ‌దు.

    వ్యవసాయ పరిరక్షణ జోన్ అంశంపై మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు.  రైతుల‌, ప్రజా  ప్రయోజనాల‌ను రక్షించాల్సిన ప్ర‌భుత్వం అబ‌ద్దాలు చెబుతూ న‌య‌వంచ‌న చేస్తోంది.  అగ్రిజోన్‌కు, గ్రీన్‌బెట్లుకు సంబంధం లేదని మంత్రులు చేస్తున్న ప్రచారారం వాస్త‌వం కాదు.  గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న నిబంధనలే వ్యవసాయ పరిరక్షణ జోన్‌లో ఉన్నాయి. వాస్తవాల‌ను మరుగపర్చేందుకే మాస్టర్‌ప్లాన్‌...

సుంద‌ర‌య్య కాల‌నీ పార్టీ శాఖ కార్య‌ద‌ర్శి కామిశెట్టి ఆంజినేయులు,భ‌వ‌న నిర్మాణ కార్మికుడు ఎ స‌తీష్‌ల పై హత్యాయ‌త్నం చేసిన రౌడి మేక‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, సుంద‌ర‌య్య కాల‌నీ పేద‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సిపియం రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ‌స‌భ్యులు వి.ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. హాస్పిట‌ల్ చికిత్స పొందుతున్న ఆంజినేయులు, స‌తీష్‌ల‌ను ప‌రామ‌ర్శించారు. రౌడిల‌పై ముందుగా పొలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన స్థానిక సిఐ స్పందించ‌క పోగా దెబ్బ‌లు త‌గిల‌న త‌రువాత రాండి అన‌టం, కాల‌నీకి వెళ్ళి సిపియం నాయ‌కుల‌ను ఆఫీసు నుండి వెళ్ళి పోమ్మ‌ని చెప్ప‌టం చూస్తే రౌడి మూక‌ల‌కు అండ‌గా నిల‌బ‌డిన‌ట్లు ఆర్ధమ‌వుతున్న‌ద‌ని సిఐ తిరుపై మండిప‌డ్డారు. త‌క్ష‌ణ‌మే సిఐ మీద...

వ్యవసాయ పరిరక్షణ జోన్ల ఆంక్షలపై వస్తున్న ప్రజా నిరసనలను మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని రాజధాని ప్రాంత సిపిఎం కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు విమర్శిం చారు. రైతుల, రాజధాని ప్రాంత ప్రజల ప్రయోజ నాలను రక్షించాలని చిత్తశుద్ధి ఉంటే నిజాలు చెప్పి మాస్టర్‌ప్లాన్‌ను సమూలంగా మార్చాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పరిరక్షణ జోన్ల విషయం మంత్రులకే తెలియదని ఎద్దేవా చేశారు. వాస్తవాలను మరుగు పర్చేందుకే అవగాహన సదస్సులు నిర్వహించడం లేదని విమర్శించారు. వ్యవసాయ పరిరక్షణ జోన్లతో సహా ఈనెల 25లోగా మాస్టర్‌ప్లాన్‌ మార్చాలని, లేకుంటే రైతాంగం సహా అన్ని సంఘాలు చేసే ఆందోళనలకు తాము కూడా మద్దతు ఇస్తామని తెలిపారు. 

జూన్‌ లోగా నిర్మాణం పూర్తి చేయాలనుకున్న తాత్కాలిక సచివాలయంపై గందరగోళం నెలకొంటోంది. రోజుకో గ్రామం, పూటకో స్థలంతో ప్రభుత్వం ఈ పరిస్థితిని సృష్టిస్తోంది . అసలు నిర్దిష్ట సమయం లోగా సచివాలయం పూర్తవుతురదా? అనే అనుమా నాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి కేటాయిరచాల్సిన స్థలాన్ని రెట్టిరపు చేస్తూ ప్రభుత్వం తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మురదుగా 20 ఎకరాల్లో సచివాలయాన్ని నిర్మిరచాలని నిర్ణయిరచారు. వెలగపూడిలో ఇప్పుడు ఏకంగా ఆ విస్తీర్ణాన్ని 45 ఎకరాల వరకు పెరచుతూ ఉత్తర్వులిచ్చారు. ముందు 20 ఎకరాలని, పబ్లిక్‌ సౌకర్యాల పేరిట దీన్ని 45 ఎకరాలకు పెంచడం ప్రశ్నార్థకమవుతోంది. 

           ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చేపడుతున్న అభివృద్ధి పనులపై అలసత్వం వహించవద్దని కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. గురువారం టెక్క‌లి మండలంలోని శ్యామసుందరాపురంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న రోడ్లు, కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన మహిళ కలెక్టర్‌తో మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సక్రమంగా సరుకులు పంపిణీ కావడం లేదని ఫిర్యాదుచేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ జన్మభూమి కమిటీలకు అప్పగించామని, వారినే అడగాలని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వై రవీంద్రకుమార్‌, ఎంపిపి మట్ట సుందరమ్మ, సర్పంచ్‌ బెహరా కృష్ణవేణి పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహిస్తోందని, వాటిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. గురువారం నిమ్మాడలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫార పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ చదువు కోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుందన్నారు. ఉపాధ్యాయులు భాధ్యతాయతంగా మెలిగి విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తర్ర రామకృష్ణ, ఎంఇఒ నక్క రామకృష్ణ పాల్గొన్నారు.

         ఎన్నికల హామీలను నెర వేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసిపి జిల్లా అధ్యక్షులు రెడ్డి శాంతి విమర్శించారు. గురువారం కంచిలి మండలంలోని గొల్లకంచిలిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 71 వేలు ఫిర్యాదులొస్తే 90 మాత్రమే పరిష్కరించారని దుయ్యబట్టారు. ఉద్యోగాలిప్పి స్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో వైసిపి ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, కృష్ణారావు, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

వంశధార రిజర్వాయర్‌లో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం, ప్యాకేజీ అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారానికి 23వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి నిర్వాసితులు ఐక్యంగా పోరాడాలన్నారు. నిర్వాసిత గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతకు యూత్‌ ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడుతోందని, ఒక్కో నిర్వాసితునికి ఒక్కో ప్యాకేజీ అమలు చేయడం సరికాదని సూచించారు...

నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే సిపిఎం నాయకులపై దాడులు చేయటం హేయమైన చర్యని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ అన్నారు. మంగళవారం గుంటూరు సుందరయ్య కాలనీకి చెందిన రౌడీషీటర్లు, మాజీ నేరస్తులైన బాజీ, కోటేశ్వరరావులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బస్టాండ్‌ సెంటరులో రౌడీషీటర్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ 2007లో సిపిఎం నాయకుల కృషితో సుందరయ్య కాలనీ ఏర్పడిందని, అప్పటి నుంచి పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించుకోవాలని చూస్తున్న బాజీ, కోటేశ్వరరావు అనే రౌడీషీటర్లు ప్రయత్నిస్తుండటంతో వారిని అడ్డుకునేందుకు సిపిఎం కార్యదర్శి కె.ఆంజనేయులు పార్టీ సహకారంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అతనిపై అమానుషంగా హత్యాయత్యానికి పాల్పడిన రౌడీషీటర్లను వెంటనే...

Pages