District News

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భూ దాహం ఎక్కువైందని భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ దడాల.సుబ్బారావు అన్నారు. వంశధార నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన బ్యారేజీ సెంటర్‌లో నిర్వాసితులు చేపడుతున్న దీక్షలు 15 రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు బుధవారం సంఘీభావం తెలిపిన అనంతరం సుబ్బారావు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని కార్పొరేట్‌, విదేశీ సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో భూ బ్యాంక్‌ పేరుతో 15 లక్షల ఎకరాలను తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. రైతులు, కూలీల పొట్ట కొట్టే భూ బ్యాంక్‌ను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పగటి...

కొవ్వాడ అణుపార్కును ఏర్పాటు చేస్తూ ఉత్తరాంధ్రను వినాశనం చేస్తారా అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. కొవ్వాడ అణుపార్కును వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యాన 102 మంది కార్మికులు మంగళవారం రక్తదానం చేశారు. మండలంలోని అరిణాం అక్కివలసలో శ్యామ్‌పిస్టన్స్‌ ప్లాంట్‌-3 పరిశ్రమ వద్ద చేపట్టిన ఈ రక్తదాన శిబిరాన్ని నర్సింగరావు ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న దేశాల్లో నిషేధిస్తున్న ఇలాంటి పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, ప్రజలకు భద్రత లేని, అవసరాలు తీర్చని పరిశ్రమలను వద్దం టున్నామని స్పష్టం చేశారు. తమ హక్కుల కోసమే కాకుండా సామాజిక బాధ్యతనూ...

             భీమిలి మండలం చిప్పాడ దివీస్‌ ఔషద్‌ కంపెనీకి అనుబంధంగా కంచేరుపాలెంలో యూనిట్‌ 3 పేరుతో చేపట్టనున్న విస్తరణ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. అర్హులైన స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కాలుష్యాన్ని నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు సోమవారం స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. 
ఈ సందర్భంగా సిపిఎం డివిజన్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ వనరులన్నింటిని వినియోగించుకుని 2001లో ఔషదపరిశ్రమ నెలకొల్పిన దివీస్‌, స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. దీనినుంచి వెలువడుతున్న కాలుష్య...

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత సంఘం ఆధ్వర్యాన ముంపు గ్రామాల్లో జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. 18 ఏళ్ళల నిండిన నిర్వాసిత యువతీ యువకులకు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలన్నారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని కోరారు. బాధితుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే రూ.5లక్షలు అదనంగా చెల్లించాలన్నారు.

రాజకీయ ప్రయోజనం కోసమే వైసిపి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముందస్తు పథకంతోనే తూర్పుగోదావరి జిల్లా తునిలో భయానక వాతావరణాన్ని సృష్టించారని సిఎం చంద్రబాబు విమర్శించారు. అనుకోకుండా జరిగిన ఘటన మాత్రం కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తునిలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రజలు ఆలోచించి, చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ ఘటనతో కాపులకు ఎంతమాత్రం సంబంధం లేదని, కొన్ని విద్రోహశక్తులే ఇందుకు కారణమని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం చేపట్టిన కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిసిలుగా గుర్తించే వరకూ చావోరేవో తేల్చుకుందామంటూ ముద్రగడ పిలుపునిచ్చారు. పావుగంట కూడా ప్రసంగించకుండానే ఆయన అనూహ్యంగా రైలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. దీంతో లక్షలాదిగా వచ్చిన ఆందోళనకారులు కొంతమంది రైలు పట్టాలపై బైఠాయించారు. మరికొందరు ముద్రగడతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లో14 రైలు బోగీలకు నిప్పంటించారు. 8 పోలీసు జీపులను తగులబెట్టారు. తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించారు. ఆందోళనకారుల రాళ్లదాడిలో ఒక కానిస్టేబుల్‌ మృతి చెందాడు.

వచ్చే వార్షిక బడ్జెట్‌లో వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహిగా మిగిలిపోతారని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సీమ సమగ్రాభివృద్ధికి చంద్రబాబే ఆటంకమని విమర్శించారు. మదనపల్లి బిటి కళాశాల ఆవరణలో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సుకు ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. సీమ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు ఆలోచనలు, ప్రభుత్వ విధానాలే ప్రధాన ఆటంకంగా ఉన్నాయన్నారు. హంద్రీనీవా కాల్వ గట్లుపై...

కాకినాడ ; కార్మికులు ఆందోళన ఉధృతం చేయడంతో పోర్టు యాజమాన్యం దిగొచ్చింది. ఆల్‌బెస్ట్‌ కార్మికులకు నష్టపరిహారం అందించేం దుకు రాతపూర్వక ఒప్పందం చేసుకుంది. 20 రోజులుగా కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు ఆల్‌బెస్ట్‌ కంపెనీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ పోర్టు యాజమాన్యం స్పందించలేదు. దీంతో శుక్రవారం వారు ఆందోళనను ఉధృతం చేశారు. వివిధ కంపెనీల కార్మికులు విధులను బహిష్కరించి వీరికి అండగా నిలిచారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సమక్షంలో రాతపూర్వక ఒప్పందం జరిగింది. రెండున్నరేళ్లు పైబడిన సీనియర్‌ కార్మికులకు మూడు నెలల జీతాన్ని నష్టపరిహారంగా చెల్లించడానికి, మిగిలిన వారికి రెండున్నర నెలల జీతం...

ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లోని జిల్లా కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో రూపొందించిన 'పాలకుల విధానాలకు అన్నదాతలు బలి' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారం చేపట్టిన 18 నెలల కాలంలో జిల్లాలో 162 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నూతన సంవత్సరం జనవరి మాసంలో 25 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, సంక్రాంతి పండుగ నుంచి 16 మంది రైతులు బలవన్మరాలకు పాల్పడ్డారని తెలిపారు. రోజు రోజుకూ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వాటిని...

సాలూరు మండలంలో గ్రానైట్‌ తవ్వకాలకు లీజు అనుమతులు ఇవ్వొద్దని తామరకొండ, పోలిమెట్టకొండ, దుక్కడమెట్ట పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండు చేశారు. గురువారం ఆ కమిటీ కన్వీనర్‌, గిరిజన సంఘం, నాయకులు ఎం.శ్రీనివాసరావు అధ్వర్యాన రామస్వామిడ వలస, వల్లాపురం, సీతందొరవలస గ్రామాలకు చెందిన గిరిజనులు తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో రిలే నిరహార దీక్షలు ప్రారంభిం చారు. దీక్షలనుద్దేశించి భూ హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్‌ గేదెల సత్యనారాయణ మాట్లాడారు. తామరకొండ, పోలిమెట్టకొండ, దుక్కడమెట్ట ప్రాంతాల్లో గ్రానైట్‌ తవ్వకాల కోసం ప్రధానరాజకీయ పార్టీల అండతో కొంతమంది కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారన్నారు. ఇక్కడ గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులిస్తే చుట్టూ వున్న గిరిజన రైతులు...

Pages