ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ హాయాంలో విడుదలచేసిన జి.వో.నెం.289ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, ఎపిఎండిసికి 1212 హెక్టార్లు బాక్సైట్ తవ్వకాల అనుమతులకు సంబంధించిన జి.వో.నెం.97 రద్దుకు సమాదానం చెప్పకుండా దాటివేశారు. దీనిని సిపియం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గిరిజనుల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్తామన్న చంద్రబాబు గిరిజన సలహా మండలి ఏర్పాటుపై పెదవి విప్పలేదు. దీనిని బట్టి బాక్సైట్ తవ్వకాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కపటనాటకాలాడుతుందని అర్ధమౌతుంది.
చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా తన హాయంలో విడుదల చేసిన జి.వో.నెం.97ను, అన్‌రాక్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను...