రాజధాని నిర్మాణానికి ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల నుంచి తలో రూ.10 చొప్పున వసూలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. 'నా రాజధాని నా అమరావతి నా ఇటుక' కార్యక్రమంలో భాగంగా ఈ వసూళ్లు చేయాలంది. ఈనెల 10లోగా ఈ వసూళ్లు పూర్తి చేసి, ముఖ్యమంత్రికి అందజేయాలని మోమోలో పేర్కొన్నారు.
District News
హక్కుల రక్షణకు జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటుచేయాలని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ జాతీయ కన్వీనర్ వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 'మారుతున్న రాజకీయ నేపథ్యంలో దళితులు, గిరిజనులు కర్తవ్యం' అనే అంశంపై సోమవారం ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ పదవుల్లో ఉన్న ఎంతటి వారైనా శిక్షలు పడితేనే వివక్ష అంతమవుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రిజర్వేషన్లు నిర్వీర్యం అవుతున్నాయని, ఈ తరగతులకు ఉన్న హక్కులు పోతున్న తరుణంలో కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు
కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన అనవసరపు భూసేకరణకు వ్యతిరేకంగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యాన 25 కిలో మీటర్ల పాదయాత్ర జరిగింది.రైతులకు ఇష్టం లేకుండా విజయవాడ మెట్రో రైల్ కోచ్ డిపోను నిడమానూరులో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఏలూరు కాలువ మళ్లింపు ప్రతి పాదననూ విరమించుకోవాలి. తుళ్లూరు రైతుల కంటతడి ఆరకముందే నిడమానూరు, గన్నవరాల్లో బలవంతంగా భూములు గుంజుకోవడానికి ప్రయత్నించడం శోచనీయం. బలవంతపు భూ సేకరణను నిలిపివేయాలి. రైతులు తిరుగు బాటు చేస్తేనే ప్రభుత్వ బలవంతపు భూసేకరణకు అడ్డుకట్ట పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పిలుపు నిచ్చారు.
ఈ రోజు (29-12-15) రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపియం నక్కపల్లి డివిజన్ కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరిట వేగవంతంగా అమలు చేస్తుందని, రాష్ర్టంలోని 8 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రతులను క్లినికల్ ఎటాచ్ మెంట్ పేరిట ప్రైవేట్ కాలేజీలకు కట్టబెడుతుందన్నారు. ల్యాబ్ టెస్ట్ లను ప్రైవేట్ కార్పోరేట్ సంస్థలకు అప్పగించడానికి జి.వో.నెం. 633 ను విడుదల చేసిందని, మెడాల్ సంస్థతో ఒప్పందం చేసుకుందన్నారు...
గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలతో సహా విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీటి సమస్యలతో పాటు ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా కాంట్రాక్టర్లను సంతృప్తి పర్చేందుకు, గొప్పల కోసం అరకు ఉత్సవాలను నిర్వహించడం సరికాదని సిపిఎం తప్పుపట్టింది. ఉత్సవాల నిర్వహణపై ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న గిరిజన ప్రజలు, నాయకులను పోలీసులు విచక్షణ రహితంగా ఈడ్చివేస్తూ అరెస్టు చేయ టాన్ని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు తీవ్రంగా ఖండించారు..
దళితులపై నేటికీ జరుగుతున్న దాడులకు మను ధర్మశాస్త్ర భావజాలమే కారణమని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ యుటిఎఫ్ భవన్‌లో జన చైతన్యమండలి ఆధ్వర్యాన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయితాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన 88వ మనుస్మృతి దహన దినోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దడాల మాట్లాడుతూ కులవ్యవస్థపై అంబేద్కర్ ఎనలేని పోరు చేశారన్నారు. దళితులతోపాటు, దేశంలో మహిళలకు స్వాతంత్య్రాన్ని నిరాకరించిన మను ధర్మశాస్త్రానికి విరుగుడుగా భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. నేటి ప్రభుత్వాలు ఆయన లక్ష్యాన్ని విస్మరిస్తున్నా యన్నారు.
విశాఖ ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో గిరిజనులు, సిపిఎం, వివిధ ప్రజాసంఘాల నిరసనల మధ్య అరకు ఉత్సవ్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. బాక్సైట్ జిఒ 97, స్థానికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఉత్సవాలు చేపట్టడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల మనుగడకు ముప్పు కలిగించే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయాలని, హుదూద్ తుపాన్‌లో నష్టపోయిన రైతులకు, గిరిజనులకు, కూలీలకు పరిహారం చెల్లించాలని, స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అరకులోయ మ్యూజియం వద్ద నిరసన తెలుపుతుండగా తొమ్మిది మంది సిపిఎం, గిరిజన సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సమస్యలను పరిష్కరించిన...
ఎపి సర్కార్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా రైతాంగంపై రుణభారం పెరిగిందన్నారు. వ్యవసాయరంగంలో రుణభారం పెరిగిపోయిందని చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు , ప్రకాశం జిల్లాల్లో దారుణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవస్థాగత రుణాలను రైతులను ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ తిరుపతిలో అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. సమ్మెలో పాల్గొన్న అంన్ వాడీలను తొలగిస్తూ... ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. జీవోకు వ్యతిరేకంగా తిరుపతి కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేసిన అంగన్‌వాడీల తొలగించాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేయడం అన్యాయమని అంటున్నారు.
ఈ రోజు సిపియం ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లడుతున్న జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.రమేష్ పాల్గొన్నారు.....
- 2000 సంవత్సరంలో టిఎసిలో బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా తీర్మానం చేసినది తెలుగుదేశం ప్రభుత్వం కాదా?
- 1997లో దుబాల్ కంపెనీతో ఒప్పందాలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా?
- కాంగ్రెస్ అధికారంలో వుండగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు బాక్సైట్ తవ్వకాలు రద్దు చేయాలని కోరినా ఎందుకు రద్దు చేయలేదు?
- ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడంలేదు?
- 2007-08లో రస్ఆల్-ఖైమాతో జరిగిన ఒప్పాంలు తప్పులతడకని కాగ్ నివేదికపై తెలుగుదేశం ప్రభుత్వం...