
దళితులపై నేటికీ జరుగుతున్న దాడులకు మను ధర్మశాస్త్ర భావజాలమే కారణమని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ యుటిఎఫ్ భవన్‌లో జన చైతన్యమండలి ఆధ్వర్యాన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయితాబత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన 88వ మనుస్మృతి దహన దినోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దడాల మాట్లాడుతూ కులవ్యవస్థపై అంబేద్కర్ ఎనలేని పోరు చేశారన్నారు. దళితులతోపాటు, దేశంలో మహిళలకు స్వాతంత్య్రాన్ని నిరాకరించిన మను ధర్మశాస్త్రానికి విరుగుడుగా భారత రాజ్యాంగాన్ని రచించారన్నారు. నేటి ప్రభుత్వాలు ఆయన లక్ష్యాన్ని విస్మరిస్తున్నా యన్నారు.