ఈ రోజు (29-12-15) రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపియం నక్కపల్లి డివిజన్ కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో ప్రైవేటీకరణ విధానాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ పేరిట వేగవంతంగా అమలు చేస్తుందని, రాష్ర్టంలోని 8 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రతులను క్లినికల్ ఎటాచ్ మెంట్ పేరిట ప్రైవేట్ కాలేజీలకు కట్టబెడుతుందన్నారు. ల్యాబ్ టెస్ట్ లను ప్రైవేట్ కార్పోరేట్ సంస్థలకు అప్పగించడానికి జి.వో.నెం. 633 ను విడుదల చేసిందని, మెడాల్ సంస్థతో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో, ల్యాబ్ లలో పనిచేస్తున్న ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు మప్పువాటిల్లడమే కాక పేద ప్రజలకు వైద్య సౌకర్యాలు దూరమవుతాయన్నారు.ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐక్య ఆందోళనలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు ఎం.సత్తిబాబు, పి.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.....