ప్రజాస్వామ్యంపై దాడే

        సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా శ్రీకాకుళం నగరంలో సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. నగరంలోని డేఅండ్‌నైట్‌ కూడలి నుంచి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జమలయ్య మాట్లాడుతూ సిపిఎం కేంద్రం కార్యాలయంపై దాడులను సహించేది లేదన్నారు. భవిష్యత్తులో మతోన్మాద శక్తులకు ప్రజలే ఘోరి కడతారని హెచ్చరించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడటాన్ని ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. మతోన్మాద మత్తులో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎబివిపి గూండాలు దాడి చేయడం హేయనీయమన్నారు. జెఎన్‌టియులో విద్యార్థులకు సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి అండగా నిలవడాన్ని సహించలేక కాషాయిమూకలు దాడులకు పాల్పడ్డాయని విమర్శించారు. ఈ ర్యాలీలో సిపిఎం జిల్లా నాయకులు విజికె మూర్తి, కె.మోహనరావు, టి.తిరుపతిరావు, డి.గణేష్‌, చలపతిరావు, ఎల్లమ్మ, ఢిల్లేశ్వరరావు, బి.శ్రీను, బద్రి, జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్‌ : ఆర్‌టిసి కాంప్లెక్సు సమీపంలో సిపిఎం నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దావాల రమణారావు, నాయకులు గంగరాపు ఈశ్వరమ్మ, పి.ప్రభాకర్‌, పద్మ, ఎ.లక్ష్మణరావు పాల్గొన్నారు.
రణస్థలం : మండలంలోని పైడిభీమవరంలో సిపిఎం ఆధ్వర్యాన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్‌ అమ్మన్నాయుడు, డి.రాము, ఎం.సూర్యారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.