District News

తాత్కాలిక సచివాల‌య నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శుక్ర‌వారం పరిశీలించనున్న నేపథ్యలో ముందస్తుగానే సిపిఎం రాజధాని ప్రాంత నాయకు లు ఎం.రవి, జె.నవీన్‌ప్రకాష్‌ల‌ను అరెస్టు చేసి, నిర్భందించడాన్ని నిరసిస్తూ  విజ‌య‌వాడ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో లెనిన్‌ సెంటర్‌లోని సి.ఆర్‌.డి.ఏ కార్యాయం వద్ద ధర్నా చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకుల‌ను వెంటనే విడుద చేయాల‌ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా  సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి ప్రజారాజధాని నిర్మిస్తామని చెబుతూనే ప్రజపై నిర్భంధ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.    ఎటువంటి నిరసనకు దిగకపోయినా ముందస్తుగానే సిపిఎం నేతల‌ను అరెస్టు చేసి నిర్భందించడం...

స్మార్ట్‌సిటీ వలన కలిగే ప్రయోజనాలకు ప్రతి ఫలంగా జివిఎంసి ఆస్ధిపన్నుపై 10 శాతం అదనంగా స్మార్ట్‌సిటీ ఫీజు వసూలు  చేయాలని నిర్ణయించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ప్రతిపాదను నగర టాక్స్‌ పేయర్స్‌కు తీవ్ర హాని చేస్తుందని సిపిఐ(ఎం) అభిప్రాయపడుతున్నది. స్మార్ట్‌సిటీలో అనేక ప్రాజెక్టులను పిపిపి పేర అధికార పార్టీ నాయకులు బినామీ సంస్థలకు ధారాదత్తం చేయుటకు పలు  ప్రతిపాదనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ స్కీము క్రింద మంజూరయ్యే నిధులన్నీంటిని స్మార్ట్‌ ఏరియా ప్రాంతమైన ఆర్‌.కె బీచ్‌ ఏరియాకి మల్లించే ప్రతిపాదను చేశారు. ఈ నిర్ణయాలు అత్యంత వివక్షతతోను, బాధ్యతా రహితంగా ఉన్నాయి. స్మార్ట్‌సిటి...

    ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కు సంఘం రాష్ట్ర మహాసభలు  మార్చి 27వ తేదీన విశాఖనగరంలో జరుగుతుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం - పౌరహక్కులు  అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్‌ జరుగుతుంది. ఈ సెమినార్‌ను జయప్రదం చేయాలని ఈ రోజు (24-03-2016) పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణలో విశాఖ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు  కె.ఎస్‌. సురేష్‌ కుమార్‌, ఐలూ నాయకులు ఎన్‌. హరినాధ్‌, ఎ.కె.ఎన్‌ మల్లేష్‌, ఐ.ఎ.ఎల్‌ నాయకులు వెంకటేశ్వరరావు, సాయికుమార్‌ లు  పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వారు ప్రసంగించారు.
    భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాధమిక హక్కులను కాపాడవలసిన భాద్యత ప్రభుత్వాలపై ఉన్నది. కాని ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరహక్కులను కాపాడటంలో...

       విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని చెబుతున్న చంద్రబాబు, దానికి సంబంధించిన జిఒ 97ను రద్దు చేయకుండా కపట నాటకం ఆడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18న జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో బాక్సైట్‌కి సంబంధించి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలం నాటి, కాలం చెల్లిన 222, 289 జిఒలను రద్దు చేసి గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం మరోసారి గిరిజనులను మోసం చేస్తోందని, నిజంగా చిత్తశుద్ధి, గిరిజనుల మనోభావాల మీద గౌరవం వుంటే జర్రెల బ్లాక్‌లో 1212 హెక్టార్ల బాక్సైట్‌ తవ్వకాలకు ఎపిఎండిసికి లీజుకిస్తూ 2015 నవంబర్‌ 5న విడుదల...

           సబ్బవరం మండలం, వంగలి రెవెన్యూ పరిధిలోని అసైన్డ్‌ భూముల్లో బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం హెచ్చరించారు. బలవంతపు భూసేకరణను నిరసిస్తూ, రీసర్వే నిర్వహించాలని కోరుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన వంగలి గ్రామ రైతులు తహశీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. వారికి మద్దతు తెలియజేసిన లోకనాథం మాట్లాడుతూ వంగలి ప్రాంతంలో అసైన్డ్‌ భూములపై ప్రభుత్వం కన్నుపడిందని, అర్బన్‌ అగ్లమిరేషన్‌ పేరుతో పట్టాలు ఇవ్వకుండా బలవంతంగా భూములు సేకరణ చేసి, రైతులను భూముల నుండి వెళ్ళగొట్టాడానికి రంగం సిద్ధం చేస్తున్నారని, తెలిపారు. మోసాల సర్వేతో భూములను లాక్కొవడం...

రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజధాని నగరంలో రెండు మూడు రోజులపాటు పరిపాలనను స్తంభింపజేస్తామని వామపక్షాల నాయకులు హెచ్చరించారు. కార్పొరేట్‌ కంపెనీలు, విదేశీ సంస్థలకు వేలాది ఎకరాల భూములను కేటాయించే ప్రభుత్వం, పేద వాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించా రు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, కొండ ప్రాంత వాసులకు పట్టాలు ఇవ్వాలని, ఆక్రమిత ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నాయకులు డిమాండు చేశారు..పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు  వేలాది...

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల స్వాధీనానికి అసెంబ్లీలో తీర్మానం చేయా లని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూ రావు డిమాండ్‌ రూ.1200 కోట్ల విలువ చేసే హారు ల్యాండ్‌, కీసరలోని 200 ఎకరాల భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాల న్నారు. బాధితుల కోసం తక్షణమే రూ.2 వేల కోట్లతో ప్రభుత్వమే నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రిగోల్డ్‌ సంస్థకు ప్రభుత్వం అమ్ముడుపోయిందని, అందుకే ఏడాది పాటు కేసును తాత్సారం చేసిందని విమర్శించారు. డిజిపి జెవి రాముడు కూడా నిందితులకు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. పరారీలో ఉన్న నింది తులను తక్షణమే అరెస్టు చేసి, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బాబూరావు డిమాండ్‌ చేశారు.

ఇళ్ళపట్టాలు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని మచిలీపట్న‌ ంలొ మున్సిపల్ కార్యాలయం వద్ద దర్నాలో మట్లాడుతున్న సి.పి. యం. జిల్లాకార్యదర్మి ఆర్. రఘు, చౌటపల్లి రవి, కోడాలి.శర్మ

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన,వినాశ‌క‌ర‌మైన‌,ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించే  కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ర‌ద్దు చేయాల‌ని సిపియం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌మ్‌.కృష్ణ‌మూర్తి డిమాంఢ్ చేసారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంకు వ్య‌తిరేకంగా సిపియం ప్ర‌జాసంఘాల ఆద్వ‌ర్య‌ములో  కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్ర‌భావిత గ్రామాల‌లోప‌ర్య‌టించారు.సిపియం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు య‌మ్‌.కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ అణువిద్యుత్ కార్మాగారం అత్యంత ప్ర‌మాద‌క‌రమ‌ని అన్నారు.కొవ్వాడ అణుపార్కు జిఓల‌ను ర‌ద్దుచేయాల‌ని డిమాండ్ చేసారు. అణువిద్యుత్ కార్మాగారంలో లీకులు అత్యంత స‌హ‌జ‌మ‌ని అన్నారు.అణువిద్యుత్ యూనిట్ త‌యారికి 10 రూపాయిలు ఖ‌ర్చు అవుతుంద‌ని...

పేదలు ఐక్యంగా ఉండటం ద్వారా సంఘ విద్రోహ శక్తుల్ని ఐక్యంగా ఎదుర్కొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 9న రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన సుందరయ్య కాలనీ సిపిఎం నాయకుడు కె ఆంజనేయులు చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయిన సందర్బంగా గురువారం రాత్రి కాలనీలో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఆర్టీవో కార్యాలయం నుండి కాలనీకి ర్యాలీ నిర్వహించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఆంజనేయులుకు చికిత్స అందించి కోలుకునేట్లు చేయటంలో జిజిహెచ్‌ వైద్యుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు ఏపార్టీ అధికారంలో ఉంటే వారి పంచన చేరి పేదలకు అన్యాయం చేస్తున్నారని, అలాంటి వారు ఎవరైనా ప్రజా ఉద్యమాల్లో కొట్టుకుపోతారని హెచ్చరించారు. రౌడీలను...

Pages