పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి:మధు

రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజధాని నగరంలో రెండు మూడు రోజులపాటు పరిపాలనను స్తంభింపజేస్తామని వామపక్షాల నాయకులు హెచ్చరించారు. కార్పొరేట్‌ కంపెనీలు, విదేశీ సంస్థలకు వేలాది ఎకరాల భూములను కేటాయించే ప్రభుత్వం, పేద వాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించా రు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, కొండ ప్రాంత వాసులకు పట్టాలు ఇవ్వాలని, ఆక్రమిత ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నాయకులు డిమాండు చేశారు..పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు  వేలాది ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వం.. పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలకు మాత్రం భూమి కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం విస్మరించిందన్నారు. నాడు వైఎస్ పాలనలో, చంద్రబాబు పాలనలో ఇళ్ల సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. బ్యూటిఫికేషన్ పేరుతో ఇళ్లను తొలగిసున్నారని మండిపడ్డారు. కార్పొరేట్లకు కాదు.. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కావాలని కోరారు. పేదలు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.