District News

ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు  ఇవ్వాలని కోరుతూ జివిఎంసి కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బి. గంగారావు గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన క్రింద ఆన్‌లైన్‌ ద్వారా 1,84,424 మంది పేదలు  ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికి 80వేల మందికి సర్వే చేశారు. ఇందులో 64వేల మందికి ఆధార్‌, రేషన్‌ కార్డు సరిగ్గా లేవని చెప్పి తొలగించడం జరిగింది. అడ్రసు దొరకలేదని 40వేల వరకు తొలగించారు.  దీనీవల్ల అర్హులైనవారికి ఇళ్ళు వచ్చే అవకాశం సన్నగిల్లుతుంది. సర్వే కూడా సరిగ్గా చేయడం లేదు. సర్వేచేసిన వాటిని  కంపూటర్‌లో అప్‌లోడ్‌ చేయడంలేదు. నిష్ఫక్షపాతంగా ఎంక్వయిరీ జరపాని కోరుచున్నాం. ధరఖాస్తు చేసుకున్న...

 స్థ‌లాలు, ప‌ట్టాలు,  రిజిస్ట్రేష‌న్‌లు కోరుతూ మార్చి 22న జ‌రిగే ఛ‌లో విజ‌య‌వాడ కార్యక్ర‌మం జ‌య‌ప్రదం చేయాల‌ని సి.పి.ఎం-సిపిఐ సైకిల్ ర్యాలి

అంకితభావం, వృత్తి నైపుణ్యంతో జిజిహెచ్‌ వైద్యులు అద్భుత రీతిలో శస్త్రచికిత్సలతో చేసి, అరుదైన స్దితిలో వ్యక్తికి ప్రాణం పోయడం సర్వత్రా హర్షణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అభినందించారు. రౌడీషీటర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో జిజిహెచ్‌లో చేరిన సిపిఎం శాఖ కార్యదర్శి ఆంజనేయులు గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అత్యంత తీవ్రత కలిగిన ముఖంపై గాయాలతో మరణం అంచున నిలిచిన ఆంజనేయులుకు జిజిహెచ్‌లోని వివిధ విభాగాల వైద్య నిపుణులు శ్రమించి అరుదైన శస్త్రచికిత్సలు చేయడంతో ఆంజనేయులు బతికి బయటపడ్డారని పేర్కొంటూ సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు వైద్య నిపుణులకు ఘనసత్కారం చేశారు. ఆర్థోపెడిక్‌ సెమినార్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి...

- హెచ్‌ గేట్‌లో దారి మూసివేతకు నిరసనగా కార్మికుల ధర్నా
- మద్దతుగా నిలిచిన సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, ఎం.అప్పలరాజు
- దిగొచ్చిన యాజమాన్యం 
        నక్కపల్లి హెటిరో డ్రగ్స్‌ కంపెనీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ హెచ్‌ గేట్‌ వద్ద వాహనాలు రాకపోకలు సాగించే దారి మూసివేతను నిరసిస్తూ హెటిరో కార్మికులు విధులను బహిష్కరించి గేట్‌కు ఎదురుగా ధర్నా చేపట్టారు. ఇక్కడ ఉన్న దారిలో యథావిధిగా కార్మికుల వాహనాలు రాకపోకలు సాగించేందుకు మార్గంలో ఉంచాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం....

కొద్ది నెల్లో కృష్ణా పుష్కరాల‌ నేపథ్యంలో భవానీపురం కృష్ణా కరకట్ట వాసుల‌ను తొల‌గించే ఉద్దేశ్యంతో నగరపాల‌క సంస్థ అధికారులు బుధవారం హడావిడిగా ఇళ్ళ తొల‌గింపు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికు లు వారిని అడ్డగించి నోటీసులు తీసుకోం, మా ఇళ్లు తొల‌గించటానికి అంగీకరించమని పున్నమి హాోటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు సి.హెచ్‌. బాబూరావు సంఘటనా స్థలానికి చేరుకుని వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం స్థానికుల‌తో కలిసి కరకట్ట ప్రాంతంలో ప్రదర్శనగా బయలుదేరి స్వాతి సెంటర్‌కు చేరుకున్నారు. స్వాతి సెంటర్‌లో  రాస్తారోకో  నిర్వ‌హించారు.  స్థానికులు మాట్లాడుతూ, గత నాలుగు రోజుల‌ క్రిందట...

       
    ఈ రోజు పేదలకు ఇళ్ళు, ఇళ్ళస్థలాలు, ఇళ్ళ పట్టాలివ్వాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో విశాఖపట్నం అర్భన్‌ తహసీల్ధార్‌ కార్యాయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం మండల తహసీల్ధార్‌ గారికి  మెమోరాండం ఇవ్వడం జరిగింది.
    ఈ సందర్భంగా  సిపిఐ(ఎం) నగర కార్యదర్శి బి. గంగారావు గారు మాట్లాడుతూ జి.వో నెం 296 నిబంధనలను అధికారులు అతిక్రమిస్తున్నారని ధరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేది ఉన్న కంప్యూటర్‌లో ఆఫ్‌లోడ్‌ చేయడం లేదని, ఆన్‌లైన్‌లో ధరఖాస్తు స్వీకరించడం లేదని, విశాఖనగరంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అత్యధిక మందికి పట్టాలు  లేవు. ఫలితంగా పేదలు  తీవ్ర అభద్రతా...

           భూములను రక్షించుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. భూ సేకరణపై ప్రభుత్వం ముందడుగు వేస్తే రైతులకు అండగా నిలిచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఆర్‌టిసి కాంపెక్స్‌ వద్ద సోమవారం భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పిసిపిఐఆర్‌ కోసం ప్రభుత్వం వంద పంచాయతీల్లో లక్షా 30 వేల ఎకరాల భూమిని రైతుల వద్ద బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. నక్కపల్లి ఇండిస్టియల్‌ పార్కు పేరుతో భూసేకరణకు 2010లో నోటిఫికేషన్‌ ఇవ్వగా, దానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత రైతులు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో 2011లో...

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహనిర్మాణం కింద విశాఖనగరంలో పెందుర్తి ప్రాంతంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం చేపట్టింది. ఈరోజు సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి శ్రీ బి.గంగారావు నాయకత్వంలో  బృందం   పెందుర్తిలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది.  ఈ నిర్మాణా యొక్క భద్రత, ప్రమాణాలు , నాణ్యత, దాని కాలవ్యవధి తదితర అంశాపై అనేక అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై స్వతంత్ర ఇంజినీరింగ్‌ నిపుణుల  బృందంచే  విచారణ జరిపించి, బృందం దృష్టికొచ్చిన పలు  విషయాలపై విచారణ జరిపి వాస్తవాలు  వెల్లడిరచాలని  నగర కార్యదర్శి బి గంగరావు డిమాండ్‌ చేశారు.
    విశాఖనగరంలో హదూద్‌ తుపాను...

     విశాఖ నగర ఎంపి కె.హరిబాబుగారు నిన్న రైల్వేజోన్‌పై ప్రకటించిన కుట్రపూరిత ప్రకటనను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ రావటానికి చాలా అడ్డంకులు,సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించారు ఈ వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ(ఎం) గ్రేటర్‌ విశాఖనగర కమిటీ ఈరోజు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేసింది.
    ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగరకార్యదర్శి బి. గంగారావు ప్రసంగిచారు. మొన్నటిదాక అదిగోవస్తుంది, యిదిగో వస్తుందని ప్రకటను గుప్పించిన ఎంపి హరిబాబు చావుకబురు చల్లగా చేప్పినట్లు విశాఖకు రైల్వేజోన్‌ రాదని పరోక్షంగా వ్లెడిచారు. రైల్వేజోన్‌ పై వేసిన కమిటి విశాఖకు వ్యతిరేకంగా...

జిల్లాలోని పేదలు కూలి పనుల నిమిత్తం వలసలు పోతున్నారని, వాటిని అరికట్టేందుకు తక్షణమే ఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కరువు విలయతాండం చేస్తుందని, ఈ పరిస్ధితుల్లో కూలి పనులు లేకపోవడంతో వేలాది మంది ఇతర జిల్లాలకు వలసలు పోతున్నారని తెలిపారు. ఉపాధి హామీ నిధుల్లో 50శాతం సిసి రోడ్లకు ఖర్చు చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ నిధులతో చేపట్టే పనుల్లో యంత్రాలు ఉపయోగించ రాదనే నిబంధన ఉందని, కాని ఈ నిధులు సిసి రోడ్లకు ఖర్చు చేయడం నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధి పనుల్లో పాల్గొంటున్న కూలీలకు పనిముట్లు, టెంట్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలు...

Pages