ఇళ్ళ‌ను కూల్చే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి. నోటీసులిస్తే తీసుకోం! `స్వాతి సెంటర్‌లో భవానీపురం కృష్ణాకరకట్ట వాసుల రాస్తారోకో `మద్దుతు పలికిన సిపిఎం

కొద్ది నెల్లో కృష్ణా పుష్కరాల‌ నేపథ్యంలో భవానీపురం కృష్ణా కరకట్ట వాసుల‌ను తొల‌గించే ఉద్దేశ్యంతో నగరపాల‌క సంస్థ అధికారులు బుధవారం హడావిడిగా ఇళ్ళ తొల‌గింపు నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికు లు వారిని అడ్డగించి నోటీసులు తీసుకోం, మా ఇళ్లు తొల‌గించటానికి అంగీకరించమని పున్నమి హాోటల్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు సి.హెచ్‌. బాబూరావు సంఘటనా స్థలానికి చేరుకుని వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం స్థానికుల‌తో కలిసి కరకట్ట ప్రాంతంలో ప్రదర్శనగా బయలుదేరి స్వాతి సెంటర్‌కు చేరుకున్నారు. స్వాతి సెంటర్‌లో  రాస్తారోకో  నిర్వ‌హించారు.  స్థానికులు మాట్లాడుతూ, గత నాలుగు రోజుల‌ క్రిందట ఫ్లైఓవర్‌ పరిశీన కోసం వచ్చిన రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిసి ఇళ్ళ సమస్యపై వినతిపత్రం ఇవ్వగా మంత్రి ఉమా దీనిపై స్పందిస్తూ మీ ఇళ్లు తొల‌గించమని, ఎన్‌టిఆర్‌ ఇచ్చిన బి. ఫారం పట్టాల వారికి రిజిస్ట్రేషన్లు కూడా చేస్తామని చెప్పారని, ఇంతలోనే సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చేందుకు ఎందుకు రావాల్సి వచ్చిందని?  వారు మండిపడ్డారు.  బాబూరావు మాట్లాడుతూ, ఎన్నికల‌కు ముందు పట్టాలిస్తామని, రిజిస్ట్రేషన్లు చేస్తామని, వరద ప్రమాదం లేకుండా రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తామని వాగ్ధానం చేసి ఓట్లు వేయించుకున్నప్పుడు అడ్డుం లేని ఇళ్లు, ఇప్పుడు అడ్డమని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. కృష్ణానదికి అటువైపు ముఖ్యమంత్రి ఉండగా లేనిది, ఇటువైపు పేదలు ఉండకూడదా అని అన్నారు. నగరం రాజధానిగా రూపుదిద్దుకున్న తరుణంలో పేదల ఇళ్లు ఖాళీచేసి సుందరీకరణ పేరుతో  బడా పారిశ్రామికవేత్తకు హాోటళ్లు నిర్మించేందుకు ఈ స్థలాను అప్పగిస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఖాళీచేయమని, అండగా సిపిఎం, ఎర్రజెండా మీకు అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. నోటీసు ఇవ్వటానికి వచ్చేవారిని అందరూ కలిసికట్టుగా అడ్డుకోవాని ఆయన పిుపునిచ్చారు.