ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం ఫై ఇంజినీరింగ్‌ నిపుణుల బృందంచే విచారణ జరిపించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ గృహనిర్మాణం కింద విశాఖనగరంలో పెందుర్తి ప్రాంతంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్ల నిర్మానం చేపట్టింది. ఈరోజు సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి శ్రీ బి.గంగారావు నాయకత్వంలో  బృందం   పెందుర్తిలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది.  ఈ నిర్మాణా యొక్క భద్రత, ప్రమాణాలు , నాణ్యత, దాని కాలవ్యవధి తదితర అంశాపై అనేక అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై స్వతంత్ర ఇంజినీరింగ్‌ నిపుణుల  బృందంచే  విచారణ జరిపించి, బృందం దృష్టికొచ్చిన పలు  విషయాలపై విచారణ జరిపి వాస్తవాలు  వెల్లడిరచాలని  నగర కార్యదర్శి బి గంగరావు డిమాండ్‌ చేశారు.
    విశాఖనగరంలో హదూద్‌ తుపాను నేపథ్యంలో సుమారు 6వేల ఇళ్లు  ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టెక్నాలజీతో ఒక్కొ యూనిట్‌ వ్యయం రూ.4.80లక్షతో నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పెందుర్తి ప్రాంతంలో  374 ఇళ్ల నిర్మాణాలు  ప్రారంభించారు. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఐరన్‌  పిల్లర్స్‌, బీమ్సు వాటిపైన రేకులు  వేసి వాటిపై 8ఎంఎం ఐరన్‌  ఇనుపరాడ్లతో స్లాబ్లు వేస్తున్నారు. ఇవి  370చదరపు అడుగు వైశల్యంలో ఒకొక్క యూనిట్‌ను చేపడుతున్నారు.
    ఈ గృహాలు  పేదల  నివాస యోగ్యానికి అనువుగా ఉన్నట్లు కనిపించడం లేదు. వీటియొక్క నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి వినియోగిస్తున్న   ఇనుప పరికరాలు, సముద్రతీర ఉప్పుగాలు లకు తట్టుకుని నిబడగలవా? లేదా ? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. పైన రేకుతో వేస్తోన్న పలుచటి స్లాబ్‌ల వల్ల కింది వాళ్లకి తీవ్ర  అసౌకర్యం కలిగే అవకాశాలు  కనిపిస్తున్నాయి. శబ్దాలు, వేసవిలో వేడి, ఇతర పర్యావరణ సమస్యలు తలెత్తటానికి  అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తక్షణం విచారణ చేపట్టాలని పేదలకు నిర్మించేగృహాలపై ప్రయోగాలు తగదని సిపిఎం హెచ్చరిస్తోంది.  హుదూద్‌ తుఫాను వచ్చి ఏడాదిన్నర అవుతున్నా నేటికీ 6000 ఇళ్ల నిర్మాణాలు  ప్రభుత్వం చేపట్టకపోవడం రాష్ట్ర ప్రభుత్వం పేదల ఎడల వివక్షతను తెలియజేస్తోంది.
     ఈ బృందంలో ఎం. అప్పలరాజు .అనంతలక్ష్మి డి.అప్పలనాయుడు, బి టి మూర్తి, జి. సూర్య ప్రకాష్‌ మొదలగు నాయకులు  పాల్గున్నారు.