వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరుతూ జివిఎంసి కార్యాలయం ముట్టడి

ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు  ఇవ్వాలని కోరుతూ జివిఎంసి కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి బి. గంగారావు గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన క్రింద ఆన్‌లైన్‌ ద్వారా 1,84,424 మంది పేదలు  ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికి 80వేల మందికి సర్వే చేశారు. ఇందులో 64వేల మందికి ఆధార్‌, రేషన్‌ కార్డు సరిగ్గా లేవని చెప్పి తొలగించడం జరిగింది. అడ్రసు దొరకలేదని 40వేల వరకు తొలగించారు.  దీనీవల్ల అర్హులైనవారికి ఇళ్ళు వచ్చే అవకాశం సన్నగిల్లుతుంది. సర్వే కూడా సరిగ్గా చేయడం లేదు. సర్వేచేసిన వాటిని  కంపూటర్‌లో అప్‌లోడ్‌ చేయడంలేదు. నిష్ఫక్షపాతంగా ఎంక్వయిరీ జరపాని కోరుచున్నాం. ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిని ఎంక్వయిరీ జరిపి అర్హుందరికీ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
    సిపిఐ జిల్లా కార్యదర్శి ఎజె స్టాలిన్‌ గారు మాట్లాడుతూ విశాఖనగరంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అత్యధిక మందికి పట్టాలు  లేవు. ఫలితంగా పేదలు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు. తరుచూ దాడును ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 296 జివో విడుదల  చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ భూముల్లో 100 గజా స్థలంలో ఇళ్ళు నిర్మించుకున్న పేదల  ఇళ్ళకు పట్టాలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ధరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికే విశాఖనగరంలో 60వేల  మందిపైగా ఇళ్ళ పట్టాల  కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఈ ధరఖాస్తును ఎంక్వయిరీ చేస్తున్నారు. కొండ మీద, రోడ్లు, కాలువ ప్రక్క వున్న ఇళ్ళకు, చెరువు పోరంబోకు భూముకు, రైల్వే స్థలాల్లో ఉన్న ఇళ్ళకు, ఖరీదైన భూముల్లో ఉన్న ఇళ్ళకు పట్టాలివ్వకూడదని జివోలో  చెప్పారు. ఈ నిబంధను వల్లఎంక్వయిరీ జరిగినా ఎక్కువ మందికి పట్టాలు ఇచ్చే అవకాశం లేదు. దీని నిబంధను సవరించాలనిన్నారు. ఇంకా సిపిఐ నగర సమితి నాయకులు డి. మార్కాండేయు, ఎం. పైడిరాజు, జె.డి నాయుడు, సిపిఎం నగర కమిటీ నాయకులు బి. పద్మ, బి. ఈశ్వరమ్మ, ఎం. జగ్గునాయుడు మొదలగు నాయకులు ప్రసంగించారు.