పేదలందరికి ఇళ్ళు, ఇళ్ళస్థలాలు, ఇండ్ల పట్టాలివ్వాలి.తహసీల్ధార్‌ కార్యాయం వద్ద దార్న

       
    ఈ రోజు పేదలకు ఇళ్ళు, ఇళ్ళస్థలాలు, ఇళ్ళ పట్టాలివ్వాలని కోరుతూ వామపక్షపార్టీల ఆధ్వర్యంలో విశాఖపట్నం అర్భన్‌ తహసీల్ధార్‌ కార్యాయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం మండల తహసీల్ధార్‌ గారికి  మెమోరాండం ఇవ్వడం జరిగింది.
    ఈ సందర్భంగా  సిపిఐ(ఎం) నగర కార్యదర్శి బి. గంగారావు గారు మాట్లాడుతూ జి.వో నెం 296 నిబంధనలను అధికారులు అతిక్రమిస్తున్నారని ధరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేది ఉన్న కంప్యూటర్‌లో ఆఫ్‌లోడ్‌ చేయడం లేదని, ఆన్‌లైన్‌లో ధరఖాస్తు స్వీకరించడం లేదని, విశాఖనగరంలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు నిర్మించుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అత్యధిక మందికి పట్టాలు  లేవు. ఫలితంగా పేదలు  తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు. తరుచూ దాడును ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల  296 జివో విడుదల  చేసింది. ఈ జివో ప్రకారం వేల సంఖ్యలో పేదలు  ధరఖాస్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు రకరకా కారణాల తో పేదల  ఇండ్లను సర్వేచేయడం లేదు. దీనివల్ల వేలాది మంది పేదలు  నష్టపోతారు. సర్వే కూడా సరిగ్గా చేయడం లేదు. నిష్ఫక్షపాతంగా ఎంక్వయిరీ జరపాలని కోరుచున్నాం. ధరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిని ఎంక్వయిరీ జరిపి క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేసారు.
    సిపిఐ నగర కార్యదర్శి డి. మార్కాండేయులు గారు మాట్లాడుతూ ఇళ్ళ పట్టాలు  కోసం ధరఖాస్తు చేసుకున్న పేదలందరి ఇళ్ళకు పట్టాలివ్వాలి. కొండవాలు , చెరువు పోరంబోకు, రైల్వే, ఖరీదైన భూము తదితర నిబంధను తొలగించి పట్టాలివ్వాలని, ఇంటి స్థలం ఉండి, స్కీము ఇంటి నిర్మాణం కోసం ధరఖాస్తు చేసుకున్న వారందరికి సబ్సిడీ రుణం మంజూరు చేయాలి. రెండు సెంట్లు స్థలం  ఉందన్న నిబంధనలను తొలగించాలనిఅన్నారు.
    సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యురాలు బి.పద్మ గారు మాట్లాడుతూ ఇళ్ళకోసం ధరఖాస్తు చేసుకున్న లక్షా 85 వేల ధరఖాస్తులు ఎంక్వయిరీ చేయాలి. అర్హుందరికి ఇళ్ళ గుర్తింపు కార్డులివ్వాలి. ప్రతి కుటుంబానికి 100 గజాల  ఇంటి స్థలం  ఇవ్వాలి. జి+G1 పద్ధతిలోనే ఇళ్ళు నిర్మించాలి. లక్ష ఇళ్ళు ప్రభుత్వం మంజూరు చేయాలి. హుదూద్‌లో ఇళ్ళు కోల్పోయిన    ఇళ్ళు లేనివారికే హుదూద్‌ ఇళ్ళు ఇవ్వాని డిమాండ్‌ చేసారు.
    సిపిఐ నగర సహాయ కార్యదర్శి రాంబాబుగారు మాట్లాడుతూ ఎన్‌.టి.ఆర్‌, ఇందిరమ్మ ఇళ్ళ స్కీము క్రింద ఇళ్ళు నిర్మించుకున్న ఇళ్ళ రిపేర్లకు 50వేలు ఇవ్వాలి. ఎస్‌.సి, ఎస్‌.టి ఇళ్ళకు లక్షరూపాయు ఇవ్వాలనిన్నారు.
    సిపిఎం మద్దిపాలెం జోన్‌ కార్యదర్శి పి. మణి గారు మాట్లాడుతూ జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం, రాజీవ్‌ గృహకల్ప ఇళ్ళకు మౌలిక సదుపాయాలు  కల్పించాలి. బ్యాంకు రుణాలు రద్దు చేయాలి. నివాసం ఉండటంలేదనే సాకుతో ఇళ్ళను రద్దు చేయరాదన్నారు.