District News

   ప్రజా ఉద్యమం తప్పదు : సిపిఎం
        ప్రభుత్వం మొండిగా వ్యహరించి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొనేందుకు సిద్ధపడితే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం నక్కపల్లి డివిజన్‌ కన్వీనర్‌ ఎం.అప్పలరాజు హెచ్చరించారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు కోర్టును ఆశ్రయించారని, కోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం తన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సామాజిక ప్రభావ నివేదికను బహర్గతం చేయాలన్నారు. అవేమి లేకుండా ప్రభుత్వ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.         

              విశాఖ-చెన్నై ఇండిస్టియల్‌ కారిడార్‌ కోసం ప్రభుత్వం మొండిగా వ్యవహరించి రైతుల నుంచి...

'అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను అడుగుతున్నాం.. గన్నవరం ప్రాంతంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణను ఎందుకు అడ్డుకోవటం లేదో తేల్చి చెప్పాలి' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భూదాహన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం శాంతిథియేటర్‌ సెంటర్‌లో బుధవారం వామపక్షాల ఆధ్వర్యాన బహిరంగ సభ నిర్వహించారుగన్నవరం ప్రాంతంలో నిజమైన అభివృద్ధి ఎలా జరగాలో గతంలోనే పుచ్చలపల్లి సుందరయ్య చేసి చూపారని గుర్తు చేశారు. కేసరపల్లిలో ఐటి పార్కు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్నారు. రైతులకు నష్టం కలిగించే భూసేకరణకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాల్లోకి రావాలన్నారు. గన్నవరం ఎంఎల్‌ఎ రామవరప్పాడులో...

 అమరావతి.. అదొక ప్రాచీన నగరం. శాతవాహనుల కాలంలో అదే రాజధాని. బౌద్ధానికీ ఆ ప్రారతం నాడు కీలక స్థానం. అలాంటి అమరావతి నేడు రాష్ట్రానికి రాజధానిగా మారి, తన ఉనికినే కోల్పోయే పరిస్థితి నెలకొరది. చారిత్రక ప్రాముఖ్యం గల ఆ ప్రారతం ఆధునిక కట్టడాలు రానున్నాయి. గత వైభవం చరిత్రకే పరిమితం కానుంది. 
రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిరచారు. అందుకు జపాన్‌, చైనా, అమెరికా, బ్రిటన్‌, సిరగపూర్‌, మలేషియా వంటి దేశాల వారిని ఆహ్వానిరచి, అద్భుత, ఆధునిక నగరాన్ని నిర్మిరచాలని కోరారు. డిజైన్లు కూడా సిద్ధం చేయిరచారు. కానీ ఆ డిజైన్లలో అరతా విదేశీ పోకడలే కనిపిస్తున్నాయి. స్థానికత్వం, చరిత్ర జ్ఞాపికలు ఎక్కడా లేవని సర్వత్రా...

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో రెండ్రోజుల పాటు జరిగిన సిపిఎం జిల్లా ప్లీనం మంగళవారం ముగిసింది. రెండో రోజు సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత 14 నెలల్లో చేపట్టిన పోరాటాలను సమీక్షించుకుని, రాబోయే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యచరణను రూపొందించారు. రెండు రోజుల ప్లీనంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, తదితర ఎనిమిది అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాబోయే ఏడాది కాలంలో విద్యా, ఉపాధి, సామాజిక అంశాలపై దృష్టి సారించి పనిచేయాలని...

విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ త్వరలో రాయలసీమ బంద్‌ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండ పట్టణంలో బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ఆర్‌టిసి బస్టాండ్‌ నుంచి టవర్‌క్లాక్‌ సర్కిల్‌ వరకు ఎర్రజెండాలను చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గాలిమరల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని తెలిపారు. కంపెనీలు ఎకరా మూడున్నర లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయని చెప్పారు. రూ.3 కోట్ల విలువజేసే...

జూన్‌ 19న రాష్ట్రవ్యాప్త కార్మిక ఐక్య ర్యాలీ

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కార్మికులకు ఎటువంటి లబ్ధీ చేకూర్చలేదని, కార్మిక వ్యతిరేకతే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎంఎ గఫూర్‌ తెలిపారు. సోమవారం విశాఖలోని ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వసూళ్ల మంత్రిగా, యాజమాన్యాల తొత్తుగా ఉన్నారే తప్ప, కార్మిక సమస్యలపై ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని పేర్కొన్నారు. కార్మికులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిని అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వటం లేదని మండిపడ్డారు. యూనియన్లు వద్దంటూనే...

        చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీలో జరిగిన అవినీతి బాధ్యత వహించి పాలకవర్గం రాజీనామ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. హుదూద్‌ తుపాన్‌ పంచదార అమ్మకాల్లో ఫ్యాక్టరీలో చోటు చేసుకొన్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. హుదూద్‌ తుపాన్‌లో రూ.100 కోట్లు నష్టం వచ్చినట్లు అప్పట్లో సుగర్స్‌ చైర్మన్‌ చెప్పారని, వెనువెంటనే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అంత నష్టం వాటిల్లలేదని, నష్టంపై స్పష్టత లేదని తెలిపారు. పంచదార అమ్మకాల్లో చోటుచేసుకున్న అవినీతిపై చేపట్టిన విచారణ కేవలం ఇన్సూరెన్స్‌ నేపథ్యంలోనే జరిగిందని చెప్పారు. అలా కాకుండా పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి పంచదార అమ్మకాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు....

విశాఖ మన్యంలోని బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 97ను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు.  చంద్రబాబునాయుడు బాక్సైట్‌ విషయంలో కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన జిఒలను రద్దు చేసి తను జారీ చేసిన జిఒ 97ను మాత్రం రద్దు చేయడం లేదని తెలిపారు. ఏదైనా జిఒ జారీ అయితే ఐదేళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత ఆ జిఒ ఆటోమెటిక్‌గా రద్దవుతుందని చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆటోమెటిక్‌గా రద్దయ్యే జిఒలను రద్దు చేసినట్లు చంద్రబాబు చెబుతూ గిరిజనులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు....

అమరావతి రాజధాని నగర తొలి నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. నేచర్‌, కల్చర్‌, ఫ్యూచర్‌ అనే మూడు కీలకాంశాల ఆధారంగా అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రణాళికను ఎంపిక చేశారు. తొలిదశలో ఐకానిక్‌ నిర్మాణాలుగా ఈ రెండింటినీ చేపట్టనున్నారు. 3.50 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ, తొమ్మిది లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మాణాలను చేపట్టానున్నారు. వీటికి సుమారు రూ.720 కోట్లు వ్యయం అంచనా వేశారు. ప్రతి నిర్మాణంపైనా సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ భవనాన్ని 210 కుర్చీల సామర్థ్యంతో నిర్మించను న్నారు. ఇది ఉద్దండ్రాయునిపాలెం వద్ద నిర్మాణమ వుతుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన భవనాల నిర్మాణాలకు వివరణాత్మకంగా నమూనా (డిటైల్డ్‌ అర్బన్‌ డిజైన్...

నర్సీపట్నం మున్సిపాలిటీలో పన్నుల మదింపులోనూ, డివిజన్ల ఏర్పాటులోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే దర్యాప్తు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ నోటీసులు ఇవ్వకుండా అపరాధ రుసుము వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. పన్నుల తగ్గింపునకు కృషి చేస్తానని, అపరాధ రుసుము కట్టనవసరం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు కూడా ప్రజల పక్షాన ఉండి పన్నులు తగ్గింపునకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు భరించలేని విధంగా పన్నులు పెంచి, అపరాధ రుసుముతో కట్టాలని మున్సిపల్‌ అధికారులు బెదిరింపులకు దిగడం దుర్మార్గమని, తక్షణమే బెదిరింపులు ఆపాలని...

Pages