ముగిసిన అనంతపురం జిల్లా ప్లీనం

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో రెండ్రోజుల పాటు జరిగిన సిపిఎం జిల్లా ప్లీనం మంగళవారం ముగిసింది. రెండో రోజు సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత 14 నెలల్లో చేపట్టిన పోరాటాలను సమీక్షించుకుని, రాబోయే ఏడాది కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యచరణను రూపొందించారు. రెండు రోజుల ప్లీనంలో రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని, తదితర ఎనిమిది అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాబోయే ఏడాది కాలంలో విద్యా, ఉపాధి, సామాజిక అంశాలపై దృష్టి సారించి పనిచేయాలని ప్లీనంలో నిర్ణయించారు.