ప్రభుత్వ భూదాహన్నివ్యతిరేకిస్తూ..

'అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను అడుగుతున్నాం.. గన్నవరం ప్రాంతంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణను ఎందుకు అడ్డుకోవటం లేదో తేల్చి చెప్పాలి' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భూదాహన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం శాంతిథియేటర్‌ సెంటర్‌లో బుధవారం వామపక్షాల ఆధ్వర్యాన బహిరంగ సభ నిర్వహించారుగన్నవరం ప్రాంతంలో నిజమైన అభివృద్ధి ఎలా జరగాలో గతంలోనే పుచ్చలపల్లి సుందరయ్య చేసి చూపారని గుర్తు చేశారు. కేసరపల్లిలో ఐటి పార్కు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్నారు. రైతులకు నష్టం కలిగించే భూసేకరణకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాల్లోకి రావాలన్నారు. గన్నవరం ఎంఎల్‌ఎ రామవరప్పాడులో బాధితులకు న్యాయం జరిగేలా సిఎంతో మాట్లాడతానని చెప్పారని, కానీ ఆయనతో మాట్లాడటంతోనే సరి పెట్టారని అన్నారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కోసం పేదల ఇళ్లు తొలగించిన వారికి అక్కడున్న పెద్ద హోటల్‌ కనిపించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు.