సీమ హామీలు నెరవేర్చకపోతే బంద్ చేపడతాం..

విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ త్వరలో రాయలసీమ బంద్‌ చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండ పట్టణంలో బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ఆర్‌టిసి బస్టాండ్‌ నుంచి టవర్‌క్లాక్‌ సర్కిల్‌ వరకు ఎర్రజెండాలను చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గాలిమరల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని తెలిపారు. కంపెనీలు ఎకరా మూడున్నర లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయని చెప్పారు. రూ.3 కోట్ల విలువజేసే గాలిమరలను రూ.8 కోటు ్లగా చూపించి బ్యాంకుల నుంచి పెద్దమొత్తంగా రుణాలను ఆయా కంపెనీలు పొందుతున్నాయని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్నీ ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదని విమర్శించారు.