District News

సచివాలయ నిర్మాణ పనుల్లో చట్టాలను అమలు చేయాలని, నిర్భంధాలు వద్దనే డిమాండ్లతో గుంటూరులో రాజకీయ, ప్రజా కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు మాట్లాడుతూ, తాత్కాలిక రాజధాని పేరుతో కార్మికులతో కార్పొరేట్‌ కంపెనీలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని విమర్శించారు.. రాజధాని నిర్మాణ అంశం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాన్ని ఎండగట్టాలన్నారు

ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టే రాజధాని నిర్మాణానికి ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారని సీపీఎం నేతలు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం గురించి గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు వేరే రాష్ట్రం నుండి తీసుకొచ్చిన కార్మికులను ఎంతో గౌరవంగా చూసుకోవాల్సిన అవసరంముందని వారు సూచించారు. ఏపీ తాత్కాలిక రాజధాని వెలగపూడిలో తీవ్ర ఉద్దికత్తల మధ్య సీపీఎం ఎమ్మెల్సీలు ఆ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దాదాపు 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ..వారికి ఎటువంటి మౌలిక సదుపాయాలను కల్పించకుండా పశువులకంటే హీనంగా వారితో పనిచేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఏపీ సర్కారు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. ఏపీ తాత్కాలిక రాజధాని ప్రాంతంలో దేవేందర్ అనే కార్మికుడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గత రెండు రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుడి మృతిపై ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ సీపీఎం నేతలు రాజధాని యాత్ర చేపట్టారు. కార్మికులకు మద్ధతు తెలపాటానికి వచ్చిన నేతలపై పోలీసులు లాఠీ చేశారు. 

వెలగపూడి సచివాలం ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. సచివాలయం నిర్మాణ ప్రాంతంలో కార్మికుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామపక్ష నేతలు కార్మికులకు మద్దతుగా వచ్చిన సీపీఎం నేతలను మంగళవారం నాడు లాఠీ ఛార్జ్ జరిపారు. ఈ ఘటనలో సీపీఎం నేతలను  అరెస్ట్ చేసి పోలీసులు  నిర్భంధంలో వుంచారు.కార్మిక పక్ష నేతలమైన మేము దేనికి భయపడమనీ కార్మికులకు మా మద్ధతు ఎప్పుడూ వుంటుందని వామపక్ష నేతలు పేర్కొంటున్నారు.

కృష్ణా పుష్కరాల పేరు చెప్పి ఘాట్‌ను నిర్మిస్తామని, ప్రజల ఇబ్బందును తొల‌గించేందుకు ఇళ్ళు తొల‌గించాల్సి వస్తుందని మాయమాటలు చెబుతున్న తెలుగుదేశం ఈ ప్రాంతంలో పర్యాటక రంగం పేరుతో సింగపూర్‌, జపాన్‌కంపెనీల‌ వ్యాపారాల కోసం పేదల ఇళ్ళు కూల్చ‌డం అన్యాయం.  వెంటనే ఈ చర్యలు వెనక్కి తీసుకోవాల‌ని కోరుతూ కరకట్టవాసులు శుక్రవారం ఉదయం సైన్స్‌సెంటర్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు శ్రీ సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ కృష్ణాపుష్కరాల‌కు నిజంగా ఇళ్ళు తొగించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే కరకట్ట వాసు ఇళ్ళకు కృష్ణానదికి మధ్యలో పున్నమీ హోటల్‌, సైన్స్‌ సెంటర్‌, ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌ు మరియు స్థలాలు ఉన్నాయి....

ముఖ్యమంత్రి పర్యటనలకొచ్చినప్పుడల్లా సిపిఎం నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడం, వారిని పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం ప్రభుత్వ రివాజుగా మారింది. ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్లినా ఇదే పరిస్థితి. తాజాగా గురువారం విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటను దృష్టిలో పెట్టుకొని మళ్లీ అరెస్టుల పర్వం కొనసా గింది.సిపిఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తిసహా పలువురు సిపిఎం నేతలను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్టు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు పోలీసులు కృష్ణమూర్తి ఇంటికి వెళ్లి ఆయనను ఉన్న పళంగా అరెస్టు చేశారు. ఈ అక్రమాన్ని కుటుంబ సభ్యులు నిలదీసినా పోలీసులు ఆయనను విడిచి పెట్టలేదు. బలవంతంగా జీపు ఎక్కించి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు...

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపే ప్రతిపాదనే రాలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వేస్తున్నారా? అన్న ప్రశ్నకు కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా పార్లమెంట్‌ సమాధానమిస్తూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన రాలేదన్నారు ..

గత నెల రోజులుగా అక్కడ కనీస సౌకర్యాలు, వేతనాలు, ఫిఎఫ్ ,ఇఎస్ఐ కోసం జరుగుతున్న ఆందోళనలో వేడి ఎక్కడ తగ్గడం లేదు..రోజు పోలీసుల అరెస్టులు, మహిళల ఆందోళనలు, ధర్నలు వివిధ ప్రజాసంఘాల సంఘీభావాలు, వివిధ పార్టీల సపోర్టులు..ఇది ఇప్పుడు బ్రాండిక్స్ దగ్గర పరిస్ధితి.. బ్రాండిక్స్ లో లో ఆందోళన చేస్తున్న కార్మికులకు మేము అండగా ఉన్నమంటూ వామపక్షలు కదిలాయి. ఈరోజు బ్రాండిక్స్ కార్మికులు నివాసముండే పూడిమడక, తిమ్మరాజుపేట, హరిపాలెం గ్రామాలు, బ్రాండిక్స్ ప్యాక్టరీ లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సమస్యలు అడిగితెలుసుకున్నారు. కార్మికులతో మమైక మైయ్యారు. సమస్యలపై పోరాటబావుట ఎగువవేస్తామని కార్మికులకు తెలిపారు..

              కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని వామపక్ష నాయకులు స్పష్టం చేశారు. బ్రాండిక్స్‌ కార్మికులకు మద్దతుగా బుధవారం అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట, హరిపాలెం, పూడిమడక గ్రామాల్లో వారు పర్యటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ముఖ్యమంత్రి ఏజెంటుగా పని చేస్తున్నారని, జీతాలు పెంచమంటే నాలుగైదు నెలలు పడుతుందని చెబుతున్నారని తెలిపారు. పోలవరం కాలువకు సంబంధించి జిఒల కంటే ఎక్కువగా బిల్లులు ఇచ్చారని, కాని ఇక్కడ మహిళా కార్మికులకు జీతాలు పెంచడానికి జిఒల పేరుతో తప్పించుకుంటున్నారని విమర్శించారు. విధులకు వెళ్లిన...

 - వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక వైద్య శిబిరాలు
 - బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ 
 - సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం డిమాండ్‌
 - పనసపుట్టు గ్రామాన్ని సందర్శించిన సిపిఎం బృందం
              హుకుంపేట మండలంలోని పనసపుట్టు గ్రామంలో ఆంత్రాక్స్‌ వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. విశాఖ మన్యాన్ని పట్టి పీడిస్తున్న ఆంత్రాక్స్‌ మహ్మామారిని నిర్మూలించేందుకు ప్రభుత్వం నిపుణులైన డాక్టర్లతో 
ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తి...

Pages