District News

గత ప్రభుత్వం కంటే భిన్నంగా పరిపాలిస్తామని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన బిజెపి.. తన రెండేళ్ల పాలనలో వైఫల్యాలు తప్ప సాధించిందేమీ లేదని, ప్రజలపై మరిన్ని భారాలు మోపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లలో దేశ ఎగుమతులు 15 శాతం తగ్గి దిగుమతులు పెరిగాయన్నారు. బుడగ మాదిరి ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని సాక్ష్యాత్తు ఐక్యరాజ్య సమితే తన నివేదికలో పేర్కొందన్నారు. జిడిపి వృద్ధిరేటు విషయంలో కేంద్రం పచ్చి అబద్దాలు చెబుతోందని, అన్ని రంగాల్లో రెండు శాతమే వృద్ధి ఉంటే జిడిపి ఏడు శాతం...

దళితుల భూములపై ప్రభుత్వ పెత్తనం తగదు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు యడవల్లిలో భూములను పరిశీలించిన సిపిఎం బృందం బాధిత రైతులతో సమావేశం, వివరాలు సేకరణ.

సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ పట్టాదారులైన ఎస్‌సిలకు తెలియకుండానే వారి పేరుతో ఉన్న సొసైటీని రద్దు చేసి సంబంధిత భూములను అధికార పార్టీకి చెందిన నాయకులే స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. ముందస్తుగా లభ్దిదారులకు ఎటువంటి నోటీసులు, సమాచారం లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంబంధిత అధికారితో సొసైటీని రద్దు చేయటం భావ్యం కాదన్నారు. గత కొద్దికాలంగా ఈ వ్యవహారంపై విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతున్నా, స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి పత్తిపాటి...

జిల్లాలో ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన అమ‌రావ‌తి అమ‌ర‌లింగేశ్వ‌ర దేవాస్థానానికి చెందిన స‌దావ‌ర్తి స్ర‌తం భూముల వేలంపై సిట్టింగ్ జ‌డ్జీచే విచార‌ణ జ‌రిపించాలి. చెన్నై న‌గ‌రానికి అతి స‌మీపంలో ఉన్న స‌దావ‌ర్తి స‌త్రానికి చెందిన సుమారు 470 ఎక‌రాలు అతివిలువైన భూములున్నాయి. విటిలో ఆక్ర‌మ‌ణ‌లు పోను మిగిలిన 80 ఎక‌రాల‌కు ఇటీవ‌ల వేలం వేసి కారుచౌక‌గా కొంద‌రు పొందిన‌ట్లు తెలుస్తుంది. విలువైన దేవాల‌యా భూముల‌ను వేలం వేసేట‌ప్పుడు ముందుగా త‌గిన ప్ర‌చారం ఇవ్వాలి, నోటిఫికేష‌న్ అన్ని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో ప్ర‌చ‌రించాలి. ఇటువంటివి ఏమి జ‌ర‌గ‌కుండా వేలం వేయ‌డ‌మంటే చ‌ట్ట‌విరుద్ద‌మైన చ‌ర్య‌. స‌మారు 480 కోట్లు విలువ చేసే భూముల‌ను కేవ‌లం 22 కోట్ల‌కే వేలంలో పోంద‌డం అంటే...

 పోలవరం ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపించడానికి అవకాశామున్న పుసుషోత్తపట్నం ప్రాంతం, కాతేరు, పుష్కర ఎత్తిపోతల పథకాలను సిపిఎం బ్రందం పరిశీలించింది. ఈ సందర్భంగా అధ్యయనం బ్రందం తొలి దశలో ఎడమ కాలువ పనులు 58కిలో మీటర్లు వరకు పూర్తిచేసి ఏలేరు నదిలోకి విడిచిపెట్టి ఏలేరు రైతుల ఆయకట్టు 70వేల ఎకరాలకు నీరు అందించడం వల్ల ఏలేరు జలాశయంలో మిగలనున్న 10టిఎంసిల నీటిని విశాఖపట్నం తరలించవచ్చని సూచించారు. రెండో దశలో 58కిలో మీటర్లు నుంచి 162 కిలోమీటర్లు ( ఏలేరు రివర్ క్రాసింగ్ నుంచి తాళ్లపాలెం) వరకు ప్రస్తుతమున్న ఏలేరు నీటిని కెనాల్ ద్వారా నీటిని పంపించవచ్చన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా ప్రజల తాగు, సాగు, పారిశ్రామిక...

 పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు 99 ఏళ్లు లీజుచిచ్చి పట్టణ నడిబొడ్డున ఉన్న కళాశాలను ఊరిచివరకు తరలించడం దారుణమని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ మేరకు తాలుకా సెంటర్‌లోని గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోపోగా పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కళాశాలను తరలించాలనుకోవడం సరికాదన్నారు. దుకాణాలు, వ్యాపారులు, వ్యక్తుల వద్ద అధికార పార్టీ నాయకులు బెదిరింపు వసూళ్లకు పాల్పడడమే కాకుండా ఏకంగా కళాశాల స్థలాన్నే కొద్ది...

కృష్ణంక జాతీయ రహదారి నుంచి ఫీడర్‌ రోడ్డుకు మూడు చోట్ల సబ్‌మే, అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటు చేయాని సిపిఎం తపెట్టిన ధర్నా అరెస్ట్‌కు దారి తీసింది. కృష్ణంక సత్యం హోటల్‌ సమీపంలో బుధవారం సిపిఎం తూర్పు`1 జోన్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నా అనంతరం జాతీయ రహదారిపై ఆందోళనకాయి రాస్తారోకోకు దిగారు. జాతీయ రహదారి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాస్తారోకో చేసి విరమిస్తామని సిపిఎం నాయకు చేసిన విజ్ఞప్తిని ఖాతరు చేయకుండా పోలీసు సిబ్బంది తరలి వచ్చి ఆందోళనకారును దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్‌ు చేశారు. ఈ సందర్బంగా జాతీయ రహదారిపై కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుకు, ఆందోళనకారు మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. సబ్‌మే ఏర్పాటు చేయాని,...

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజయవాడ విద్యార్థులు రాజ కీయ కోణంలో ప్రశ్నలు సంధించి ఝలక్‌ ఇచ్చారు. ఆమె విజయవాడ కెబిఎన్‌ కళాశాల విద్యార్థులతో మంగళవారం ఏర్పాటైన ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులు, వర్సిటీల్లో రాజకీయాలు తదితర అంశాలపై విద్యార్థులు పలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై వెనకడుగు ఎందుకని శ్రీదుర్గ అనే ఎంసీఏ విద్యార్థిని మంత్రిని ప్రశ్నించారు. అది తన పరిధిలోని విషయం కాదని మంత్రి జవాబు దాట వేశారు. 

రాష్ట్ర విభజనతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు హోదా వచ్చిందే తప్ప.. రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా రాలేదని, పైగా తన కొడుక్కీ మంత్రిగా హోదా ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. 

సిపిఎం రాష్ట్ర కమిటీ మూడు రోజుల సమావేశాలు మంగళవారం భీమవరంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ధాన్యానికి ధర లేదు, పామాయిల్‌కు ధర లేదు.. ప్రజలు కొనే వస్తువుల ధరలు మాత్రం మండిపోతున్నాయని విమర్శించారు. కౌలురైతులకు రక్షణగా పెద్దఎత్తున పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్లే రిజర్వేషన్లపై ఉద్యమాలు వస్తున్నాయన్నారు. తుందుర్రు ఫుడ్‌పార్క్‌ నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోందని, అదే జరిగితే పెద్దఎత్తున పోరాటం తథ్యమని అన్నారు. 

నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు ముందు గుజరాత్ లోని మితివిర్ధిలో నిర్మించి వలసిన అణు విద్యుత్ కేంద్రాన్ని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడకు తరలిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించడాన్ని సిపియం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని విశాఖ సిపియం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్లు సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  సిహెచ్.నరసింగరావు తెలిపారు .

Pages