District News

జనసేనపార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతపురంలోని స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకు పవన్ సభ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, అనంతపురంలో ఉన్న‌ కరువుపై పవన్ కల్యాణ్ స్పందించనున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేట నుంచి దివీస్‌ కంపెనీని తొలిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.కంపెనీని తొలగించకపోతే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తొండంగి మండలం దానవాయిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం నిర్వహించతలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎంరాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా క‌నిపిస్తున్న కాకినాడ స్మార్ట్ సిటీ వాసుల స‌మ‌స్య‌ల‌పై సీపీఎం ఉద్య‌మం ప్రారంభించింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల సాధ‌న కోసం పాద‌యాత్ర సాగిస్తోంది. కాకినాడ‌లో ఇంద్ర‌పాలెం వంతెన వ‌ద్ద ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యురాలు బేబీరాణి జెండా ఊపి యాత్ర‌ను ప్రారంభించారు. ద‌ళిత సంఘాల నేత‌లు రామేశ్వ‌ర రావు సహా ప‌లువురు మ‌ద్ధ‌తు తెలిపారు.న‌గ‌రంలోని ద‌ళిత‌, మ‌త్స్య‌కార పేట‌ల్లో పేరుకుపోయిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని నేత‌లు డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు పాద‌యాత్ర న‌గ‌రంలోని అన్ని డివిజ‌న్ల‌లోనూ సాగుతుంద‌న్నారు. 

విజయవాడ కొండ ప్రాంతాల్లోని ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేస్తానని ఎన్నికల సమయంలో చేసిన హామీని అమలు చేయాలని కోరుతున్న కమ్యూనిస్టులపై చంద్రబాబు అవకులు చెవాకులు పేలుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.31వ డివిజన్‌ తల్లీపిల్లల సంరక్షణా వికాస కేంద్రం వీధిలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజినీ, ఆ డ్రైనేజీలోనే మంచినీటి పైపులైన్లు ఉండటాన్ని పరిశీలించారు. ఏసురత్నం వీధి కొండ ప్రాంత ప్రజలతో మాట్లాడిన సందర్భంలో మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దోమల బెడదతో అల్లాడి పోతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని, డ్వాక్రా రుణ మాఫీ సక్రమంగా జరగలేదని, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారనీ, కానీ ఎవరికీ జాబు రాలేదని వివరించారు.

నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరో సారి ప్రమాదం సంభవించింది.గ్యాస్ లీక్ అయి 27మంది కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వీరింకా డిశార్జ్ కాకముందే మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం అస్వస్థతకు గురయినవారికి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో  రాజుపాలెం మండలం రెడ్డిగూడం లో వరద బాధితులకు  సిపిఎం  సహాయక కార్యక్రమాలు చేపట్టింది . ఇందులో  భాగంగా సుమారు 1000 మందికి భోజనం ,ఇతర అవసరాలు చేకూర్చుతున్నారు. 

విజయ వాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన 'జాషువా సాం స్కృతిక వేదిక' ఆవిర్భావ సభకు పిడిఎఫ్‌ ఎంఎల్‌సి శర్మ అధ్యక్షత వ హించి ప్రసంగించారు. సాంస్కృతిక వికాసం కోసం ఈ వేదిక కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశభక్తికి కొలమానాలు పెడుతున్నారని, కవులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృతి ఔన్నత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎ.పి కి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అమ‌లాపురంలోని గ‌డియార స్ధంబం సెంట‌ర్‌లో వామ‌ప‌క్షాల ఆధ్వర్యంలో  ప్ర‌జాబ్యాలెట్ ఏర్పాటు చేశారు.. స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిర్ణయాన్ని తెలపాలని విజ్ఞప్తి చేశారు .

జిల్లాలో సోలార్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం రైతుల భూములు లాక్కోవడం దారుణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అన్నారు. కర్నూలు జిల్లాలోని ప్లాంట్‌ నిర్మాణం జరగబోయే గ్రామాల్లో ఆయన పర్యటించారు. పంట భూముల్లో ప్లాంట్‌లు నిర్మించి, ఎవరిని ఉద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులపై కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రైతులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభత్వంపైనే ఉందని చెప్పారు. 

విశాఖపట్టణంలో సీపీఎం నేతల ఆత్మీయసమావేశం జరిగింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల సీనియర్ సీపీఎం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో సీపీఎం పోలిట్ బ్యూరో మెంబర్ బీవీ.రాఘవులతో పాటు సీనియర్ నేత చౌదరీ తేజేశ్వరావు, సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షుడు నర్సింగరావు, సీపీఎం నేతలు పుణ్యవతి, ఎంవీఎస్.శర్మ ఉన్నారు. ఎమర్జెన్సీ రోజుల నుంచి విద్యార్ధి , కార్మిక, వామపక్ష ఉద్యమంలో పాలుపంచుకున్న మిత్రులందరం ఓసారి కలుసుకుని ఆ పాత జ్ఞాపకాలను పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం పొలిట్ బ్యూరోసభ్యులు బీవీ రాఘవులు తెలిపారు.

Pages