విజయవాడ కొండ ప్రాంతాల్లోని ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తానని ఎన్నికల సమయంలో చేసిన హామీని అమలు చేయాలని కోరుతున్న కమ్యూనిస్టులపై చంద్రబాబు అవకులు చెవాకులు పేలుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.31వ డివిజన్ తల్లీపిల్లల సంరక్షణా వికాస కేంద్రం వీధిలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజినీ, ఆ డ్రైనేజీలోనే మంచినీటి పైపులైన్లు ఉండటాన్ని పరిశీలించారు. ఏసురత్నం వీధి కొండ ప్రాంత ప్రజలతో మాట్లాడిన సందర్భంలో మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దోమల బెడదతో అల్లాడి పోతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని, డ్వాక్రా రుణ మాఫీ సక్రమంగా జరగలేదని, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారనీ, కానీ ఎవరికీ జాబు రాలేదని వివరించారు.