పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కనిపిస్తున్న కాకినాడ స్మార్ట్ సిటీ వాసుల సమస్యలపై సీపీఎం ఉద్యమం ప్రారంభించింది. ప్రజా సమస్యల సాధన కోసం పాదయాత్ర సాగిస్తోంది. కాకినాడలో ఇంద్రపాలెం వంతెన వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బేబీరాణి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దళిత సంఘాల నేతలు రామేశ్వర రావు సహా పలువురు మద్ధతు తెలిపారు.నగరంలోని దళిత, మత్స్యకార పేటల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు పాదయాత్ర నగరంలోని అన్ని డివిజన్లలోనూ సాగుతుందన్నారు.