District News

వ్యవసాయ భూములు లాక్కుని కార్పొరేట్‌, విదేశీ కంపెనీలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లి, కొలనుకుదురు గ్రామాల్లో బుధవారం ఆయన పాదయాత్ర చేశారు. కట్టువపల్లిలోని సర్వే నెంబర్‌ 110 నుండి 900 వరకున్న 936 ఎకరాల భూములను చైనా కంపెనీ డలయన్‌ వాండాకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ కంపెనీ ప్రతినిధి మ్యాక్సూఅబౌట్‌ ఇటీవల ఆ భూములను పరిశీలించి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాగిన పాదయాత్రలో పలువురు రైతులతో మధు నేరుగా మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ 10...

రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గ్యాంబ్లింగ్‌ గేమ్‌ను తలపిస్తోంది. ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ ఇద్దరు కీలక అధికారులను మార్చేసింది. ఒకరికి రాజధాని ఎంఓయుపై అవగాహన ఉంటే, మరొకరికి ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియపై అవగాహనుంది. వీరిలో ఒకరు దొండపాటి సాంబశివరావు కాగా, మరొకరు ఆర్మానే గిరిధర్‌. రాజధానిపై జరిగిన ఒప్పందాలు, జరుగుతున్న తీరుపై వీరికి పూర్తి అవగాహన ఉంది. వీరిద్దరినీ తొలగించడం ద్వారా రాజధాని నిర్మాణ ప్రక్రియపై ముఖ్య మంత్రికి, క్రిడా కమిషనర్‌కు తప్ప మరెవరికీ పూర్తిస్థాయి అవగాహన లేని పరిస్థితి ఏర్ప డింది.

72వార్డుల్లో పాదయాత్రలు, సభలు, గ్రూపుమీటింగ్‌లు
    ఆగష్టు 12, 14 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు
    లక్షలాది కరపత్రాలు, బుక్‌లెట్స్‌తో ప్రచారం.

    విశాఖనగరం స్మార్ట్‌సిటీగా ప్రకటించారు. సామాన్య మద్యతరగతి, పేద ప్రజల సమస్యలు పట్టించుకొనే నాధుడే లేడు. ఫలితంగా నగర ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక ప్రపంచబ్యాంకు సంస్కరణలు కూడా శరవేగంగా నగరంలో అమలు చేస్తున్నారు. పౌరసేవలను ప్రైవేటీకరిస్తున్నారు. కొండలు, భూములు, సముద్రతీరం, ఇతర వనరులను విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌సంస్థలకు ధారాధత్తం చేస్తున్నారు. జివిఎంసికి ఎన్నికలు పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో...

గూడూరులో జరిగిన కామ్రేడ్ ఇందుకూరు జనార్ధన్ రెడ్డి ప్రధమ వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మీటింగ్ హాలుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ,స్థానిక సిపిఎం నాయకులు,పార్టీ అభిమానులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ బుధవారం ఉదయం విచారణ ప్రారంభించింది. నెల్లూరు విక్రమసింహ వర్సిటీ వైస్ ఛాన్సలర్ వీరయ్య, వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలకృష్ణమనాయుడు, పద్మావతి వర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 

రాజధాని ప్రాంతంలో డ్వాక్రా మహిళలకు ఏకకాలంలో రూ. లక్ష రుణ మాఫీ చేయకపోతే గ్రామాల్లో ఉన్న క్రిడా కార్యాలయాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి హెచ్చరించారు. రూ. లక్ష రుణమాఫీ తక్షణం అమలు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరులోని క్రిడా కార్యాలయం ఎదుట మంగళవారం డ్వాక్రా మహిళలు నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా మహిళలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు, ఇప్పుడు వాయిదాల పద్ధతిలో రుణమాఫీ చేస్తామనడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు తమ తడాఖా చూపిస్తారని హెచ్చరించారు. ఏడాదిన్నరగా రుణ బకాయిలు కట్టని మహిళలు ప్రస్తుతం చేసేందుకు పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో...

ఉమ్మడి రాజధానిలో కాకుండా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచే పాలన సాగించే ప్రక్రియలో వేగం పెంచేందుకు ఏపీ సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం నుంచి పాలన సాగించేదిశగా ఏపీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. పలు శాఖల కార్యాల‌యాల త‌ర‌లింపున‌కు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వారానికి 3 రోజులు రాజ‌ధాని నుంచి పాలిస్తున్న సీఎం పూర్తిస్థాయిలో అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయ‌డానికి అనువైన ప్రైవేట్ భవనాలను ప‌రిశీలించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న బాబు.. ఇరిగేషన్‌కు సంబంధించిన 9 కార్యాలయాల‌ను తరలించటానికి చర్యలు...

పేద‌ల సాగులో ఉన్న అట‌వీ భూముల‌ను స్వా‌ధీనం చేసుకోవ‌ద్ద‌ని కోరుతూ సిపిఎం ఆధ్వ‌ర్యంలో కృష్ణా జిల్లా మైల‌వ‌రం జాతీయ ర‌హ‌దారిపై రాస్తా‌రోక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాష్ర్ట కార్య‌ద‌ర్శి పి.మ‌ధు ను పోలీసులు అరెస్టు చేశారు. త‌ద‌నంత‌రం పోలీసులు మైల‌వ‌రం పోలీసు స్టే‌ష‌న్ కు త‌ర‌లించారు. పోలీసుల‌కు పేద‌ల‌కు మ‌ద్య వాగ్వా‌దం జ‌రిగింది. పోలీసులు విచ‌క్ష‌ణ ర‌హితంగా వారిని ఈడ్చి పారేశారు.  

కృష్ణాజిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూమిలో సాగుచేస్తున్న పేదలను తొలగించరాదని సీపీఎం ఆందోళన చేసింది. మైలవరం మార్కెట్‌యార్డు దగ్గర హైవేపై బైఠాయించి నేతలు ధర్నా చేశారు. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ కార్యదర్శి మధుతో పాటు సీపీఎం నేతలు, వందలాది మంది చిన్న, సన్నకారు రైతులు పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మధు మాట్లాడుతుండగా పోలీసులు మైక్‌ లాక్కొని...ఆయన్ను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు, సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీభూముల్లో సాగును అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని...

విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)ను రాష్ట్రప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని, దీనిని ప్రైవేట్‌పరం చేయరాదని డిమాండ్‌ చేస్తూ నేడు విశాఖజిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద సిపిఐ(యం) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
    ఈ కార్యక్రమంలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ విమ్స్‌ ఆసుపత్రి నిర్మాణం మొదటి దశ పూర్తయి మూడేళ్ళు అయినా రాష్ట్రప్రభుత్వాలు వివక్షత, నిర్లక్ష్యం వల్ల నేటికీ ప్రారంభానికి నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఇటీవ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు విమ్స్‌ను ప్రభుత్వ-ప్రైవేట్‌-భాగస్వామ్యం (పిపిపి) పేర బడా కార్పొరేట్‌ సంస్థలకి ధారాధత్తం...

Pages