పెద్ద నోట్ల రద్దు చేసి ప్రజలను ఎనలేని ఇబ్బందుల్లోకి నెట్టిన ప్రధాని మోడీ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ చేపట్టిన హర్తాళ్ రాష్ట్రంలో విజయవంతమైంది..హర్తాళ్‌కు వివిధ వర్గాల ప్రజల నుంచి స్వచ్ఛంద మద్దతు లభించింది. ప్రభుత్వం ఒత్తిడి పెంచినప్పటికీ విద్యా, వ్యాపార సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా సహకరించారు. పోలీసులు నిరసన ప్రదర్శనలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలను మూసివేశారు. వాణిజ్య, విద్యాసంస్థలూ మూతపడ్డాయి.