
పేదల కోసమని పెదరావూరులో సేకరించిన భూమిని అర్హులకు పంపిణీ చేయకుంటే ఆ భూమిలో సిపిఎం జెండాలు పాతి పంచుతుందని ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి చెప్పారు. 11 రోజులుగా సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం వైకుంఠపురం కాల్వకట్ట, నరేంద్రదేవ్‌కాలనీ, హడ్కోకాలనీ, చినరావూరు తోట, చినరావూరు డొంక తదితర ప్రాంతాల్లో సాగింది. 50 ఏళ్ల నుండి వైకుంఠపురం కాల్వకట్ట, చినరావూరు డొంక రోడ్డులలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామని, పట్టాల కోసం నాయకులను వేడుకుంటుంటూ పదేళ్ల నుండి ఊరుకుని గెలిచి రెండేళ్లే అయిన మమ్మల్ని అడిగితే ఎక్కడి నుండి తెస్తామని అంటున్నారని వాపోయారు. పాముల భయం, దోమల ఉధృతి, అంటు రోగాలతో నిత్యం సతమతమవుతున్నామని ఆవేదనకు గురయ్యారు. గృహ నిర్మాణానికి రూ.50 వేలు డిపాజిట్ చేయాలంటున్నారని, కూలి, పాచి పనులు చేసుకునే వాళ్లం ఎలా చెల్లించగలమని అన్నారు. ఎన్‌టిఆర్ నగర్‌లో పందులు సంచారం, డ్వాక్రా రుణాలు, రేషన్ కార్డులు సమస్యలపై తమ సమస్యలను వెళ్లబోసుకున్నారు.